ఈ యాప్ వాడేవారికి భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

Written By:

ఈ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా భీమ్ వినియోగదారులకు బంపర్ బొనంజాలు అందనున్నాయి. భీమ్ యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీలు పెంచడానికి వీరికి భారీ మొత్తంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ ఈ యాప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గత డిసెంబర్ లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీ.సి.ఐ) ఆధ్వర్యంలోని యుపిఐ ద్వారా పనిచేస్తోంది.

రూ. 7 వేలు తగ్గిన ఆపిల్ ఐఫోన్ SE

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారీగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

భీమ్ యాప్ వాడే వినియోగదారులకు భారీగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వాలని తాము ప్రభుత్వానికి ప్రతిపాదించామని, ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఎన్పీసీఐ ఎండీ, సీఈఓ ఎపి హోటా చెప్పారు. ఇదే క్రమంలో భీమ్ కొత్త వెర్షన్ను కూడా ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొంది.

అలాగైతేనే ఎక్కువమంది

క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలను మరింత పెంచాలని తాము ప్రభుత్వం చర్చించామని, అలాగైతేనే ఎక్కువమంది ఈ యాప్ వాడతారని చెప్పినట్టు చెప్పారు.

10 రూపాయల నుంచి 25 రూపాయల మధ్యలో

ఆగస్టు 15 నుండి అమల్లోకి తేవాలనుకున్నా ఈ ప్రోత్సాహక ప్రతిపాదన ప్రభుత్వానికి ఆమోదం కోసం వేచి చూస్తోంది. ప్రస్తుతం భీమ్ యాప్ వాడేవారికీ క్యాష్బ్యాక్ ఆఫర్లు 10 రూపాయల నుంచి 25 రూపాయల మధ్యలో ఉన్నాయి.

పేటీఎం, ఫోన్పే యాప్లు

డిజిటల్ లావాదేవీల్లో ముందరి పేటీఎం, ఫోన్పే యాప్లు తమ ప్లాట్ఫాంలపై భారీ మొత్తంలో డిస్కౌంట్ లను ఆఫర్ చేస్తున్నాయి. వీటికి గ్లోబల్ ఇన్వెస్స్టర్లు మద్దతు ఉండటం వలన డిస్కౌంట్లు సాధ్యపడుతున్నాయి.

ఓ వ్యక్తి మరొక వ్యక్తికి భీమ్ యాప్ ను రిఫర్ చేస్తే

కానీ భీమ్ యాప్లో ఓ వ్యక్తి మరొక వ్యక్తికి భీమ్ యాప్ ను రిఫర్ చేస్తే, 10 రూపాయల కింద, రిఫర్ చేసిన వ్యక్తి రూ .25 కాష్బ్యాక్ని అందిస్తున్నాడు. గత నెలలోనే యుపిఐఐ ద్వారా లావాదేవీలు పెంచుకోవడానికి వర్తకులకి యుపిఐ ఛార్జీలు బ్యాంకులు తగ్గించాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Government may give Bhim App users cashback bonanza on Independence Day Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot