షాకిస్తున్న గూగుల్ ప్లే స్టోర్, యాప్ డౌన్లోడ్ చేస్తే అంతే సంగతులు !

ప్రపంచవ్యాప్తంగా అనేక రాకలైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఈ దాడులు మరింత పెరిగాయి. ఆ మధ్య ఓ కుదుపు కుదిపిన వన్నాక్రై సైబర్ అటాక్ ఓ సంలచనంగా మారిన సంగతి తెలిసి

|

ప్రపంచవ్యాప్తంగా అనేక రాకలైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఈ దాడులు మరింత పెరిగాయి. ఆ మధ్య ఓ కుదుపు కుదిపిన వన్నాక్రై సైబర్ అటాక్ ఓ సంలచనంగా మారిన సంగతి తెలిసిందే.అలాగే ఫేస్‌బుక్‌ డేటా లీక్‌ వ్యవహారం యూజర్లు తీవ్ర ఆందోళననలోకి నెట్టివేసింది. అయితే ఈసారి గూగుల్ ప్లే స్టోర్ లోకి అనేక రకాలైన మాల్ వేర్ లు జొరబడ్డాయని దీని వల్ల బ్యాటరీ డెడ్ అయిపోతుందని రిపోర్టులు వెల్లడిచేస్తున్నాయి.

షాకిస్తున్న గూగుల్ ప్లే స్టోర్, యాప్ డౌన్లోడ్ చేస్తే అంతే సంగతులు !

గూగుల్ ప్లే స్టోర్ నుండి అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్ ల ద్వారా హ్యాకర్లు మాల్ వేర్లను యాడ్ రూపంలో ఫోన్లలోకి ప్రవేశపెడుతున్నారనే వాస్తవాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.

గూగుల్ ప్లేస్టోర్‌లోని యాప్స్

గూగుల్ ప్లేస్టోర్‌లోని యాప్స్

గూగుల్‌ యాప్ స్టోర్ నుంచి ఫోటో ఎడిటింగ్ లేదా బ్యూటీ యాప్స్‌ వినియోగిస్తున్న యూజర్లు ఈ మధ్య కొన్ని వార్తలు ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్‌ యూజర్ల డేటాను చోరీ చేస్తున్నాయనే సమాచారం వచ్చింది.

భద్రతా కారణాల రీత్యా ..

భద్రతా కారణాల రీత్యా ..

ఈ నేపథ‍్యంలోనే భద్రతా కారణాల రీత్యా గూగుల్ కొన్ని యాప్‌లను డిలీట్‌ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ ను తొలగించిడమే కాకుండా, ప్రో కెమెరా బ్యూటీ, కార్టూన్ ఆర్ట్ ఫోటో, ఎమోజి కెమెరావంటి యాప్స్‌ కొన్ని లక్షలకు పైగా డౌన్‌లోడ్‌ అవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది.

హానికరమైన యాప్స్‌

హానికరమైన యాప్స్‌

హానికరమైన ఈ యాప్స్‌ మాల్‌వేర్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి పంపిస్తున్నాయంటూ అమెరికా ఆధారిత సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ మైక్రో గుర్తించింది. ప్లేస్టోర్‌లోని బ్యూటీ కెమెరా యాప్స్ రిమోట్ యాడ్ కాన్ఫిగ్యురేషన్ సర్వర్లను యాక్సెస్ చేయగలదని ట్రెండ్ మైక్రో తన అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది.

యూజర్ల చిరునామాలు

యూజర్ల చిరునామాలు

ముఖ్యంగా ప్రో కెమెరా బ్యూటీ, ఎమొజీ కెమెరా, సెల్ఫీ కెమెరా ప్రో, ఫోటో ఎడిటర్, ఆర్ట్ ఎఫెక్ట్, వాల్‌పేపర్స్ హెచ్‌డీ, ప్రిజ్మా ఫోటో ఎఫెక్ట్ లాంటివి ఈ జాబితాలో ఉన్నాయి. వీటిద్వారా యూజర్ల చిరునామాలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోందని పేర్కొంది.

షార్ట్‌కట్‌

షార్ట్‌కట్‌

ఈ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయగానే యూజర్లకు ఎలాంటి సందేహం రాకుండా.. గుర్తించలేనంతగా ఒక షార్ట్‌కట్‌ను క్రియేట్‌ చేస్తుంది. దీని వలన ఈ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయడం కూడా కష్టతరం అవుతుందని వివరించింది. అంతేకాదు వీటిని ఎనలైజ్‌ చేయడానికి వీల్లేకుండా ప్యాకర్స్‌ను కూడా వాడుతుందట.

