గూగుల్ కొత్త ఫీచర్, ఎన్నిసార్లు వీడియోలు చూసినా డేటా కట్ అవ్వదు

ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే వారు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి..

|

గూగల్ ఫోటోస్ యాప్ గురించి మనందరికి తెలుసు. తాజాగా ఈ యాప్‌లోకి కొత్త అప్‌డేట్‌ను గూగల్ చేర్చింది. లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ ఫోటోస్ యాప్‌లో సరికొత్త cache ఫీచర్ చేరింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ ఒకసారి వీక్షించిన వీడియోను అదనపు డేటా ఖర్చులేకుండా మళ్లీమళ్లీ వీక్షించే వీలుంటుంది.

 

రూ.8,999కే Nubia M2 Playరూ.8,999కే Nubia M2 Play

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసే క్రమంలో గూగల్ ఫోటోస్ యాప్ యూజర్ వీక్షించిన వీడియోలకు సంబంధించిన క్యాచీ డేటాను లోకల్‌గా స్టోర్ చేసుకుంటుంది. క్యాచీని క్లియర్ చేయనంత వరకు వీడియోలను ఎన్ని సార్లు అయినా అదనపు డేటా ఖర్చులేకుండా వీక్షించే వీలుంటుంది. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే వారు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి తమ గూగుల్ ఫోటోస్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది.

 గూగుల్ ఫోటోస్ యాప్ ఏఏ పనులు చేస్తుందో తెలుసా..?

గూగుల్ ఫోటోస్ యాప్ ఏఏ పనులు చేస్తుందో తెలుసా..?

గూగుల్ ఫోటోస్ యాప్ ఎప్పటికప్పుడు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలను ఎప్పటికప్పుడు తన స్టోరేజ్ లో భద్రపరుస్తుంది. అంటే మీరు తీసిన ఏ ఫోటో అయినా గూగుల్ ఫోటోస్ యాప్ లైబ్రరీలోకి వెళుతుంది. అయితే గూగుల్ ఫోటోస్ యాప్ ఫోటోలను మాత్రమే సేవ్ చేస్తుండా లేక మరైమైనా పనులు చేస్తుందా అనే డౌట్లు చాలామందికి రావచ్చు. గూగుల్ ఫోటోస్ ఏఏ పనులు చేస్తుందో ఓ సారి చూద్దాం.

 ఫోటోలే కాకుండా ప్రదేశాలు
 

ఫోటోలే కాకుండా ప్రదేశాలు

గూగుల్ ఫోటో యాప్ ద్వారా ఫోటోలు మాత్రమే కాకుండా ప్రదేశాలు అలాగే కార్లు ఇంకా అనేక రకాలైన అంశాలను సెర్చ్ చేయవచ్చు.

పేరుతో వెతికే అవకాశం

పేరుతో వెతికే అవకాశం

మీరు గూగుల్ ఫోటో యాప్ లోకి వెళ్లినప్పుడు మీరు పేర్లు వారీగా వెతికే అవకాశం ఉంటుంది. అయితే మీరు ముందు పేర్లు టైప్ చేసి పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే లేబుల్ ని రిమూవ్ చేయడం కాని యాడ్ చేయడం కాని చేయవచ్చు.

బ్యాకప్ సెట్టింగ్స్

బ్యాకప్ సెట్టింగ్స్

గూగుల్ ఫోటో యాప్ లో మీ ఫోటోలను ఎలా కావాలంటే అలా బ్యాకప్ చేసుకోవచ్చు. ఫోటోలు వైఫైతో మాత్రమే బ్యాకప్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటే నెట్ ఆదా అవుతుంది.

అప్‌లోడ్ అయిన తరువాత డిలీట్

అప్‌లోడ్ అయిన తరువాత డిలీట్

ఫోటోస్ అప్‌లోడ్ అయిన తరువాత అవి వద్దనుకుంటే డిలీట్ చేయవచ్చు. అలాగే క్వాలిటీని కూడా సెట్ చేసుకోవచ్చు.

ఇతర యాప్స్ ఫోటోలు బ్యాకప్

ఇతర యాప్స్ ఫోటోలు బ్యాకప్

మీరు ఇతర యాప్స్ నుండి ఫోటోలను నేరుగా గూగుల్ ఫోటో యాప్స్ లోకి పంపుకునే అవకాశం ఉంది. కెమెరా ఫోటోలు మాత్రమే కాకుండా వాట్సప్ ఇన్ స్టాగ్రామ్ లాంటి యాప్స్ నుండి వచ్చిన ఫోటోలు కూడా బ్యాకప్ చేయవచ్చు.సైడ్ లో ఉన్న బటన్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్సన్స్ వస్తాయి. వాటిని ఫాలో అయితే సరిపోతుంది.

మల్టిపుల్ ఫోటోస్ ఆప్షన్

మల్టిపుల్ ఫోటోస్ ఆప్షన్

గూగుల్ ఫోటో యాప్ లో మల్టిపుల్ ఆప్షన్ కూడా ఉంది. ఏదైనా ఫోటోను లాంగ్ ప్రెస్ చేస్తే అందులో మీకు ఫోటోసెలక్షన్ ఆప్సన్ వస్తుంది. అదే వెబ్ లో అయితే షిప్ట్ కీస్ తో మీరు ఈ ఆప్సన్ ను సెలక్ట్ చేసుకోవచ్చు.

పొరపాటున డిలీట్ చేస్తే..

పొరపాటున డిలీట్ చేస్తే..

గూగుల్ ఫోటో యాప్‌లోని ఫోటోలను ఏమైనా పొరపాటున డిలీట్ చేస్తే అవి ట్రాష్ బటన్‌లో ఉంటాయి. అలాగే మీరు పూర్తిగా వద్దనుకున్న ఫోటోలు కూడా అందులో నుంచి తొలగించుకోవచ్చు.

ఎడిటింగ్ సౌకర్యం..

ఎడిటింగ్ సౌకర్యం..

గూగుల్ ఫోటోలో మీరు నేరుగా ఫోటోను మీకు నచ్చిన విధంగా ఎడిటింగ్ చేయవచ్చు.

మీరు మీ ఫోటోలను నేరుగా షేర్ చేసే అవకాశం

మీరు మీ ఫోటోలను నేరుగా షేర్ చేసే అవకాశం

గూగుల్ ఫోటో యాప్ ద్వారా మీ ఫోటోలను ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఈఆప్సన్ ద్వారా షేర్ చేయవచ్చు.

ఒకేసారి డ్రైవ్‌లోకి

ఒకేసారి డ్రైవ్‌లోకి

మీ ఫోటోలను గూగుల్ ఫోటోస్ నుండి నేరుగా డ్రైవ్ లోకి పంపించాలనుకుంటే అక్కడ పోల్డర్ క్రియేట్ చేసి పంపుకోవచ్చు. అందుకోసం సెట్టింగ్స్ లో కెళ్లి జనరల్ లో ఆప్సన్ సెలక్ట్ చేసుకోవాలి. గూగుల్ డ్రైవ్ ఆన్ చేయడం వల్ల మీ ఫోటోలు అలాగే వీడియోలు మీకు ఎప్పటికప్పుడు కనిపిస్తుంటాయి. అలాగే మీరు డాక్యుమెంట్స్ , గూగుల్ షీట్స్ వాడుతున్నా కాని దీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Google Photos Gets Cache Feature to Replay Videos Without Using Additional Data. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X