Home
Apps

క్రోమ్ వాడుతున్న వారికి డేంజర్ అలర్ట్.. వెంటనే క్లిక్ చేసి తెలుసుకోకపోతే అంతే సంగతులు..

CERT Warns: భారతదేశ సైబర్ సెక్యూరిటీ సంస్థ CERT-In గూగుల్ క్రోమ్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా మ్యాక్, విండోస్, క్రోమ్ బుక్స్ వాడుతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలని హెచ్చరించింది. ఎందుకంటే క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొన్ని ప్రమాదకరమైన లోపాలు బయటపడ్డాయి. ఈ లోపాలతో హ్యాకర్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించగలరు, మీ కంప్యూటర్‌ని తమ కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు, సిస్టమ్‌ని క్రాష్ కూడా చేయగలరు. అందుకే బ్రౌజర్‌ని, ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్‌డేట్ చేసుకోమని చెబుతోంది.

* మ్యాక్ యూజర్లకు ప్రత్యేక హెచ్చరిక

మ్యాక్ వాడుతున్న గూగుల్ క్రోమ్ యూజర్లకు రెండు లోపాలు (CIVN-2025-0007, CIVN-2025-0008) ఉన్నాయని గుర్తించారు. క్రోమ్ వెర్షన్ 132.0.6834.83/8r కంటే పాత వెర్షన్లు వాడుతుంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. హ్యాకర్లు ఈ లోపాలను ఉపయోగించి మీ డివైజ్‌లోకి హానికరమైన కోడ్ పంపగలరు, సిస్టమ్‌ని క్రాష్ చేయగలరు, దీన్నే డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అంటారు.

Government Warns of Critical Vulnerabilities in Google Chrome and ChromeOS

అంతేకాదు మీ డివైజ్‌లోని సెక్యూరిటీ ఫీచర్లను కూడా దాటేయగలరు. మెమరీ ఎర్రర్స్, నావిగేషన్ ఫంక్షన్లలో సమస్యలు, బ్రౌజర్ ఎక్స్టెన్షన్లలో బలహీనమైన డేటా చెక్స్ వంటి కారణాల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మ్యాచ్ యూజర్లు లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ కావడం మంచిది.

* విండోస్ యూజర్లూ జాగ్రత్త

విండోస్ వాడుతున్న యూజర్లకు కూడా ఇదే ప్రమాదం పొంచి ఉంది. క్రోమ్ వెర్షన్ 132.0.6834.110/111 కంటే పాత వెర్షన్లు వాడుతుంటే మీరు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. హ్యాకర్లు మీకు ప్రమాదకరమైన రిక్వెస్టులు పంపి మీ సున్నితమైన డేటాని దొంగిలించగలరు, మీ సిస్టమ్ ని క్రాష్ చేయగలరు.

అంతేకాదు మీ డివైజ్ ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి విండోస్ యూజర్లు కూడా వెంటనే తమ క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఒక్క యూజర్లకే కాదు, బిజినెస్ సంస్థలకి కూడా చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

* క్రోమ్ బుక్ యూజర్లు

క్రోమ్ బుక్ వాడుతున్న యూజర్లకు కూడా ఈ ప్రమాదం ఉంది. క్రోమ్ఓఎస్ వెర్షన్ 16093.68.0 (బ్రౌజర్ వెర్షన్ 132.0.6834.94) కంటే పాత వెర్షన్లు వాడుతుంటే మీరు కూడా సేఫ్ కాదు. ఈ లోపాల వల్ల హ్యాకర్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించగలరు, మీ డివైజ్ లో హానికరమైన స్క్రిప్ట్‌లను రన్ చేయగలరు (క్రాస్-సైట్ స్క్రిప్టింగ్).

అంతేకాదు మీ డివైజ్‌ని రిమోట్‌గా కంట్రోల్ చేసే కోడ్‌ని కూడా పంపగలరు. మెమరీ ఎర్రర్స్ (బఫర్, ఇంటీజర్ ఓవర్‌ఫ్లోస్), సిస్టమ్ చెక్స్ సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అనుకోకుండా ఏదైనా ప్రమాదకరమైన వెబ్‌పేజీని విజిట్ చేస్తే, హ్యాకర్లు ఈ బలహీనతలను ఉపయోగించుకుని మీ డివైజ్‌లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది.

* ఎవరెవరికి ప్రమాదకరం

ఈ సమస్యలు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, క్రోమ్ బుక్స్ పాత వెర్షన్ల గూగుల్ క్రోమ్ లేదా క్రోమ్ఓఎస్ రన్ చేస్తున్నవాళ్లకి ఎక్కువ ప్రమాదం. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కొంచెం తక్కువ ప్రమాదమే కానీ, అందరూ జాగ్రత్తగా ఉండటం మంచిది. గూగుల్ క్రోమ్, క్రోమ్ఓఎస్‌ని లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. సిస్టమ్‌ని సెక్యూర్‌గా ఉంచుకోవడానికి ఆటోమేటిక్ అప్డేట్స్ ఆన్ చేసుకోవాలి.

* అప్‌డేట్ చేసుకోకపోతే జరిగే నష్టం

ఈ హెచ్చరికలను లైట్ తీసుకుంటే డేటా దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది, మీ సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు, అంతేకాదు మీ డివైజ్‌ను హ్యాకర్లు కంట్రోల్ లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అప్రమత్తంగా ఉండాలి, వెంటనే అప్డేట్ చేసుకుని, మీ సిస్టమ్‌ని మీరు కాపాడుకోవాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
CERT-In warns Google Chrome and ChromeOS users of critical vulnerabilities. Update immediately to avoid data theft, system control by hackers, and crashes. Flaws exist in older versions on Mac, Windows, and Chromebooks.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X