'INBOX' యాప్ కు గుడ్‌బై చెబుతున్న గూగుల్
గూగుల్ తన ‘INBOX ’ యాప్‌కు గుడ్‌బై చెప్పబోతుంది. 2014లో ఈ 'INBOX ' యాప్‌ని గూగుల్ సంస్థ రూపొందించింది. ఈ యాప్ కు సరైన స్పందన రాకపోవడంతో నిలిపివేయాలి అని గూగుల్ భావిస్తుంది.
గూగుల్ తన 'INBOX ' యాప్‌కు గుడ్‌బై చెప్పబోతుంది. 2014లో ఈ 'INBOX ' యాప్‌ని గూగుల్ సంస్థ రూపొందించింది. ఈ యాప్ కు సరైన స్పందన రాకపోవడంతో నిలిపివేయాలి అని గూగుల్ భావిస్తుంది.ఈ యాప్ ను నిలిపివేసి జీమెయిల్ పై రీఫోకస్ చేయాలని గూగుల్ భావిస్తుంది.ఈ నేపథ్యంలో 2019 మార్చి నుంచి INBOX గుడ్‌బై చెప్పడంటూ గూగుల్ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నవారంతా జీమెయిల్‌కు మారేందుకు గడువును కూడా ఇచ్చింది గూగుల్ సంస్థ . వాస్తవానికి గూగుల్‌కు జీమెయిల్ యాప్ ఉంది అయినా కూడా 'INBOX' యాప్ ను రూపొందించింది .

'INBOX' యాప్...
2014లో ఈ 'INBOX' యాప్‌ని రూపొందించింది గూగుల్ సంస్థ

జీమెయిల్‌కు మారేందుకు గడువును....
ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నవారంతా జీమెయిల్‌కు మారేందుకు గడువును కూడా ఇచ్చింది గూగుల్ సంస్థ

INBOX యూజర్లు ఆన్‌లైన్ గైడ్ ద్వారా జీమెయిల్‌తో....
INBOX యూజర్లు ఆన్‌లైన్ గైడ్ ద్వారా జీమెయిల్‌తో అనుసంధానం కావాలంటూ గూగుల్ జీమెయిల్ ప్రొడక్ట్ మేనేజర్ మాథ్యూ ఇజట్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. జీమెయిల్‌లో మీ సంభాషణలన్నీ ఇప్పటికే వేచిచూస్తున్నాయంటూ మాథ్యూ పేర్కొన్నారు.

స్టోర్ చేసుకున్న ఈమెయిల్స్‌ను యూజర్లు....
అంటే స్టోర్ చేసుకున్న ఈమెయిల్స్‌ను యూజర్లు బదిలీ చేసుకోవాల్సినవసరం లేదని తెలిసింది. 'INBOX' యాప్‌లో ఇమెయిల్ స్నూజ్, ఏఐ, స్మార్ట్ రిప్లై, హై ప్రియారిటీ నోటిఫికేషన్స్, స్మార్ట్ కంపోజ్ లాంటి ఫీచర్లున్నాయి.

జీమెయిల్ యాప్‌ను గూగుల్ సరికొత్త డిజైన్‌లో.....
ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ఈ యాప్‌లో ఉన్న ఫీచర్స్‌తో ఇటీవలే జీమెయిల్ యాప్‌ను గూగుల్ సరికొత్త డిజైన్‌లో అప్‌డేట్ చేసింది.

'INBOX' యాప్ తన ప్రత్యేకతను కోల్పోయి, యూజర్లూ తగ్గారు....
'INBOX' యాప్ తన ప్రత్యేకతను కోల్పోయి, యూజర్లూ తగ్గారు. అందుకే ఇక ఈ యాప్‌ను నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications