గూగుల్ నుంచి GIF మేకింగ్ యాప్!

Posted By: Madhavi Lagishetty

సోషల్ మీడియాలో GIF కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. నిత్యం మనం చూసే పోస్టింగ్స్‌లో ఎక్కువ శాతం జిఫ్ ఫైల్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్, తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్స్ కోసం మోషన్ స్టిల్స్ పేరుతో సరికొత్త జిఫ్ మేకింగ్ యాప్‌ను రిలీజ్ చేసింది. లైవ్ ఫోటోలను GIF ఇమేజ్‌లుగా మార్చడం ఈ యాప్ ప్రత్యేకత. ఈ యాప్ ఆండ్రాయిడ్ 5.1 ఇంకా ఆపై వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఇన్‌స్టాల్ అవుతుంది.

గూగుల్ నుంచి GIF మేకింగ్ యాప్!

ఫోటోలను జిఫ్ ఇమేజ్‌లుగా మర్చాలంటే చాలా ప్రొసెస్ ఉంటుంది. జిఫ్ ఇమేజ్‌లుగా మార్చినా, అన్ని ఫోటోలను ఆ విధంగా కన్వర్ట్ చేయడం అనేది అంత సులువుగా సాధ్యపడదు. ఇక లైవ్ ఫోటోలను జిఫ్ ఇమేజ్‌లుగా మార్చడమనేది కూడా అంత సులభమైన ప్రొసీజర్ కాదు. అయితే గూగుల్ లాంచ్ చేసిన మోషన్ స్టిల్స్  యాప్ ద్వారా లైవ్ ఫోటోలను ఈజీగా జిఫ్ ఫైల్స్  క్రింద మార్చుకుని సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు.

 

గూగుల్ నుంచి GIF మేకింగ్ యాప్!

యూజర్లు కేవలం 3 సెకండ్ల నిడివి ఉన్న జిఫ్ ఫైల్‌తో పాటు వీడియోలను క్రియేట్ చేసుకునేందుకు యాప్‌లో కెమెరా ఉంటుంది. టచ్ చేస్తే చాలు ఆ కెమెరా ఆటోమెటిక్‌గా తన ఎదురుగా ఉన్న వారిని రికార్డ్ చేస్తుంది. అంతేకాదు ద్రుశ్యాలను కూడా తన కెమెరాలో బందిస్తుంది. ఇలా క్రియేట్ చేసుకున్న జిఫ్ ఇమేజ్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు లభిస్తుండగా, తాజగా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

English summary
Motion Stills feature has finally been released for Android devices a year after it was introduced to iOS and the app lacks behind in features.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot