Google Talk శకం ముగిసింది
ఆగష్టు 24, 2005న గూగుల్ టాక్ మార్కెట్లో లాంచ్ అయ్యింది.
గూగుల్ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ Google Talk అధికారికంగా డెడ్ అయ్యింది. ఈ సర్వీసును ఉపయోగించుకుంటోన్న యూజర్లు ఆటోమెటిక్‌గా Hangoutsకు స్విచ్ కాబడతారు. ఆగష్టు 24, 2005న గూగుల్ టాక్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. జూన్ 26, 2017న డిస్కంటిన్యూ కాబడింది. 11 సంవత్సరాల సుధీర్ఘ చరిత్రను కలిగిన జీటాక్‌ను రీప్లేస్ చేస్తూ ఆ స్ధానంలో హ్యాంగ్‌అవుట్స్ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Hangouts గురించి క్లుప్తంగా.. ఈ గూగుల్ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశాలను ఉచితంగా పంపుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా గ్రూప్‌లోని సభ్యల మధ్య వాయిస్ ఇంకా వీడియో కాల్స్ ఉచితం. ఈ యాప్ ద్వారా 100 మంది సభ్యులతో గ్రూప్ చాట్‌ను నిర్వహించుకోవచ్చు.

ఈ యాప్‌లో అందుబాటులో ఉంచిన ఫోటోలు, మ్యాప్స్, ఇమోజీ, స్టిక్కర్స్, యానిమేటెడ్ గిఫ్స్ వంటి ఆప్షన్‌లను ద్వారా మీ మెసేజింగ్‌ను మరింత క్రియేటివ్‌గా తీర్చిదిద్దుకోవచ్చు. 10 మంది సభ్యులతో ఉచిత గ్రూప్ వీడియో కాల్ నిర్వహించుకోవచ్చు. ప్రపంచంలోని ఏ ఫోన్ నెంబరుకైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు (అవతలి వ్యక్తి ఖచ్చితంగా హ్యాంగ్‌అవుట్స్ వినియోగదారుడై ఉండాలి).


Click it and Unblock the Notifications








