Google Maps లో నావిగేషన్ కోసం ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఇదే!!!

|

ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ప్రస్తుత పరిస్థితులలో తెలియని ప్రదేశాలలో సరైన చోటికి వెళ్ళడానికి నావిగేట్ చేయడానికి, ట్రాఫిక్‌ను అంచనా వేయడానికి మరియు ప్రయాణించేటప్పుడు ఉత్తమ మార్గాలను కనుగొనడంలో సహాయపడే అత్యంత ప్రజాదరణ పొందిన నావిగేషన్ యాప్ లలో గూగుల్ మ్యాప్స్ ఒకటి. ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు ఆఫ్‌లైన్ లో కూడా గూగుల్ మ్యాప్స్ పని చేస్తుంది. మీ యొక్క స్థానం యొక్క సమాచారాన్ని ఖచ్చితంగా అందిస్తున్న గూగుల్ మ్యాప్స్ పని చేయడం వెనుక అద్భుతమైన టెక్నాలజీని కలిగి ఉంది. సంస్థ యొక్క బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ మ్యాప్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను గూగుల్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగించే నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్ ఉపయోగించే టెక్నాలజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాఫిక్ వివరాల అంచనా విధానం

గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాఫిక్ వివరాల అంచనా విధానం

ఏదైనా పెద్ద పెద్ద సిటీలలో సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవడానికి లైవ్ ట్రాఫిక్ పరిస్థితులను అందించడానికి గూగుల్ మ్యాప్స్ ఒక ప్రాంతంలోని వినియోగదారులందరి మొత్తం స్థాన డేటాను ఉపయోగిస్తుంది. కానీ ఇది ట్రాఫిక్‌ను అంచనా వేయడానికి విభిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది.

Also Read:Flipkart లో వీటిపై 80% వరకు ఆఫర్లు. కొనడానికి ఇదే మంచి అవకాశం.Also Read:Flipkart లో వీటిపై 80% వరకు ఆఫర్లు. కొనడానికి ఇదే మంచి అవకాశం.

ట్రాఫిక్‌ను అంచనా వేయడానికి గూగుల్ మ్యాప్స్

ట్రాఫిక్‌ను అంచనా వేయడానికి గూగుల్ మ్యాప్స్

ఒక నిర్దిష్ట సమయంలో ట్రాఫిక్‌ను అంచనా వేయడానికి గూగుల్ రహదారి యొక్క చారిత్రక ట్రాఫిక్ నమూనాలను రికార్డ్ చేస్తుంది. అంటే రోడ్ల యొక్క చారిత్రక ట్రాఫిక్ విధానాలను విశ్లేషిస్తుందని గూగుల్ తెలిపింది. ఉదాహరణకు బెంగుళూరులో BTM రోడ్ లో సాధారణంగా 6-7am మధ్య 35mph వేగంతో ప్రయాణించే వాహనాలు ఉన్నాయని ఒక నమూనా చూపిస్తుంది. కాని మధ్యాహ్నం 15-20mph వద్ద మాత్రమే ఉంటుంది. చారిత్రక ట్రాఫిక్ నమూనాల ఈ డేటాబేస్ను లైవ్ ట్రాఫిక్ పరిస్థితులతో మిళితం చేసి రెండు సెట్ల డేటా ఆధారంగా అంచనాలను రూపొందిస్తుంది అని గూగుల్ తెలిపింది.

ఖచ్చితమైన సమయాన్ని మెరుగుపరచడానికి

ఖచ్చితమైన సమయాన్ని మెరుగుపరచడానికి

డీప్‌మైండ్ AI గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్‌లో ఒక భాగం. వినియోగదారుడు తన గమ్యాన్ని చేరుకునే సమయంలో ఏ సమయంలో మంచి ఖచ్చితత్వంతో అంచనా వేయడానికి గ్రాఫ్ న్యూరల్ నెట్‌వర్క్స్ అనే మెషీన్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించడానికి గూగుల్ మ్యాప్స్ దానితో భాగస్వామ్యం కలిగి ఉంది.

ట్రాఫిక్ పూర్తి సమాచారం కోసం

ట్రాఫిక్ పూర్తి సమాచారం కోసం

ట్రాఫిక్ యొక్క ఖచ్చితమైన డేటాను అందించడానికి మరియు ట్రాఫిక్‌ను అంచనా వేయడానికి గూగుల్ మ్యాప్స్ ఆ ప్రాంతం యొక్క 13 సంవత్సరాల డేటాపై ఆధారపడుతుంది.

గూగుల్ మ్యాప్స్ తక్కువ ట్రాఫిక్ రహదారులను సూచించే విధానం

గూగుల్ మ్యాప్స్ తక్కువ ట్రాఫిక్ రహదారులను సూచించే విధానం

ఒకానొక దశలో ట్రాఫిక్ భారీగా మారే అవకాశం ఉందని గ్రహించినట్లయితే గూగుల్ మ్యాప్స్ మీకు స్వయంచాలకంగా తక్కువ ట్రాఫిక్ ఉన్న ధరలను దానికి ప్రత్యామ్నాయంగా కూడా అందిస్తుంది. ఇందులో రహదారి పరిమాణం మరియు లైవ్ ను కూడా పరిశీలించి బహుళ రహదారిపై చిన్న రహదారిని తీసుకోవడం కంటే హైవేపైకి వెళ్లడం చాలా సమర్థవంతంగా ఉంటుంది అని గూగుల్ పోస్ట్‌లో వివరించారు. దీని కోసం గూగుల్ మ్యాప్స్ అల్గోరిథం మిషిన్ లెర్నింగ్ ను ఉపయోగిస్తుంది. 

Best Mobiles in India

Read more about:
English summary
Google Maps Top 5 Feature You Should Know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X