గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాఫిక్ ని అంచనా వెయ్యడం

By: SSN Sravanth Guthi

గూగుల్, ఒక కొత్త ఫీచర్ ని గూగుల్ మ్యాప్ కి అదనంగా అందించింది. దీని ద్వారా యూజర్ తన గమ్యం చేరడానికి ఏది మంచి సమయమో ఇది సూచిస్తుంది. సరైన ట్రాఫిక్ అప్డేట్స్ ని ప్రస్తుత గమ్యానికి జోడించడం ద్వారా తొందరగా చేరేందుకు తేలికైన మార్గాలను సూచిస్తుంది.

గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాఫిక్ ని అంచనా వెయ్యడం

ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ లో గల గూగుల్ మ్యాప్స్ కి మాత్రమే ఉంది. మీరు గతంలో వెళ్లిన అదే గమ్యానికి ఇప్పుడు వెళ్లినట్లయితే, దానికి సంబంధించిన ట్రాఫిక్ అప్డేట్స్ ని ముందుగా విశ్లేషించి, మీరు ఏ టైమ్ లో ట్రావెల్ చెయ్యాలో ఊహించి తెలియజేస్తుంది.

దీని వాడకం చాలా తేలిక. యూజర్, సెర్చ్ బార్ లో సూచించిన గమ్యానికి చేరుకోగానె ఈ ఫీచర్ సంకేతాలు ఇస్తుంది. గమ్యాం యొక్క దూరాన్ని మరియు చేరుకునే సమయాన్ని బార్ గ్రాఫ్ ద్వారా చూపిస్తుంది. ప్రస్తుత ట్రాఫిక్ (రద్దీగా, సాఫీగా) పరిస్థితులను పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో 2 గంటల వ్యవధి వరకూ అంచనా వేసి సూచిస్తుంది.

ఈ ఫీచర్ ద్వారా మనకు తెలియజేసే (అది సమయమైన, లేక ట్రాఫిక్ గూర్చి అయినా) విషయాలన్నీ ఖచ్చితమైనవి అని చెప్పలేదు. కాని ఇది ట్రిప్ ని ప్లాన్ చేసుకోడానికి చాలా ఉపయోగకరమైనది.

ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకి మాత్రమే అందుబాటులోకి ఉంది. ఐఎస్ఓ యూజర్లు మాత్రం ఇంకాస్త వెయిట్ చెయ్యాలి. ఈ ఫీచర్ ఇంకాస్త మెరుగైన సేవలను అందించాలని కోరుకుందాం.

Read more about:
English summary
Google Maps is offering a new feature to its users that allows them to have a look at the upcoming and past traffic conditions on a specific route.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot