గూగుల్ మ్యాప్స్ లో 5 కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి?
Google Maps ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ వస్తోంది. వినియోగదారులకు వారి వ్యక్తిగత సమాచారంపై మరింత నియంత్రణను అందించడానికి రూపొందించబడిన అనేక ప్రైవసీ ఫీచర్‌లను ప్రకటించింది. మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ ప్రకటించింది.
ఈ కొత్త ఫీచర్లు ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులకోసం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి వస్తాయని, వినియోగదారులు తమ ఖాతాకు అప్‌డేట్ అందుబాటులోకి వచ్చినప్పుడు కొత్త నోటిఫికేషన్‌ను స్వీకరిస్తారని చెప్పారు.

ఈ గూగుల్ మ్యాప్స్ లో రాబోతోన్న కొత్త ఫీచర్ల గురించి బ్లాగ్ పోస్ట్‌లో, గూగుల్ ప్రకటించింది: "మీ లొకేషన్ సమాచారం వ్యక్తిగతమైనది. మేము దీన్ని సురక్షితంగా, ప్రైవేట్‌గా మరియు మీ నియంత్రణలో ఉంచడానికి కట్టుబడి ఉన్నాము... కాబట్టి మీరు మీ డేటా గురించి చింతించాల్సిన అవసరం లేదు మరియు కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి, మీరు ఎక్కడికి వెళ్లాలి లేదా స్నేహితులతో గడపడానికి ఎక్కువ సమయం వెచ్చించవచ్చు. అన్నింటికి మ్యాప్స్ మీకు సహాయపడుతుంది." దీని కోసం 5 కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలియచేసింది.
లొకేషన్ డేటాపై మరింత నియంత్రణ అందిస్తుంది:
వినియోగదారుల లొకేషన్ డేటాను నేరుగా వారి పరికరంలోనే నిల్వ చేయడాన్ని త్వరలో ప్రారంభిస్తామని గూగుల్ మంగళవారం తెలిపింది, ఈ చర్య వినియోగదారులకు వారి డేటాపై మరింత నియంత్రణను ఇస్తుందని ప్రచారం చేయబడింది. ముఖ్యంగా, లొకేషన్ హిస్టరీ సెట్టింగ్ ని డిఫాల్ట్‌గా ఆఫ్ చేయబడింది మరియు వినియోగదారులు తమ లొకేషన్ టైమ్‌లైన్‌లోని మొత్తం లేదా కొంత భాగాన్ని ఎప్పుడైనా తొలగించగలరు లేదా ఈ సెట్టింగ్‌ను పూర్తిగా ఆఫ్ చేయగలరు.
క్లౌడ్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్:
వినియోగదారులు తమ లొకేషన్ డేటాను కోల్పోకుండా రక్షించుకోవడానికి క్లౌడ్‌కు బ్యాకప్ చేసుకోవచ్చు మరియు క్లౌడ్‌లో నిల్వ చేయబడిన ఈ డేటా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుందని గూగుల్ చెబుతోంది. అంటే తుది వినియోగదారు తప్ప మరెవరూ దీనిని యాక్సిస్ చేయలేరు. కొత్త ఫోన్ కు మారుతున్నప్పుడు లేదా తమ ప్రస్తుత ఫోన్ ని కోల్పోయే ప్రమాదం ఉన్న వినియోగదారులకు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది.
లొకేషన్ హిస్టరీ విధానానికి మార్పులు వచ్చాయి:
లొకేషన్ హిస్టరీని ఆటోమేటిక్ గా తొలగించడం కోసం ఇప్పుడు మూడు నెలల డిఫాల్ట్ టైమ్‌లైన్‌ని సెట్ చేస్తామని గూగుల్ ప్రకటించింది. అంటే దాని కంటే పాత డేటా ఏదైనా ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది. ఈ అప్‌గ్రేడ్ చేయడానికి ముందు, గూగుల్ మ్యాప్స్ డేటా డిఫాల్ట్‌గా 18 నెలల తర్వాత ఆటో-డిలీట్ అయ్యేలా సెట్ చేయబడింది. అయినప్పటికీ, వినియోగదారులు తమ లొకేషన్ హిస్టరీ యొక్క వ్యవధిని పెంచడానికి లేదా ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్‌లను ఆఫ్ చేయడాన్నీ ఇప్పటికీ ఎంచుకోవచ్చు.
ఒక లొకేషన్ కి సంబందించిన మొత్తం డేటాను తొలగించే ఫీచర్:
గూగుల్ మ్యాప్స్ వినియోగదారులు త్వరలో కొన్ని సాధారణ దశల్లో మ్యాప్స్ లో ఒక లొకేషన్ కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తొలగించగలరు. గూగుల్ మ్యాప్స్ యాప్‌లో ఒక లొకేషన్ డేటాను తీసివేయడానికి గూగుల్ ఇప్పటికీ మీకు ఆప్షన్ ను అందిస్తున్నప్పటికీ, కొత్త సెట్టింగ్‌లు గూగుల్ వెబ్ మరియు యాప్ యాక్టివిటీకి సంబంధించిన డేటాను ఒకేసారి తీసివేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయని ప్రకటనలో తెలియచేస్తోంది.
మ్యాప్ లో నీలి చుక్కకు మార్పులు వచ్చాయి:
గూగుల్ మ్యాప్ యాప్‌లోని బ్లూ డాట్, గతంలో యూజర్‌లకు వారి లొకేషన్‌ను చూపించిందని, ఇప్పుడు వారు కొన్ని ముఖ్యమైన ప్రైవసీ సెట్టింగ్‌లను కూడా చూసేందుకు వీలు కల్పిస్తుందని గూగుల్ తెలిపింది. ఈ నీలిరంగు చుక్కపై నొక్కడం ద్వారా, వినియోగదారులందరూ ఇప్పుడు వారి లొకేషన్ హిస్టరీ లేదా టైమ్‌లైన్ సెట్టింగ్‌లు ఆన్ చేయబడిందా లేదా వారు తమ పరికరం యొక్క స్థానాన్ని Maps యాక్సెస్‌ని అందించారా అని చూడగలరు.


Click it and Unblock the Notifications








