Neighbourly యాప్‌తో మీరు కూడా పక్కా లోకల్ అయిపోతారు!
సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఎట్టకేలకు తన నైబర్లీ (Neighbourly) యాప్‌ను భారత్‌లో రోల్ అవుట్ చేసింది.
సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఎట్టకేలకు తన నైబర్లీ (Neighbourly) యాప్‌ను భారత్‌లో రోల్ అవుట్ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమ ఇరుగుపొరుగు సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది.

టెస్టింద్ దశలోనే 15 లక్షల మంది ఉపయోగించుకున్నారు...
ఈ యాప్‌ను ఏడు నగరాల్లో ముందుగా గూగుల్ పరీక్షించి చూసింది. బేటా టెస్టింగ్ దశలోనే 15 లక్షల మంది యూజర్లు ఈ యాప్ సేవలను వినిగించుకున్నారు. మరో 5 లక్షల మంది వెయిట్ లిస్ట్‌లో ఉండటం విశేషం. నైబర్లీ యాప్‌ను ముందుగా బెంగూళూరు ఇంకా ఢిల్లీ నగరాల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గూగుల్ నెక్స్ట్ బిలియన్ యూజర్స్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ బెన్ ఫోహ్నర్ బ్లూమ్‌బర్గ్ క్వింట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తరువాత పాన్ ఇండియా అంతటా నైబర్లీ యాప్ సేవలు అంబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.

లోకల్ సమచారాన్ని తెలుసుకోవచ్చు..
నైబర్లీ యాప్ ద్వారా యూజర్లు తమ చుట్టపక్కల సమచారాన్ని వెతుక్కునే వీలుంటుంది. తమకు దగ్గర్లోని రెస్టారెంట్స్, పార్క్స్, స్కూల్స్, ట్యూషన్స్, హాస్పటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ వంటి వివరాలను ఈ యాప్ ద్వారా సెర్చ్ చేసుకునే వీలుంటుంది.

దేశంలో ఏ మూలకు వెళ్లినా..
ఉద్యోగరిత్యా నగరాల్లో నవశించే వారు ఎప్పడు ఒకేచోట ఉండరు కాబట్టి, వాళ్లకు చట్టు ప్రక్కల ప్రదేశాల పై అంతగా అవగాహన ఉండదు. కాబట్టి, అటువంటి ఏ ప్రాంతానికి మారినా స్థానికంగా ఉండేవాటిని వెతికి పట్టుకునేందుకు వీలుగా తమ నైబర్లీ యాప్‌ను డిజైన్ చేసినట్లు ఫోహ్నర్ తెలిపారు.

వ్యక్తిగత సమాచారానికి పూర్తి భద్రత
యూజర్ల వ్యక్తిగత సమచారానికి ఈ యాప్‌లో పూర్తి భద్రత ఉంటుందని, ఈ యాప్‌లో స్థానిక భాషలో మాట్లాడే వీలుంటుందని ఆయన తెలిపారు. 50 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కలిగి ఉన్న భారతదేశంలో నైబర్లీ యాప్ సేవలను ఏ విధంగా మానిటైజ్ చేయాలి అనే దాని పై ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదని బెన్ ఫోహ్నర్ అన్నారు.


Click it and Unblock the Notifications








