వాట్సప్, పేటీఎమ్‌లకు గూగుల్ తేజ్ ఝలక్, కొత్తగా చాటింగ్ ఫీచర్..

పేమెంట్ వాలెట్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్, పేటీఎమ్‌లకు గూగుల్ తేజ్ యాప్ ఝలక్ ఇచ్చింది. ఆ రెండింటినీ సవాల్ చేస్తూ గూగుల్ తేజ్ నుంచి ఛాట్ ఫీచర్ త్వరలో వినియోగదారుల ముందుకు రాబోతోంది.

|

పేమెంట్ వాలెట్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్, పేటీఎమ్‌లకు గూగుల్ తేజ్ యాప్ ఝలక్ ఇచ్చింది. ఆ రెండింటినీ సవాల్ చేస్తూ గూగుల్ తేజ్ నుంచి ఛాట్ ఫీచర్ త్వరలో వినియోగదారుల ముందుకు రాబోతోంది. వినియోగదారులు డబ్బులను ఇతరులకు పంపే సమయంలో వారితో నేరుగా సంభాషించుకునే ఛాన్స్ ఉంది. పేమెంట్స్ కి సంబంధించి ఏమైనా సందేహాలు అంటే అకౌంట్ నంబర్, బ్రాంచ్ కోడ్ లాంటి వాటిని వెంటనే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. కాగా గూగుల్ తేజ్ వచ్చిన వారం తర్వాత వాట్సప్ పేమెంట్స్ ఫీచర్‌పై టెస్టింగ్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. గూగుల్ నుంచి త్వరలో ఈ ఛాట్ ఫీచర్ రాబోతుందని గూగుల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. మేము ఈ ఫీచర్ ను యాడ్ చేస్తున్నామని దీని ద్వారా తేజ్ వినియోగదారులు పేమెంట్ చేసే సమయంలో కాంటాక్ట్స్ లో ఉన్న నంబర్లకు ఛాట్ చేసుకునే సౌకర్యాన్ని కల్సిస్తున్నామని ఈ మెయిల్ ద్వారా తెలిపినట్లు Gadgets 360 కూడా స్పష్టం చేసింది.

మళ్లీ షాకిచ్చిన గూగుల్, ముఖ్యమైన 10 యాప్స్‌ తొలగింపు, ఆ యాప్స్ ఇవే !మళ్లీ షాకిచ్చిన గూగుల్, ముఖ్యమైన 10 యాప్స్‌ తొలగింపు, ఆ యాప్స్ ఇవే !

గూగుల్ తేజ్ లేటెస్ట్ వర్షన్..

గూగుల్ తేజ్ లేటెస్ట్ వర్షన్..

అయితే నిరాశాకరమైన విషయం ఏంటంటే ఈ ఫీచర్ గూగుల్ తేజ్ యూజర్లందరికీ అందుబాటులో లేదు. ఇది కేవలం గూగుల్ తేజ్ లేటెస్ట్ వర్షన్ వాడుతున్న మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఫీచర్ వాడుకోవాలంటే ఇద్దరూ లేటెస్ట్ వర్షన్ కలిగి ఉండాలి.

పే , రిక్వస్ట్ బటన్స్ దగ్గర..

పే , రిక్వస్ట్ బటన్స్ దగ్గర..

ఈ ఫీచర్ గూగుల్ తేజ్ యాప్ లో రైట్ తరువాత కనిపించే పే , రిక్వస్ట్ బటన్స్ దగ్గర కనిపిస్తుంది. అక్కడ మీరు ఈబటన్ చూడవచ్చు. ఛాటింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీరు నచ్చని కాంటాక్ట్ వివరాలను ఇక్కడి నుంచే బ్లాక్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

పేటీఎమ్

పేటీఎమ్

కాగా గతేడాది నవంబర్ లో పేటీఎమ్ ఛాట్ ప్లాట్ ఫాంను యాడ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీని ద్వారా మీరు ఫోటోలు, వీడియోలు, లోకేషన్స్ షేర్ చేసుకునే అవకాశం ఉంది. వాట్సప్ పేమెంట్ ఫీచర్ ని ఇండియాలో స్టార్ట్ చేసిన నేపథ్యంలో పేటీఎమ్ ఈ రకమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

