ఈ యాప్స్ మీ చెంతనుంటే మీ సమయం బాగా సేవ్ అవుతుంది

By Gizbot Bureau
|

ఒకప్పుడు అవసరం అనుకున్న ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లా మారాకా వ్యసనం అయిపయింది. అవసరం ఉన్నా, లేకపోయినా యాప్స్ ఎక్కువగా వాడుతుండటం వల్ల ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌తోనే సరిపోతుంది. ఫోన్‌లో పదుల సంఖ్యలో యాప్స్ ఇన్‌స్టాల్ చేసి, గంటలు గంటలు వాటితో గడుపుతూ సమయాన్ని వృథా చేసుకోవడమే కాదు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. దీనిని ఎలాగైనా తగ్గించాలని గూగుల్ రెడీ అయింది.ఇందులో భాగంగా డిజిటల్ వెల్‌బీయింగ్ పేరుతో గతేడాది ఓ యాప్ లాంచ్ చేసింది. వేస్ట్ సమయాన్ని తగ్గించడం కోసం డిజిటల్ వెల్‌బీయింగ్‌పై దృష్టిపెట్టింది గూగుల్. ఇందుకోసం ప్రత్యేకంగా 5 యాప్స్ రూపొందించింది. వాటి ఉపయోగాలేంటో తెలుసుకోండి.

Unlock Clock:
 

Unlock Clock:

గూగుల్ డిజిటల్ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా అన్‌లాక్ క్లాక్ యాప్ రూపొందించింది. మీరు ఒక రోజులో ఎన్నిసార్లు ఫోన్‌ను అన్‌లాక్ చేశారో ఈ యాప్ లెక్కించి చూపిస్తుంది . ఇందుకోసం మీరు వాల్‌పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించాలి.

Post Box: 

Post Box: 

బిజీ పనుల్లో ఉన్నప్పుటు వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్స్ చికాకుపుట్టిస్తుంటాయి. ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఇలాంటి సమస్యకు పోస్ట్ బాక్స్ యాప్‌తో గూగుల్ చెక్ పెడుతోంది . మీరు ఏ సమయాల్లో నోటిఫికేషన్స్ పొందాలో ఈ యాప్ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు.

We Flip: 

We Flip: 

స్నేహితులంతా కలిసి ఎక్కడికైనా వెళ్తే అందరూ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించకుండా సమయాన్ని గడిపేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్ లాక్ చేయాలి. గ్రూప్‌లో ఏ ఒక్కరు ఫోన్ అన్‌లాక్ చేసినా తెలిసిపోతుంది.

Desert Island: 
 

Desert Island: 

మీరు ఎక్కడికైనా టూర్ వెళ్లినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోకుండా అవసరమైన యాప్స్ మాత్రమే ఉపయోగించడానికి డిసర్ట్ ఐల్యాండ్ యాప్ ఉపయోగపడుతుంది. ఆ రోజు మీరు ఏ యాప్స్ అవసరమో వాటిని సెలెక్ట్ చేసుకొని అవి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. మిగతా యాప్స్ కనిపించవు.

Morph:

Morph:

ఏ యాప్‌ను ఎంత సేపు ఉపయోగించాలో మీరే ఈ మార్ఫ్ యాప్ ద్వారా సమయాన్ని కేటాయించడానికి ఉపయోగపడుతుంది. మీరున్న స్థలం, సమయాన్ని బట్టి ఆ యాప్స్ పనిచేస్తాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google wants to reduce your smartphone addiction with these apps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X