Home
Apps

గూగుల్ ఫోన్ యాప్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఇకపై స్పామ్ కాల్స్‌తో తలనొప్పులు ఉండవ్‌..

Google Phone app: ఇటీవల కాలంలో స్పామ్ కాల్స్ ఎక్కువైపోయాయి. ఇవి కాల్ హిస్టరీ లిస్ట్‌ నింపేస్తున్నాయి. దీనివల్ల చాలా గందరగోళం నెలకొంది. అయితే ఇకనుంచి కాల్ హిస్టరీలో వాటి బెడద ఉండదు. గూగుల్ ఫోన్ (Google Phone) యాప్ కొత్త అప్‌డేట్‌తో కాల్ హిస్టరీని మరింత సులభంగా నిర్వహించేలా మార్చేసింది. ఇప్పటివరకు ఒకే లిస్టులో కనిపించే కాల్స్ ఇకపై మిస్డ్ కాల్స్, కాంటాక్ట్స్, స్పామ్ కాల్స్, సాధారణ కాల్స్ లాంటి వేర్వేరు కేటగిరీల్లో కనిపిస్తాయి.

దీంతో ముఖ్యమైన కాల్స్ కోసం వెతుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. మొన్నటిదాకా బీటా యూజర్స్‌కి మాత్రమే ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తోంది. ఇది సర్వర్ సైడ్ అప్‌డేట్ కాబట్టి అందరికీ రావడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు.

Google Phone App Gets New Call Filters to Tackle Spam and Improve Call History Management

* కొత్త కాల్ ఫిల్టర్లు ఎలా పనిచేస్తాయంటే..

ఈ అప్‌డేట్ ద్వారా కాల్ లాగ్స్‌ను కేటగిరీల వారీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. మీరు పెద్ద లిస్టులో స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా కావాల్సిన కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే చాలు. సేవ్ చేసిన కాంటాక్ట్స్ కాల్స్ చూడొచ్చు, మిస్డ్ కాల్స్ చెక్ చేసుకోవచ్చు లేదా స్పామ్ కాల్స్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చు.

రోబోకాల్స్, స్పామ్ కాల్స్‌తో విసిగిపోయినవాళ్లకి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే, ఇక్కడ ఒక చిన్న లోటు ఉంది. ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ ఫిల్టర్ ఆప్షన్ ఇంకా రాలేదు. బహుశా గూగుల్ ఫ్యూచర్ అప్‌డేట్స్‌లో దీనిని కూడా యాడ్ చేయొచ్చు. స్పామ్ కాల్స్‌ని తగ్గించడంలో గూగుల్ చేస్తున్న కృషిలో ఇది కూడా ఒక భాగం.

* మెరుగుపడే యూజర్ ఎక్స్‌పీరియన్స్‌

గూగుల్ తన ఫోన్ యాప్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను పెంచడానికి, స్పామ్ కాల్స్‌ను అరికట్టడానికి చాలా ఫీచర్స్ తీసుకొస్తోంది. పిక్సెల్ ఫోన్లలో ఉండే 'కాల్ స్క్రీన్' ఫీచర్ ద్వారా తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే, అది ఎవరు? ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. కాల్ కనెక్ట్ అవ్వకముందే వాళ్ల మాటల్ని టెక్స్ట్‌ రూపంలో చూపిస్తుంది.

అప్పుడు మీరు కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోవచ్చు. అంతేకాదు, 'రివర్స్ లుకప్' అనే మరో ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా మీకు తెలియని నంబర్ల వివరాలు తెలుసుకోవచ్చు, స్పామ్ కాల్స్‌ను గుర్తించవచ్చు. తద్వారా చాలా తలనొప్పులను తగ్గించుకోవచ్చు. మోసాల బారి నుంచి బయటపడవచ్చు.

* ఇంకా చాలా ఉన్నాయ్

గూగుల్ ఫోన్ యాప్‌లో ఇతర అద్భుతమైన ఫీచర్స్ చూస్తే కాల్ ఫిల్టరింగ్‌తో పాటు, గూగుల్ ఇంకా చాలా ఉపయోగకరమైన ఫీచర్స్ అందిస్తోంది. 'హోల్డ్ ఫర్ మీ' అనే ఫీచర్ కస్టమర్ కేర్ కాల్స్‌లో మీరు హోల్డ్‌లో ఉన్నప్పుడు మీ కోసం వెయిట్ చేస్తుంది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లైన్‌లోకి రాగానే మీకు నోటిఫికేషన్ ఇస్తుంది.

'డైరెక్ట్ మై కాల్' ఫీచర్ ద్వారా ఆటోమేటెడ్ ఫోన్ మెనూ ఆప్షన్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. దీంతో మెనూల్లో నావిగేట్ చేయడం చాలా సులువు అవుతుంది. ఈ ఫీచర్లన్నీ కాలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అద్భుతంగా మార్చేస్తాయి, అనవసరమైన ఇబ్బందులు లేకుండా చేస్తాయి. ఇవి ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అయి ఉంటాయి.

* ఈ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందంటే..

ఈ కాల్ ఫిల్టరింగ్ ఫీచర్ ఫస్ట్ ఫోన్ యాప్ 159.0.718038457-పబ్లిక్ బీటా-పిక్సెల్2024 వెర్షన్‌లో వచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లందరికీ సర్వర్ సైడ్ అప్‌డేట్ ద్వారా రిలీజ్ అవుతోంది. అంటే కొందరికి ముందు, కొందరికి తర్వాత రావచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఈ ఫీచర్ కనిపించకపోతే, గూగుల్ ఫోన్ యాప్ లేటెస్ట్ అప్‌డేట్ కోసం వెయిట్ చేయాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Phone app update offers call filters for better call history management and spam reduction. It categorizes calls and is rolling out to Android users.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X