Home
Apps

ఇకపై గూగుల్ పే ద్వారా బంగారం అమ్మకాలు, కొనుగోళ్లు

By Gizbot Bureau

ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ వచ్చేసింది.. ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు.. ఇంటి వద్ద నుంచే నచ్చిన ఐటమ్స్ ను షాపింగ్ చేసుకోనే సౌకర్యం అందుబాటులో ఉంది. అదీగాక డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ షాపింగ్ కు ఫుల్ క్రేజ్ వచ్చింది. చివరికి గోల్డ్ కొనాలన్నా గోల్డ్ షాపుకు వెళ్లాల్సిన పనిలేదు.

Google Pay users can now buy and sell gold via app more News at Gizbot Telugu

ఇప్పుడు బంగారం కూడా ఆన్ లైన్‌లో కొనేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సేవలు పేటీఎం, మొబిక్విక్, పోన్ పే వినియోగదార్లకు అందుబాటులో ఉంది. ఇకపై ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే డిజిటల్ పేమెంట్స్ సర్వీసు 'గూగుల్ పే’లో కొత్త సదుపాయం తీసుకొచ్చింది. గూగుల్ పే యూజర్లు తమ యాప్ ద్వారా నేరుగా బంగారం కొనుగోలు చేయొచ్చు. ఈ మేరకు బులియన్ రిఫైనర్ MMTC-PAMP ఇండియాతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది.

గూగుల్ పే కస్టమర్లు

గూగుల్ పే కస్టమర్లు

99.99 శాతం (24 క్యారెట్ గోల్డ్) స్వచ్ఛత కలిగిన పసిడిని కొనేందుకు గూగుల్ పే వినియోగదారులు అర్హులు అని గూగుల్ పే ఇండియా ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అంబరీష్ కెంఘే స్పష్టం చేశారు. అలాగే ఎంత మొత్తంలోనైనా బంగారాన్ని గూగుల్ పే కస్టమర్లు కొనుగోలు చేయవచ్చని, దాన్ని సెక్యూర్ వాల్ట్స్‌ల్లో భద్రంగా దాచి పెట్టడం జరుగుతుందని అంబరీష్ చెప్పారు.

బంగారాన్ని కొనడం, అమ్మడం

బంగారాన్ని కొనడం, అమ్మడం

తాజా ధరలకే ఎప్పుడైనా ఈ బంగారాన్ని కొనడం, అమ్మడం చేయవచ్చునన్నారు. గూగుల్ పే యాప్‌పై సదరు బంగారం వివరాలన్నీ ఉంటాయని, వినియోగదారులు సులభంగానే తెలుసుకోవచ్చని కూడా ఆయన ప్రకటించారు.

ఆర్బీఐ అనుమతి లేకుండానే

ఆర్బీఐ అనుమతి లేకుండానే

కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేకుండానే గూగుల్ పేలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయా? అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించిన మరుసటి రోజే గూగుల్ పే ఈ పసిడి క్రయ, విక్రయాలకు తెరతీయడం గమనార్హం.

ప్రజాప్రయోజన వ్యాజ్యం

ప్రజాప్రయోజన వ్యాజ్యం

ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన నేపథ్యంలో గూగుల్ పే సేవలకున్న అనుమతి విషయంపై అటు గూగుల్ ఇండియాకు, ఇటు ఆర్బీఐకి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతీ విదితమే.

అన్ని అనుమతుల్ని

అన్ని అనుమతుల్ని

ఢిల్లీ హైకోర్టు నోటీసుల నేపథ్యంలో గూగుల్ పే అన్ని అనుమతుల్ని కలిగి ఉన్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తమ భాగస్వామ్య బ్యాంకులకు ఓ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా సేవలందిస్తున్నట్లు చెప్పారు.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా

ఆయా బ్యాంకుల ఖాతాదారుల చెల్లింపులను చేస్తున్నామని, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా పేమెంట్స్‌కు అనుమతినిస్తున్నామని వివరించారు. ఇది పేమెంట్ ప్రాసెసింగ్ లేదా సెటిల్మెంట్‌లో భాగం కాదని, ఇందుకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎటువంటి లైసెన్సులు అక్కర్లేదన్నారు.

డేటా సమాచారాన్ని

డేటా సమాచారాన్ని

కాగా, డేటా సమాచారాన్ని స్థానికంగానే భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో భాగస్వామ్య బ్యాంకులు, ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.గూగుల్ పే నుంచి బంగారు ఎంతమొత్తంలో కొన్నారో అదంతా MMTC-PAMP సెక్యూర్ వాల్ట్ లో స్టోర్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Google Pay users can now buy and sell gold via app more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X