Home
Apps

గూగుల్ పే వాడుతున్నారా, ఈ విషయాలు తప్పక గుర్తించుకోండి

By Gizbot Bureau

సాఫ్ట్‌వేర్‌ సంస్థ గూగుల్‌కు చెందిన గూగుల్‌ పేను భారత్‌లో చాలా మంది ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ యాప్‌లో అనేక మంది నగదు ట్రాన్స్‌ఫర్‌, బిల్లు చెల్లింపులు చేస్తున్నారు. ఇండియాలో ఎక్కువ భాగం గూగుల్ పే ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి.

ఆన్‌లైన్‌ మోసాలు

అయితే ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో గూగుల్‌ తన గూగుల్‌ పే కస్టమర్లకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. వాటిని తప్పనిసరిగా పాటించాలని చెబుతోంది. అవేంటో ఓ సారి చూద్దాం.

 

యూపీఐ పిన్‌ నంబర్‌

యూపీఐ పిన్‌ నంబర్‌

గూగుల్‌ పే వినియోగదారులు తమ యూపీఐ పిన్‌ నంబర్‌ను సీక్రెట్‌గా ఉంచుకోవాలి. ఎవరికీ ఆ పిన్‌ను చెప్పకూడదు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న గూగుల్‌ పే యాప్‌ను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకుని వాడాలి. ఏదీ బడితే అది డౌన్లోడ్ చేసుకోకండి. అలాగే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాల్సి వస్తే యాప్‌లో ఇచ్చే నంబర్లకే ఫోన్‌ చేయాలి.

 

మనీ రిక్వెస్ట్‌

మనీ రిక్వెస్ట్‌

ఎవరి వద్ద నుంచైనా మనీ గూగుల్‌ పే యాప్‌లో మనీ రిక్వెస్ట్‌ వస్తే వెంటనే స్పందించకూడదు. వినియోగదారులకు చెందిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు ముందుగా డబ్బు కావాలని అడిగి.. ఆ తరువాత రిక్వెస్ట్‌ పంపితే దాన్ని యాక్సెప్ట్‌ చేయాలి. అంతేకానీ.. అపరిచితులు మనీ రిక్వెస్ట్‌ పెడితే దాన్ని యాక్సెప్ట్‌ చేయకూడదు.

 

వివరాలు చెప్పకండి

వివరాలు చెప్పకండి

గూగుల్‌ పే కస్టమర్‌ ప్రతినిధినంటూ మాట్లాడుతూ కొందరు వినియోగదారుల బ్యాంక్‌ సమాచారం తెలుసుకునేందుకు యత్నిస్తారు. అలాంటి వారికి వివరాలు చెప్పకూడదు. నిజంగా ఎవరూ కూడా.. వినియోగదారులను ఆ వివరాలు అడగరు. వినియోగదారులకు తమ పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌ వివరాలను వెరిఫై చేసుకోవాలంటూ కొందరు కాల్స్‌ చేస్తారు. అలాంటి వారికి సమాధానం చెప్పకూడదు.

 

 

ఈ యాప్ లు వాడకండి

ఈ యాప్ లు వాడకండి

ఎనీడెస్క్‌ లేదా టీం వ్యూయర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కొందరు కాల్స్‌ చేస్తారు. నిజానికి ఈ యాప్‌లను ఎవరూ ఫోన్లలో వాడకూడదు. ఆ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోమని చెప్పినా స్పందించకూడదు. డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల వివరాలు చెప్పకపోతే బ్లాక్‌ అవుతుందని కొందరు బెదిరిస్తారు. అలాంటి వారికీ బదులివ్వరాదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pay wants to teach you how to avoid UPI fraudsters
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X