బైకర్స్ కోసం మోటర్ సైకిల్ మోడ్...గూగుల్ మ్యాప్స్ నుంచి కొత్త ఫీచర్!

By: Madhavi Lagishetty

గూగుల్ కొత్త ఫీచర్ ను యాడ్ చేసింది. ఈ యాప్ లో బైకర్స్ కోసం టూ వీలర్ మోడ్ అనే సరికొత్త ఫీచర్ను గూగుల్ మ్యాప్ లో యాడ్ చేసింది. ఈ మోడ్ తో బైకర్స్ వాటి కోసం నావిగేషన్ను ప్రత్యేకంగా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫోర్ వీలర్ కోసం అందుబాటులో లేదు.

 బైకర్స్ కోసం మోటర్ సైకిల్ మోడ్...గూగుల్ మ్యాప్స్ నుంచి కొత్త ఫీచర్!

గూగుల్ మ్యాప్స్ మార్గాలను మరియు ETAలను చూపిస్తుంది. ( ఎస్టిమెటేడ్ టైం అరైవల్) ఇవి బైకర్లకు ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. రహదారిపై ప్రయాణించే ఫోర్ వీలర్ నుంచి అంచనా వేసే సంప్రదాయ ETA డేటా నుంచి కాకుండా, రైడర్ల నుంచి ప్రత్యేకంగా తెలుసుకున్న డేటా ఆధారంగా ETA అంచనా వేయబడుతుంది.

చివరికి మోటారు వాహనాల డ్రైవర్ల కంటే బైకర్స్ మరింత స్వేచ్చగా తరలిస్తుంది. కాబట్టి రెండింటి మద్య భారీ వ్యత్యాసం ఉంటుంది. టూవీలర్స్ ఎక్కువ దూరం ప్రయాణించడానికి సమయం చూపిస్తుంది.

ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం, గూగుల్ మ్యాప్స్ మోటార్ సైకిల్ మోడ్ భారతదేశం వంటి అభివ్రుద్ది చెందుతున్న దేశాల్లో నివసించేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కార్లు, బైకర్లు ఒకే ప్రయోజనాన్ని పొందేందుకు ఎలాంటి మార్గాలు లేవు.

ఇండియాలో లభ్యమవుతున్న టాప్ షియోమి స్మార్ట్‌ఫోన్లు ఇవే !

ఈ సర్వీస్ ఇప్పటికే భారతదేశంలో అప్ డేట్ అయ్యింది. గూగుల్ మ్యాప్స్ ఈయాప్ ను మరింత అప్ డేట్ చేయనుంది. కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ కోసం గూగుల్ మ్యాప్స్ యొక్క 9.67.1 వెర్షన్ లో చేర్చబడింది.

అప్ డేట్ ను పొందిన తర్వాత భారత్ లోని యూజర్లు సాధారణంగా నావిగేషన్ లేదా గెట్ దిశలు వంటి ట్యాబ్లలో చేర్చబడిన వల్క్ మరియు డ్రైవ్ ఆప్షన్స్ తోపాటు టూ వీలర్ ఆప్షన్ను పొందుతారు. ఈ ఫీచర్ ఇప్పుడు మాత్రమే ప్రారంభించారు కాబట్టి, బైకర్ల కోసం ఖచ్చితమైన ETAను అంచనా వేయడానికి కంపెనీ కొన్ని వారాలు సమయం తీసుకోనుంది.

గూగుల్ మ్యాప్స్ లో మోటర్ మోడ్ను చూడటం అనేది బెస్ట్ ఆప్షన్ అయినప్పటికీ రైడర్లు ఇప్పుడు ప్రతిరోజూ నావిగేషన్ వివరాలను చెక్ చేయడానికి సేఫ్ గా లేరని గుర్తుంచుకోవాలి.

Read more about:
English summary
Google Maps has got the Motorcycle Mode aka Two-wheeler mode for the riders and the feature is already live in India.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting