వాట్సాప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనా
సోషల్ మీడియా వెబ్‌సైట్‌ల వినియోగం పై గతకొంత కాలంగా ఆంక్షలు విధిస్తూ వస్తోన్న చైనా ప్రభుత్వం తాజాగా వాట్సాప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చినట్లు తెలుస్తోంది. చైనా అంతటా వాట్సాప్ వినియోగాన్ని బ్లాక్ చేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని న్యూయార్క్ టైమ్స్ ఓ రిపోర్టులో పేర్కొంది. గత కొద్ది నెలలుగా వాట్సాప్‌కు చైనాలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. వాట్సాప్ ద్వారా నిర్వహించుకునే ఫోటో షేరింగ్‌తో పాటు వీడియో కాల్స్ పై చైనాలో ఇప్పటికే ఆంక్షలు అమలులో ఉన్నాయి.

తాజాగా తీసుకున్న నిర్ణయంతో చైనా యూజర్లు వాట్సాప్ ద్వారా టెక్స్టింగ్ కూడా చేయలేకపోతున్నట్లు సమాచారం. వాట్సాప్ తన మెసేజింగ్ సర్వీసుకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కల్పిస్తుండటమే చైనా ఆగ్రహానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమ మెసేజింగ్ సర్వీసును బ్లాక్ చేసిన విషయమై వాట్సాప్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ట్విట్టర్‌లో వెల్లువెత్తుతోన్న నిరసనల ప్రకారం సెప్టంబర్ 23 నుంచే వాట్సాప్ సేవలు అందుబాటులో లేకుండా పోయినట్లు తెలుస్తోంది.
ఇటు వాట్సాప్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల పైనా సెన్సార్‌షిప్ నిబంధనలు కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా చైనా యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, గూగుల్ వంటి సైట్‌లను వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ అలానే థర్ట్ పార్టీ యాప్స్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా నిబంధనలను మరింత కఠినతరం అవటంతో వీపీఎస్ యాక్సెస్ ద్వారా కూడా ఈ సేవలను పొందలేకపోతున్నారు.
CNN మీడియా సంస్థ పోస్ట్ చేసిన మరో కధనం ప్రకారం ఇంటర్నెషనల్ సిమ్ కార్డ్‌లతో పాటు డేటా ప్యాక్‌లను వినియోగించుచుంటోన్న యూజర్లకు వాట్సాప్ వినియోగం విషయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తటం లేదట. దీనిబట్టి చూస్తుంటే కేవలం చైనా యాజర్లు మాత్రమే వాట్సాప్ సేవలను వినియోగించుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది.
సెక్యూరిటీ పరంగా ఇప్పుడు వాట్సప్ ఇప్పుడు మరింత శక్తివంతమైన తయారైంది. ఈ సర్వీసును వినియోగించుకుంటోన్న యూజర్లు ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ను పొందగలుగుతున్నారు. ఈ ఎన్ క్రిప్షన్ వ్యవస్థ ద్వారా వాట్సాప్ ద్వారా వెళ్లే మెసేజ్‌లు, కాల్స్, వీడియోలు, ఫోటోలను ఎవ్వరూ హ్యాక్ చేయకుండా కాపాడుతుంది.
సెండర్ నుంచి వెళ్లిన మెసేజ్‌ను కేవలం రిసీవర్ మాత్రం చూడగలరు. నేరస్థులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ, హ్యాకర్లు కానీ ఎవ్వరూ ఆ మెసేజ్‌లను అక్రమంగా చూసే వీలుండదు. మాక్సీ మార్లిన్ స్పైక్ అనే క్రిప్టోగ్రాఫర్ ఎన్‌స్క్రిప్షన్ టెక్నాలజీని డెవలప్ చేశారు.
ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నప్పటికి వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్ ఏమాత్రం సురక్షితం కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మెసేజింగ్ యాప్‌లో 'అథెంటికేషన్ సెరిమనీ' అనే ముఖ్యమైన సెక్యూరిటీ టూల్ లోపించినట్లు Brigham Young University పరిశోధకులు గుర్తించారు.ఈ విధమైన అథంటికేషన్ లేకపోయినట్లయితే యూజర్ల మధ్య జరిగే సంభాషణలను థర్డ్ పార్టీ లేదా మిడిల్ అటాకర్లు సులువుగా హ్యాక్ చేయగలుగుతారని పరిశోధకలు చెబుతున్నారు.
వాట్సాప్‌ను 2009లో ఇద్దురు మాజీ - యాహూ ఉద్యోగులు అమెరికన్ బ్రెయిన్ ఆక్టన్, ఉక్రేనియన్ జాన్ కౌమ్‌లు ప్రారంభించారు. 2014లో ఈ కంపెనీని సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువమంది యాక్టివ్‌గా ఉపయోగించుకుంటున్నారు.ఓ విశ్లేషణ ప్రకారం వాట్సాప్‌లో రోజు 42 బిలియన్‌ల మెసెజ్‌లతో పాటు 1.6 బిలియన్ల ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.


Click it and Unblock the Notifications