140 మిలియన్ ట్రాన్సిక్షన్స్

140 మిలియన్ ట్రాన్సిక్షన్స్

అయితే గూగుల్ తేజ్ యాప్ లో ఈ ఫీచర్ ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా గూగుల్ తేజ్ యాప్ డిసెంబర్ నాటికి 12 మిలియన్ యూజర్లతో దూసుకుపోతోంది. గతేడాది సెప్టెంబర్ నాటికి ఈ యాప్ నుంచి 140 మిలియన్ ట్రాన్సిక్షన్స్ జరిగాయని గూగుల్ తెలిపింది. కాగా తేజ్ యాప్ ఈ మధ్య యుటిలిటి బిల్ ఫీచర్ ను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Google Tez ద్వారా డబ్బులు పంపడం ఎలా..?

Google Tez ద్వారా డబ్బులు పంపడం ఎలా..?

మీరు ఇప్పటి వరకు Google Tez యాప్‌ను ట్రై చేయినట్లయితే, ఈ కధనం ద్వారా యాప్ వినియోగం గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

స్టెప్ 1 : ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Google Tez యాప్‌ను, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు యాపిల్ ఐఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే ఐఓఎస్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను పొందవల్సి ఉంటుంది.

స్టెప్ 2 , 3:

స్టెప్ 2 , 3:

స్టెప్ 2 : Google Tez యాప్‌ మీ ఫోన్‌లో విజయవంతంగా ఇన్‌స్టాల్ అయిన తరవాత యాప్‌ను ఓపెన్ చేసి ముందుగా భాషను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ ఆప్షన్‌ను కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. భాషను ఎంపిక చేసుకున్న తరువాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే Arrow మార్క్ పై టాప్ చేసినట్లయితే తరువాతి మెనూలోకి వెళతారు.
స్టెప్ 3 : ఈ మెనూలో మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటంది. (ముఖ్య గమనిక : మీరు ఎంటర్ చేసే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి).

స్టెప్ 4 , 5:

స్టెప్ 4 , 5:

స్టెప్ 4 :తరువాతి స్టెప్‌లో భాగంగా Tez యాప్‌‌తో లింక్ చేయవల్సిన గూగుల్ అకౌంట్ తాలుకా వివరాలకు యాప్ అడుగుతుంది. మీ గూగుల్ అకౌంట్‌ను లింక్ చేసి యాప్ రిక్వెస్ట్‌లకు యాక్సెస్ ఇచ్చినట్లయితే OTP వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.

స్టెప్ 5 : OTP వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత Google Tez యాప్‌ సెక్యూరిటీకి సంబంధించి డివైస్ లాక్ లేదా సపరేట్ గూగుల్ పిన్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. దీంతో యాప్‌కు సంబంధించిన ఇనీషియల్ సెటప్ ప్రాసెస్ పూర్తవుతుంది.

Google Tez యాప్‌కు బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేయటం ఎలా..?

Google Tez యాప్‌కు బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేయటం ఎలా..?

స్టెప్ 1 : Google Tez యాప్‌కు సంబంధించి ఇనీషియల్ సెటప్ ప్రాసెస్ విజయంతంగా పూర్తి అయిన తరువాత, యూజర్ ప్రొఫైల్ నేమ్ క్రింద 'Add Bank Account' అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
స్టెప్ 2 : Google Tez యాప్‌ భారత్‌లోని అన్ని ప్రముఖ బ్యాంక్‌లను సపోర్ట్ చేస్తుంది. వాటిలో మీ బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే, మీరిచ్చిన మొబైల్ నెంబర్ నుంచి, ఆ బ్యాంక్ స్టాండర్డ్ ఆపరేటర్‌కు ఓ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ పంపబడుతుంది. ఆ మొబైల్ నెంబర్‌తో మీ అకౌంట్ లింక్ అయి ఉన్నట్లయితే ఆ వివరాలు వెంటనే యాప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి.

