Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 14 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే రోజు గూగుల్ డబ్బులిస్తుంది..
గూగుల్ ఎట్టకేలకు తన 'గూగుల్ ఓపీనియన్ రివార్డ్స్' (Google Opinion Rewards) యాప్‌ను ఇండియాలో విడుదల చేసింది. గూగుల్ సర్వేస్ టీమ్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇండియాతో పాటు సింగపూర్ ఇంకా టర్కీ దేశాల్లో ఒపీనియన్ రివార్డ్స్ యాప్ అందుబాటులో ఉంటుంది.

గూగుల్ ప్లే క్రెడిట్
ఈ యాప్‌లో నిర్వహించే క్విక్ సర్వేలకు సమాధానాలు చెప్పటం ద్వారా యూజర్‌కు గూగుల్ ప్లే క్రెడిట్ లభిస్తుంది. ఈ క్రెడిట్‌ను ప్లే స్టోర్‌లోని యాప్స్‌తో పాటు గేమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు.

రోజుకో సర్వేను గూగుల్ మీకు పంపుతుంది
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే మీ పేరు, వయసు, జెండర్ వంటి బేసిక్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. యాప్ విజయవంతంగా లాంచ్ అయిన తరువాత రోజుకో సర్వేను గూగుల్ మీకు పంపుతుంది.

రూ.64 క్రెడిట్ మీ గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది
కొత్త సర్వే వచ్చిన వెంటనే మీకో నోటిఫికేషన్ వస్తుంది. ఆ సర్వేను విజయవంతంగా మీరు పూర్తి చేసినట్లయితే రూ.64 క్రెడిట్ మీ గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఈ క్రెడిట్ తో మీకు నచ్చిన యాప్స్‌తో పాటు గేమ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

గూగుల్ ప్లే ప్రొటెక్ట్
ప్లే స్టోర్ యాప్‌కు మరింత ప్రొటెక్షన్‌ను కల్పిస్తూ సరికొత్త ప్రోగ్రామ్‌ను గూగుల్ అనౌన్స్ చేసింది. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ పేరుతో అందుబాటులో ఉండే ఈ ప్రోగ్రామ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లను ప్రమాదకర యాప్స్ నుంచి రక్షిస్తుంది.

ప్రమాదాకర యాప్స్‌ను ఏరిపారేస్తుంది
రానున్న అన్నిఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ప్రోగ్రామ్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించేందుకు గూగుల్ సిద్థమవుతోంది.ఈ ప్రోగ్రామ్ ఎప్పటికప్పుడు ఫోన్‌లో రన్ అవుతూ ప్రమాదాకర యాప్స్‌ను ఏరిపారేస్తుంటుంది. ఈ ప్రోగ్రామ్ రోజుకు 50 బిలియన్ యాప్‌లను స్కాన్ చేయగలదట.

అతి పెద్ద యాప్ స్టోర్
ప్రపంచంలో అతి పెద్ద యాప్ స్టోర్ ఏదైనా ఉందంటే అది గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ అభివృద్థి చేసిన ఈ యాప్ స్టోర్‌లో లక్షల సంఖ్యలో యాప్స్, గేమ్స్, బుక్స్, మూవీస్ కొలువుతీరి ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లు తమతమ గూగుల్ ప్లే స్టోర్ అకౌంట్‌లలోకి లాగినై వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ ప్లే స్టోర్‌లో సమస్యలా..?
కొన్ని సందర్భాల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో తలెత్తే సమస్యలు విసుగుపుట్టిస్తుంటాయి. ముఖ్యంగా యాప్‌ను డౌన్‌లోడ్ లేదా కొనుగోలు చేస్తున్న సమయంలో తలత్తే ఎర్రర్స్ చికాకుపుట్టిస్తాయి. వాస్తవానికి ఇవి పరిష్కరించలేనంత పెద్ద సమస్యలేమి కావు. కొన్ని సింపుల్ ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా వీటిని సలువుగా పరిష్కరించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో తలెత్తే 5 సాధారణ సమస్యలు వాటిని పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం..

DF-BPA-09 'Error Processing Purchase'
DF-BPA-09.. ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో వస్తుంటుంది. ఈ సమస్య ఇక మీదట మీకు ఎదురైనట్లయితే డివైస్ సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ సర్వీసెస్ ఫ్రేమ్ వర్క్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేసినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది.

Code 194
Code 194...ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా మీరు ప్లే స్టోర్ నుంచి గేమ్ లేదా యాప్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించినపుడు సంభవిస్తుంటుంది. ఈ సమస్య మీకు ఎదురైనపుడు గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌కు సంబంధించిన క్యాచీ డేటాను క్లియర్ చేసినట్లయతే సమస్య పరిష్కారమవుతుంది. క్యాచీని క్లియర్ చేసే క్రమంలో డివైస్ సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేస్తే సరి.

Code 495
Code 495... ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా ప్లే స్టోర్ నుంచి యాప్ లేదా గేమ్‌ను డౌన్‌లోడ్ లేదా అప్‌డేట్ చేస్తున్న సమయంలో వస్తుంటుంది. ఈ ఎర్రర్‌ను ఫిక్స్ చేయాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి గూగుల్ ప్లే స్టోర్ డేటాను డిలీట్ చేస్తే సరి. సెట్టింగ్స్‌లోని అప్లికేషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి గూగుల్ ప్లే సర్వీస్ అలానే ప్లే స్టోర్ యాప్స్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ డేటా పై క్లిక్ చేయండి.

Code 941
Code 941.. ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్ సాధారణంగా ఓ యాప్ లేదా గేమ్‌ను అప్‌డేట్ చేసే సమయంలో తలెత్తే ఆటంకం కారణంగా ఏర్పడుతుంది. ప్లే స్టోర్ యాప్‌కు సంబంధించి క్యాచీతో పాటు డేటాను క్లిక్ చేసినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది.

Code 498
కోడ్ 498... ఈ కోడింగ్‌తో ఉన్న ఎర్రర్‌ను డౌన్‌లోడింగ్ సమయంలో తలెత్తే ఆటంకాల కారణంగా ఫేస్ చేయవల్సి ఉంటుంది. డివైస్‌లోని క్యాచీతో పాటు పనికిరాని అప్లికేషన్‌లను డిలీట్ చేయండి. ఆ తరువాత రికవరీ మోడ్‌లో ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి సమస్య పరిష్కారమవుతుంది.
{image_gallery1}
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470