గూగుల్ పేలో లక్ష రూపాయలు పొందే మీ అదృష్టానికి మరో అవకాశం

|

దీపావళి సందర్భంగా గూగుల్ పేలో స్టాంప్ కలెక్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఏవైనా బిల్ పెమెంట్స్ మరియు పీర్-టు-పీర్ ట్రాన్సఫర్ లు చేసినప్పుడు గూగుల్ పే యూజర్లు ఐదు స్టాంపులలో ఒకదాన్ని పొందుతారు. వీటిలో ఝంకా, ఫ్లవర్, డియా, లాంతర్ మరియు రంగోలి ఉన్నాయి. పైన తెలిపిన అన్నీ స్టాంపులను సేకరించిన తరువాత మీరు 251 రూపాయలు గెలుచుకొనే అవకాశం ఉంది. మీరు అదృష్టవంతులైతే మీకు లక్ష రూపాయలను కూడా గెలుచుకొనే అవకాశం లభిస్తుంది.

 స్టాంప్ కలెక్షన్ స్కీమ్
 

చాలా మంది వినియోగదారులు పైన తెలిపిన ఐదు స్టాంపులలో నాలుగు స్టాంపులను సేకరించగలిగినప్పటికీ వారు రంగోలి స్టాంపును సేకరించడం కుదరలేదు. ముఖ్యంగా రంగోలి స్టాంప్ అందుబాటులో లేకపోవడంపై చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసారు. వారి యొక్క ఉత్సాహాన్ని గమనించిన సంస్థ స్టాంప్ కలెక్షన్ స్కీమ్ ను ఇప్పుడు నవంబర్ 11 వరకు పొడిగించాలని గూగుల్ నిర్ణయించింది.

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్: షాపింగ్‌ & పెమెంట్స్ ఫీచర్స్ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్: షాపింగ్‌ & పెమెంట్స్ ఫీచర్స్

గూగుల్ పేలో SMS హెచ్చరికలు

గూగుల్ పేలో SMS హెచ్చరికలు

పెమెంట్ చేయడానికి మరియు డబ్బును అతి త్వరగా యుపిఐ ద్వారా బ్యాంక్-టు-బ్యాంక్ ట్రాన్సఫర్ చేయడానికి ఎక్కువ మంది భారతీయులు గూగుల్ పేను ఇప్పుడు ఇష్టపడుతున్నారు. కానీ దీనివల్ల SMS మోసాలు కూడా పెరిగాయి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలను సులభంగా గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడటానికి గూగుల్ తన పనిని తాను చేస్తోంది. Google Pay ఇప్పుడు యాప్ తో పాటు SMS నోటిఫికేషన్‌లను కూడా పంపుతుంది. ఈ చర్య వలన వినియోగదారులు సేకరించిన తమ అభ్యర్థనను స్వీకరించిన ప్రతిసారీ వారికి తెలియజేయాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యర్థనను ఆమోదించిన తరువాత వారి బ్యాంక్ అకౌంట్ ల నుండి డబ్బును డిడక్ట్ చేస్తుంది..

Mi పే యాప్: మొదటి సారి గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యత!!!!Mi పే యాప్: మొదటి సారి గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యత!!!!

గూగుల్ పే సేఫ్టీ
 

గూగుల్ పే సేఫ్టీ

గూగుల్ పే సేఫ్టీ విషయంలో మెరుగైన రక్షణలను జోడించింది. మోసగాళ్ల దాడులకు వ్యతిరేకంగా ప్రపంచ స్థాయి రక్షణలకు గూగుల్ భరోసా ఇస్తోంది. వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి గూగుల్ పే యాప్ మొదట పిన్ ఎంట్రీ లేదా ఫింగర్ ప్రింట్ మరియు పేస్ లాక్ యాక్సిస్ ను ఉపయోగించి సురక్షితమైన యాక్సిస్ తో ఉంటుంది. తరువాత కూడా డబ్బును ట్రాన్సఫర్ చేయడానికి మరొకసారి పిన్ ను ఉపయోగించవలసి ఉంటుంది. రిమోట్ డెస్క్‌టాప్ దాడుల నుండి వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది.

షియోమి నుండి కొత్త Mi టివి 5 సిరీస్ స్మార్ట్ టీవీషియోమి నుండి కొత్త Mi టివి 5 సిరీస్ స్మార్ట్ టీవీ

గూగుల్ పే

మోసగాళ్లను గూగుల్ పే ప్లాట్‌ఫామ్‌లోకి రాకుండా నిరోధించడానికి గూగుల్ కూడా తీవ్రంగా కృషి చేస్తోంది. దీన్ని నిర్ధారించడానికి సెర్చ్ దిగ్గజం ఆన్‌బోర్డింగ్ దశలోనే సంపూర్ణ ప్రమాద సంబంధాల తనిఖీని జోడించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Pay Extend The Stamp Collection Scheme till November 11

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X