స్టెప్ 3,4,5 :

స్టెప్ 3,4,5 :

స్టెప్ 3 : తరువాతి స్టెప్‌లో భాగంగా మీ బ్యాంక్ అకౌంట్ తాలుకూ UPI IDని ఎంటర్ చేయమని యాప్ అడుగుతుంది. మీరు గతంలోనే UPI IDని కలిగి ఉన్నట్లయితే మళ్లీ అదే ఐడీని వెరిఫికేషన్ నిమిత్తం ఎంటర్ చేయవల్సి ఉంటుంది. 'Enter UPI PIN' ఆప్షన్ పై టాప్ చేసి 4-అంకెల పిన్‌ను ఎంటర్ చేసినట్లయితే, ఆ UPI IDతో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ యాప్‌లో యాడ్ అవుతుంది.

స్టెప్ 4 : ఒకవేళ మీ వద్ద UPI ID అందుబాటులో లేనట్లయితే కొత్తది క్రియేట్ చేసుకోవటం చాలా సులువు. యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకునేందుకు స్టెప్ 2లో కనిపించే bank and mobile number ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని 'Proceed' బటన్ పై టాప్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 5 : ఇక్కడ మీ నెంబర్‌తో లింక్ అయి ఉన్న డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేసినట్లయితే వెరిఫికేషన్ నిమిత్తం ఓ OTP మీకు అందుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత మీకు నచ్చిన 4-అంకెల UPI పిన్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది. ఆ తరువాత నుంచి Google Tez యాప్‌ ద్వారా విజయవంతగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

Google Tez యాప్ అనేక రకాల నగదు లావాదేవీలను అనుమతిస్తోంది. వాటి వివరాలు

Google Tez యాప్ అనేక రకాల నగదు లావాదేవీలను అనుమతిస్తోంది. వాటి వివరాలు

అకౌంట్ నెంబర్ ఆధారిత నగదు లావాదేవీలు..
Google Tez యాప్ ద్వారా అకౌంట్ నెంబర్ ఆధారిత నగదు లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది. ఈ విధమైన లావాదేవీలను నిర్వహించుకోవాలనుకునే వారు యాప్‌లోని పేమెంట్స్ సెక్షన్‌లోని 'Account Number' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని అందులో రిసిప్టెంట్ పేరు, వారి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివరాలతో పాటు పంపాల్సిన నగదును ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ పై ప్రెస్ చేసినట్లయితే మీ బ్యాంక్ UPI PINను అడుగుతుంది. ఈ నాలుగు అంకెలు పిన్‌ను ఎంటర్ చేసినట్లయితే నగదు బదిలి విజయవంతంగా పూర్తవుతుంది.

యూపీఐ ఐడీ (UPI ID)

యూపీఐ ఐడీ (UPI ID)

Google Tez యాప్ ద్వారా UPI ID ఆధారిత నగదు లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది. ఈ విధమైన లావాదేవీలను నిర్వహించుకునే సమయంలో నగదు చేరాలనుకుంటున్న వ్యక్తికి సంబంధించి UPI ID చాలా కీలకం. ఈ ఐడీ ద్వారానే నగదు ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుంది.

క్యూఆర్ కోడ్ (QR Code)

క్యూఆర్ కోడ్ (QR Code)

Google Tez యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత నగదు లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది. రిసిప్టెంట్‌కు సంబంధించిన QR Codeను స్కాన్ చేయటం ద్వారా నగదు బదిలీ చేసే వీలుంటుంది. 'Scan QR Code' ఆప్షన్‌లోకి వెళ్లాలంటే యాప్ మెయిన్ స్ర్కీన్‌లోని three dot మెనూ పై టాప్ చేయాల్సి ఉంటుంది.

ఫోన్ నెంబర్ (Phone)

ఫోన్ నెంబర్ (Phone)

Google Tez యాప్ ద్వారా ఫోన్ నెంబర్ ఆధారిత నగదు లావాదేవీలను కూడా నిర్వహించుకోవచ్చు. ఈ విధమైన నగదు లావాదేవీలు విజయవంతంగా పూర్తవ్వాలంటే నగదు రిసీవ్ చేసుకునే అవతలి వ్యక్తి కూడా యక్టివ్ Google Tez యూజర్ అయి ఉండాలి.

Best Mobiles in India

English summary
Google Tez Adds Simple Chat Feature to Take on WhatsApp, Paytm More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X