Google ప్లే స్టోర్ నుంచి ఈ నాలుగు లోన్ యాప్ లు అవుట్!!!
గూగుల్ సంస్థ ఇప్పుడు ప్రజల యొక్క రక్షణ దృష్ట్యా తన యొక్క ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్ లను తొలగించడం ఎక్కువ అవుతున్నది. ఇప్పుడు కూడా కొన్ని డిజిటల్ క్రెడిట్ యాప్ లను తొలగించింది. ఈ యాప్లు అధిక వడ్డీ రేటుతో వినియోగదారులకు స్వల్పకాలిక క్రెడిట్‌ను అందిస్తున్నాయి.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి లోన్ యాప్ లు తొలగింపు
గూగుల్ ప్లే డెవలపర్ విధానాలు వినియోగదారులను రక్షించడానికి మరియు వారిని సురక్షితంగా ఉంచడానికి రూపొందించబడ్డాయి మరియు మోసపూరితమైన మరియు దోపిడీ చేసే వ్యక్తిగత రుణ నిబంధనల నుండి ప్రజలను రక్షించడంలో సహాయపడటానికి ఇటీవల ఆర్థిక సర్వీస్ విధానాన్ని విస్తరించాము. వీటిలో ఉల్లంఘనలు కనుగొనబడినందున మేము ఈ తొలగింపు చర్యను తీసుకుంటున్నాము అని గూగుల్ ప్రతినిధి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ యాప్ ల యొక్క సాధారణ ఫీచర్స్ భారతదేశంలోని చట్టపరమైన పరిధిని దాటి ఉన్నందున తొలగించారు అని గూగుల్ తెలిపింది. గూగుల్ ఇటీవల తొలగించిన నాలుగు యాప్ ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Ok Cash యాప్ తొలగింపు
ఓకే క్యాష్ యాప్ వినియోగదారులకు రుణ మొత్తాన్ని రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకు అందిస్తుంది. ఇది 91 రోజుల నుండి 365 రోజుల వరకు గల సౌకర్యవంతమైన కాలంలో రుణ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఇందులో వడ్డీ రేట్లు కస్టమర్ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ మరియు రుణంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

Go Cash యాప్ తొలగింపు
వినియోగదారులు ఈ గోక్యాష్ యాప్ ద్వారా రుణ మొత్తాన్ని రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకు పొందవచ్చు. అయితే ఈ రుణ మొత్తాన్ని వడ్డీతో కలుపుకొని 91 రోజుల నుండి 365 రోజుల లోపు చెల్లించవలసి ఉంటుంది.

Flip Cash యాప్ తొలగింపు
ఫ్లిప్ క్యాష్ యాప్ ద్వారా భారతీయ వినియోగదారులు తమకు కావలసిన వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. మీ యొక్క అన్ని ఆర్థిక అవసరాలకు ఒక స్టాప్ షాప్ అనే దావాలతో వినియోగదారులకు రుణాలను అందిస్తుంది.
SnapItLoan యాప్ తొలగింపు
స్నాపిట్ లోన్ కూడా వ్యక్తిగత రుణ అనువర్తనం. "మీరు వ్యక్తిగత రుణాలు పొందడానికి మేము క్రొత్త మార్గాన్ని సృష్టిస్తాము" అని అనువర్తనం యొక్క వివరణ.


Click it and Unblock the Notifications