షాకిచ్చిన గూగుల్ : ప్లస్, హ్యాంగవుట్స్ షడ్ డౌన్ !
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ యూజర్లకు షాకిచ్చిందుకు రెడీ అయింది. ఏకంగా రెండు సర్వీసులను నిలిపివేస్తోంది.
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ యూజర్లకు షాకిచ్చిందుకు రెడీ అయింది. ఏకంగా రెండు సర్వీసులను నిలిపివేస్తోంది. గూగుల్ ప్లస్, అలాగే గూగుల్ హ్యాంగవుట్స్ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపింది. 2019 ఏప్రిల్ నుంచి గూగుల్ ప్లస్ ఇక యూజర్లకు అందుబాటులో ఉండదు. గూగుల్ ప్లస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఏపీఐలో బగ్స్ ఉన్నందున 52.5 మిలియన్ల గూగుల్ ప్లస్ యూజర్ల సమాచారం చోరీకి గురైందని గూగుల్ గుర్తించింది. దీంతో దీన్ని షట్ చేయడమే మేలని గూగుల్ భావిస్తోంది. అలాగే హ్యాంగవుట్స్ కూడా అంతగా పాపులర్ కాకపోవడంతో ఇతర యాప్ మీద దృష్టి పెట్టి దీన్ని బ్యాన్ చేయాలని అనుకుంటోంది.

హ్యాకర్ల చేతుల్లోకి
గూగుల్ ప్లస్ యూజర్లకు చెందిన పేర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లు, వృత్తి, వయస్సు తదితర వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లి ఉంటాయని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ తన గూగుల్ ప్లస్ యూజర్లకు ఈ విషయంపై నోటిఫికేషన్లను కూడా పంపుతున్నది.

సాఫ్ట్‌వేర్‌లో లోపం
అయితే సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం వల్లే ఇలా జరిగిందని గూగుల్ గుర్తించగా, మరో 90 రోజుల్లో మొత్తం గూగుల్ ప్లస్ ఏపీఐలను గూగుల్ నిలిపివేయనుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 2019 నుంచి గూగుల్ ప్లస్ సేవలను గూగుల్ నిలిపివేయనుంది.

గూగుల్ హ్యాంగౌట్స్
కాగా గూగుల్ హ్యాంగౌట్స్ మెసేజింగ్ యాప్‌కు 2020కల్లా సేవలు నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లు నైన్‌టుఫైవ్ గూగుల్ అనే వెబ్‌సైట్ వెల్లడించింది.

గూగుల్ మెసేజింగ్ యాప్
ఈ యాప్‌కు బదులుగా గూగుల్ మెసేజింగ్ యాప్‌ను అధునాతన ఫీచర్లతో తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. గత ఏప్రిల్‌లోనే ఆర్‌సీఎస్ ఫీచర్లను మెసేజింగ్‌కు జోడిస్తున్నామని తెలుపుతూనే హ్యాంగౌట్స్ సేవలు నిలిపివేస్తామని చెప్పకనే చెప్పింది.

ఇంకా ఒక సంవత్సరం
హ్యాంగౌట్స్‌కు గూగుల్ తన సేవలను నిలిపివేయడానికి ఇంకా ఒక సంవత్సరం ఉంది కాబట్టి అది వాడే వారు మరొక ప్లాట్‌ఫాంను ఎన్నుకోవడానికి సమయం ఉంది.


Click it and Unblock the Notifications








