ఓలా, ఉబర్‌కు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. దోపిడీ ధరలకు ఇక ఫుల్‌స్టాప్?
ప్రముఖ క్యాబ్ సంస్థలు ఓలా, ఉబర్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఇటీవల కాలంలో ఈ కంపెనీలు ప్రయాణికులను దోచుకుంటున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి స్వయంగా రంగంలోకి దిగి, ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో పడ్డారు. క్యాబ్ కస్టమర్ల ప్రకారం మన దగ్గర ఏ ఫోన్ ఉంటే దాన్ని బట్టి టికెట్ ధర మారుతోంది.
ఐఫోన్ వాడే వారికి ఒక ధర, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే మరో ధర చూపిస్తున్నారని చాలా మంది కస్టమర్లు కంప్లైంట్ చేశారు. దీంతో అలెర్ట్ అయిన ప్రభుత్వం, వెంటనే రంగంలోకి దిగింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ (CCPA) ఈ వ్యవహారంపై సీరియస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది.

ఓలా, ఉబర్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. "మీరు ధరలు ఎలా నిర్ణయిస్తున్నారు? ఫోన్లను బట్టి ధరలు ఎందుకు మారుతున్నాయి? ఐఫోన్ వాడితే ఒక ధర, ఆండ్రాయిడ్ ఫోన్ వాడితే మరో ధరనా?" అని నిలదీస్తూనే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
* ప్రయోగంతో ధరల్లో తేడాలు బట్టబయలు
ఇటీవల ఒకే రైడ్‌కు వేర్వేరు ఫోన్లలో వేర్వేరు ధరలు చూపిస్తున్నారని ఒక నెటిజన్ ప్రయోగం ద్వారా రుజువు చేశారు. ఈ విషయంలో పారదర్శకత అవసరమని కంప్లైంట్ చేశారు. దీంతో సీసీపీఏ ధరల మతలబు చెప్పాలని ఓలా, ఉబర్లను నిలదీస్తోంది. కొన్ని ఫోన్ మోడల్స్‌లో రేట్లు పెంచడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించింది.
*యాపిల్‌కు కూడా వార్నింగ్ ఇచ్చిన సర్కార్..
ఇలాంటి హెచ్చరికలు గతంలో యాపిల్‌కు కూడా వెళ్లాయి. ఐఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన తర్వాత ఫోన్లు సరిగా పనిచేయడం లేదని కస్టమర్లు కంప్లైంట్ చేశారు. దీనిపై ప్రభుత్వం యాపిల్‌ను కూడా హెచ్చరించింది. అంటే వినియోగదారుల విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వం ఇప్పుడు డిజిటల్ వేదికలపై జరుగుతున్న అన్యాయాలను ఏమాత్రం సహించేది లేదు అని తేల్చి చెప్పింది. ఓలా, ఉబర్ సంస్థలు వెంటనే తమ ధరల విధానాన్ని స్పష్టం చేయాలని, మోసపూరిత పద్ధతులను సరిదిద్దుకోవాలని ఆదేశించింది. వినియోగదారులకు న్యాయం చేయడంలో వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
* డిజిటల్ దోపిడీకి చెక్ పెట్టేందుకే ఈ యాక్షన్..
ఇదిలా ఉండగా, టెలికాం రంగంలో కూడా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) సూచన మేరకు, టెలికాం కంపెనీలు చౌకైన వాయిస్ కాల్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ముఖ్యంగా 2G వాడుతున్న పేద ప్రజల కోసం డేటా లేని, కేవలం కాలింగ్ ప్లాన్లను తీసుకురావాలని TRAI కోరింది.
దీంతో జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు తక్కువ ధరకే ఎక్కువ కాలం వాలిడిటీ ఉండే ప్లాన్లను ప్రకటించాయి. మొత్తానికి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వినియోగదారుల సమస్యలపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. డిజిటల్ వేదికలైనా, టెలికాం సంస్థలైనా ఎవరైనా సరే వినియోగదారులను మోసం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది.
ఇలాంటి చర్యలతో వినియోగదారులకు డిజిటల్ సేవలపై నమ్మకం పెరుగుతుందని, కంపెనీలు కూడా చాలా జాగ్రత్తలతో న్యాయంగా వ్యాపారం చేస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ కంపెనీలు సరైన సమాధానాలు చెప్పి ఈ సమస్యను పరిష్కరిస్తాయని, భవిష్యత్తులో వ్యాపార విధానాలు మరింత కఠినంగా ఉంటాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