జుడీ అనే మాల్వేర్

జుడీ అనే మాల్వేర్

జుడీ అనే మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ లోకి చొరబడినట్లు సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ చెక్ పాయింట్ సంస్థ వెల్లడించింది. 41 యాప్స్ లో ఈ వైరస్ ఉన్నట్టు తేలింది. ఇప్పటికే 85 లక్షల నుంచి 3.65 కోట్ల మంది యూజర్లకు దీనికి ప్రభావితమైనట్టు రిపోర్టు చేసింది. ఈ విషయంపై చెక్ పాయింట్ గూగుల్ ను అలర్ట్ చేసింది.

 

 

ఫోన్లలో ఉండకూడని కొన్ని యాప్‌లు

ఫోన్లలో ఉండకూడని కొన్ని యాప్‌లు

కాగా మన ఫోన్లలో ఉండకూడని కొన్ని యాప్‌లను నిపుణులు తెలిపారు.

- స్పోర్ట్‌ టీవీ

- ప్రాడో పార్కింగ్‌ సిములేటర్‌ 3డీ

-టీవీ వరల్డ్‌

-సిటీ ఎక్స్‌స్ట్రీమ్‌పోలీస్‌

-అమెరికన్‌ మజిల్‌ కార్‌

-ఐడిల్‌ డ్రిప్ట్‌

-టీవీ రిమోట్‌

-ఏసీ రిమోట్‌

-బస్‌ డ్రైవర్‌

-లవ్‌ స్టిక్కర్స్‌

-క్రిస్‌మస్‌ స్టిక్కర్స్‌

-పార్కింగ్‌ గేమ్‌

-బ్రెజిల్‌ టీవీ

- వరల్డ్‌ టీవీ

- ప్రాడో కార్‌

-చాలెంజ్‌ కార్‌ స్టంట్స్‌ గేమ్‌

- యూకే టీవీ

- ఫొటో ఎడిటర్‌ కొలాగ్‌ 1

- మూవీ స్టిక్కర్స్‌

- రేసింగ్‌ కార్‌ 3డీ

- పోలీస్‌ చేజ్‌

-ఫ్రాన్స్‌ టీవీ

- చిలీ టీవీ

- సౌతాఫ్రికా టీవీ మొదలైనవి

 

 

3వేలకు పైగా..

3వేలకు పైగా..

గూగుల్‌కు చెందిన 3వేలకు పైగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఉచిత యాప్స్‌లో వినియోగదారుల వ్యక్తగత వివరాలను అక్రమంగా ట్రాక్‌ అవుతోంది. ఒక ఇండిపెండెంట్‌ సర్వే ఈ షాకింగ్‌ అంశాలను వెల్లడించింది. ఒక నూతన ఆటోమేటెడ్ సిస్టమ్‌ ద్వారా ఈ పరిశోధన నిర్వహించినట్టు పరిశోధకులు వెల్లడించారు.

 

ఈజీ యూనివర్సల్‌ టీవీ రిమోట్‌ అనే యాప్‌

ఇప్పటికే ఈజీ యూనివర్సల్‌ టీవీ రిమోట్‌ అనే యాప్‌ను యూజర్లు 50 లక్షల సార్లు డౌన్‌లోడ్‌ చేశారు. అంతేకాదు ఇటువంటి మరిన్ని 85 హానికారక యాప్‌లు కూడా 9 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్‌ చేయబడ్డాయి.

 

 

ఓపెన్‌ చేసిన ప్రతిసారీ

ఓపెన్‌ చేసిన ప్రతిసారీ

ఈ యాప్‌లు ఓపెన్‌ చేసిన ప్రతిసారీ ఫుల్‌ స్క్రీన్‌ యాడ్‌ డిస్‌ప్లే అవుతుంది. దాని నుంచి బయటికి వచ్చేందుకు వరుసగా వివిధ రకాల బటన్స్‌ నొక్కమంటూ ఆప్షన్స్‌ వస్తూనే ఉంటాయి. అలా అనేక రకాల వెబ్‌పేజీల్లోకి మన వివరాలు వెళ్లిపోతాయి.
యాప్‌ క్రాష్‌ అయ్యేంతవరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో మన ఫోన్‌ లాక్‌ ప్యాట్రన్‌తో పాటు ఇతర కీలక సమాచారం హ్యాకర్ల చేతికి సులభంగా చిక్కుతుంది' అని ట్రెండ్‌ మైక్రో పరిశోధకులు తమ బ్లాగులో కథనం వెలువరించారు.

Best Mobiles in India

English summary
Google Play apps with 10 million installs drain batteries, jack up data charges

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X