Google Tez లో ఇన్ స్టంట్ లోన్స్.. మరిన్ని కొత్త ఫీచర్లు ఏంటో తెలుసా..?

గూగుల్ పేమెంట్ సర్వీస్ TEZ ద్వారా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ద్వారా నగదు ఇతరులకు పంపించడం ఎంతో తెలికిగా మారింది.

By Anil
|

గూగుల్ పేమెంట్ సర్వీస్ TEZ ద్వారా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ద్వారా నగదు ఇతరులకు పంపించడం ఎంతో తెలికిగా మారింది. అంతే కాకుండా పంపించన లేక స్వీకరించిన వారికి కూపన్స్ రూపంలో కొంత సొమ్ము కూడా ఈ యాప్ ద్వారా పొందుతున్న విషయం అందరికి తెల్సిందే దీంతో ఈ యాప్ చాలా పాపులర్ అయిపోయింది. కాగా తాజాగా ఈ Tez యాప్ పేరును Google Pay పేరుగా మార్చారు. ఢిల్లీలో జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2018 కార్యక్రమంలో గూగుల్ ఇందుకు సంబందించిన వివరాలను వెల్లడించింది. మరికొన్ని కొత్త సర్వీసులు కూడా ఇందులో ప్రవేశపెట్టింది.సులువుగా UPI పేమెంట్స్ చేసుకునేందుకు వీలున్న Tez పేరు మార్చినప్పటికీ యాప్ లో ఎలాంటి మార్పులు ఉండవని గూగుల్ పేర్కొంది. ఇక కొత్త ఫీచర్ల విషయానికి వస్తే Tez పేరు మాత్రమే Google Pay గా మారుతుంది ఎప్పటిలాగే హొమ్ స్క్రీన్ ,బిల్ పేమెంట్స్,కాంటాక్ట్స్ వంటివి ఉంటాయి. దీంతో పాటు ప్రీ అప్రూవ్ లోన్స్ కు అప్లై చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని కూడా గూగుల్ కల్పిస్తుంది.

Google Pay ...

Google Pay ...

పేమెంట్స్‌ యాప్ తేజ్‌ని 'గూగుల్ పే' పేరుతో రీబ్రాండ్ చేసింది గూగుల్. ఫెడరల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ పే ద్వారా యూజర్లకు ఈ బ్యాంకులు ఇన్‌స్టంట్ లోన్లు ఇస్తాయి.తదుపరి అప్ డేట్స్ లో పేరుతో పాటు మరికొన్ని ఫీచర్లు ఈ యాప్ లో రానున్నాయి.

Google Pay ను ప్రపంచవ్యాప్తంగా....

Google Pay ను ప్రపంచవ్యాప్తంగా....

మరో వైపు Google Pay ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొని రాబోతున్నట్టు గూగుల్ ప్రకటించింది

ప్రస్తుతం ఇండియాలో ఈ యాప్ ను 2.2 కోట్ల మంది....
 

ప్రస్తుతం ఇండియాలో ఈ యాప్ ను 2.2 కోట్ల మంది....

ప్రస్తుతం ఇండియాలో ఈ యాప్ ను 2.2 కోట్ల మంది వినియోగిస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. గత సెప్టెంబర్ లో యాప్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 75 కోట్ల లావాదేవిలను జరిగినట్లు తెలిపింది.

యాప్ పరంగా ఎంతో పేరు తెచ్చుకున్న Google  Tez....

యాప్ పరంగా ఎంతో పేరు తెచ్చుకున్న Google Tez....

యాప్ పరంగా ఎంతో పేరు తెచ్చుకున్న Google Tez ఈ Loans ఫీచర్స్ మరిన్ని అప్ డేట్స్ ఎంత వరకు క్లిక్ అవుతాయి అనేది వేచి చూడాలి

Best Mobiles in India

English summary
Google rebrands its Tez payments app to Google Pay in India, adds instant loans.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X