గూగుల్ తేజ్‌తో నిమిషాల్లో డబ్బులు ట్రాన్సఫర్ !

Written By:

గూగుల్ కూడా పేమెంట్ యాప్ రంగంలోకి వచ్చింది. అన్ని కంపెనీలు యూపీఏ ఆధారిత పేమెంట్‌ యాప్‌లను వినియోగదారులకు అందించేందుకు పోటీలు పడుతున్న తరుణంలో గూగుల్ కూడా తన పేమెంట్ యాప్ తేజ్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

ముకేష్ అంబాని ఎందుకిలా చేశాడు..మార్పు కోసమేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెప్టెంబర్‌ 18న

వచ్చే వారంలో యూపీఐ ఆధారిత డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసు ''తేజ్‌''ను గూగుల్‌ లాంచ్‌ చేయబోతుంది. సెప్టెంబర్‌ 18న గూగుల్‌ భారత్‌లోకి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ పేమెంట్‌ ఎకోసిస్టమ్‌లోకి అడుగుపెట్టబోతుందని ది-కెన్‌.కామ్‌ రిపోర్టు చేసింది.

తేజ్‌ అంటే హిందీలో వేగవంతం

గూగుల్‌ లాంచ్‌ చేయబోతున్న తేజ్‌ అంటే హిందీలో వేగవంతం అని అర్థం. ఇది అచ్చం ఆండ్రాయిడ్‌ పే లాగా పనిచేస్తోంది.

రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా రెగ్యులేట్‌

యూపీఐ పేమెంట్‌ సిస్టమ్‌ను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంచ్‌ చేసింది. ఈ పేమెంట్‌ సిస్టమ్‌ను రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా రెగ్యులేట్‌ చేస్తుంది.

మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా

మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రెండు బ్యాంకు అకౌంట్ల మధ్య వెనువెంటనే ఫండ్‌ ట్రాన్సఫర్‌ చేసుకోవడానికి ఈ సిస్టమ్‌ ద్వారా వీలవుతుంది.

ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్‌

ఇక ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్‌ కూడా ఈ డిజిటల్‌ పేమెంట్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఎన్‌పీసీఐతో ఈ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సంప్రదింపులు జరుపుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

వీచాట్‌, హైక్‌ మెసెంజర్‌

వీచాట్‌, హైక్‌ మెసెంజర్‌ వంటి కొన్ని మొబైల్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఈ యూపీఐ ఆధారిత పేమెంట్‌ సర్వీసులను సపోర్టు చేస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google plans to launch payment app Tez in India: Report Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot