భారీ రివార్డ్ ఆఫర్లతో గూగల్ తేజ్ పేమెంట్స్ యాప్ వచ్చేసింది
గూగుల్ తేజ్ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌పోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన మొబైల్ పేమెంట్ సర్వీస్ తేజ్ (Tez)ను సోమవారం భారత్‌లో లాంచ్ చేసింది. తేజ్ యాప్ ద్వారా యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్ల నుంచి వేరొకరి అకౌంట్లలోకి నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది. యూపీఐ ఐడి, క్యూఆర్ కోడ్ ఇంకా మొబైల్ పేమెంట్స్‌ను కూడా ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.

గూగుల్ తేజ్ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌పోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను మరింతగా ప్రమోట్ చేసేందుకు రిఫరల్ రివార్డ్ ప్రోగ్రామ్‌ను కూడా గూగుల్ అనౌన్స్ చేసింది.

ఈ రిఫరల్ ప్రోగ్రామ్ క్రింద ఈ యాప్‌ను మీ స్నేహితులకు రిఫర్ చేసి, వారిని ఉపయోగించుకునేలా చేసినట్లయితే మీతో పాటు మీ స్నేహితులకు రూ.51 రివార్డ్ లభిస్తుంది. ఇలా రూ.9,000 వరకు రివార్డు గెలుచుకునే వీలుంటుంది. ఏప్రిల్ 1, 2018 వరకు ఈ రిఫరల్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది. అన్రి ప్రముఖ బ్యాంక్‌లతో పాటు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను కూడా ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications