ఇకపై పోర్న్ వీడియోలు చూడలేరు, టెలికం కంపెనీలు బ్యాన్ చేశాయి

|

మనలో చాలా మంది బూతు వీడియోలు, బూతు బొమ్మలూ చూస్తూ ఈ విషయం ఎవరికీ తెలియదులే అనుకుంటూ ఉంటారు. కానీ చూసేది ఇంటర్నెట్ నుంచీ కదా. ఎక్కువ మంది వాటి కోసం సెర్చ్ చేస్తున్నది గూగుల్, ఫేస్‌బుక్‌లోనే. అక్కడే వారిపై ఆన్‌లైన్ కంపెనీలు నిఘా పెడుతున్నాయి. అయినప్పటికీ ఇండియాలో పోర్న్ ఆగడం లేదు.

 
Govt says porn sites blocked by Jio, Airtel, and others

దీంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేసింది. కేంద్ర ప్రభుత్వం వందల సంఖ్యలో పోర్న్ సైట్లను నిషేధించింది. టెలికం విభాగం ఆదేశాల మేరకు జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి పలు కంపెనీలు కూడా ఈ వెబ్‌సైట్లు ఓపెన్ చేయకుండా బ్లాక్ చేశాయి.

 టెలికం కంపెనీలు

టెలికం కంపెనీలు

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్ఎల్ వంటి కంపెనీలు వందల సంఖ్యలో పోర్న్ వీడియో సైట్లను బ్లాక్ చేశాయి. అంటే ఈ టెలికం యూజర్లు వారి ఫోన్లలో బూతు వీడియోలు చూడటం కుదరదు. టెలికం డిపార్ట్‌మెంట్ పోర్న్ సైట్ల బ్లాకింగ్‌కు సంబంధించి ఆర్డర్లు జారీ చేసిందని, ఈ నేపథ్యంలోనే టెలికం కంపెనీలు ఆ సైట్లు ఓపెన్ కాకుండా చూస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆర్‌టీఐ ప్రశ్నకు వివరణ ఇచ్చింది.

 పోర్న్ సైట్లను నిషేధం

పోర్న్ సైట్లను నిషేధం

ఇకపై జియో, ఎయిర్‌టెల్ సహా ఇతర కంపెనీల యూజర్లు అశ్లీల వీడియోలు చూడలేరు. ముంబై కోర్టు 2016, 2017లో రెండు సార్లు, ఉత్తరాఖండ్ హైకోర్టు ఒకసారి పోర్న్ సైట్ల బ్లాక్‌కు సంబంధించి ఆర్డర్లు వెలువరించాయని, వీటికి అనుగుణంగానే పోర్న్ సైట్లను నిషేధించామని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ (ఎంఈఐటీ‌వై) వివరణ ఇచ్చింది.

  పోర్న్ వీడియోలు ప్రైవేట్‌గా చూడటం
 

పోర్న్ వీడియోలు ప్రైవేట్‌గా చూడటం

ఇదిలా ఉంటే భారత్‌లో పోర్న్ వీడియోలు ప్రైవేట్‌గా చూడటం చట్టవిరుద్ధం కాదని కూడా కేంద్రం తెలిపింది. అయితే చైల్డ్ పోర్నోగ్రఫీ మాత్రం చట్టవిరుద్ధం. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలోనే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు టెలికం కంపెనీలు కూడా దీనిని బ్యాన్ చేశాయి కాబట్టి ఇకపై అవి చూడలేరు.

గూగుల్ నిఘా

గూగుల్ నిఘా

ఇదిలా ఉంటే ప్రపంచంలో ఎక్కువ మంది చూస్తున్న 74 పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లపై గూగుల్ నిఘా ఉందని తెలుస్తోంది. ఈ సైట్లలోకి ఎవరు వెళ్లినా... వాళ్ల పూర్తి వివరాల్ని గూగుల్ లాగేస్తోందన్నది తాజాగా బయటపడిన విషయం. ప్రజలపై ఇలాంటి నిఘా పెడుతున్న సంస్థలు చాలా ఉన్నాయి. గూగుల్, ఫేస్‌బుక్‌తోపాటూ... ఒరాకిల్ క్లౌడ్, ఎక్సో క్లిక్, జ్యూసీ యాడ్స్, ఏరో అడ్వెర్టైజింగ్, క్లౌడ్ ఫ్లేర్, యాడ్రో, న్యూరెలిక్, లొటామే ఇలా చాలా సంస్థలు ప్రజలు ఇంటర్నెట్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారో నిఘా పెడుతున్నాయి.

  22,484 పోర్న్ వెబ్‌సైట్లు

22,484 పోర్న్ వెబ్‌సైట్లు

పెన్సిల్వేనియా యూనివర్శిటీ, కార్నెజీ మెల్లాన్ యూనివర్శిటీ, మైక్రోసాఫ్ట్ కలిసి ఓ అధ్యయనం చేపట్టాయి. వీరి రిపోర్ట్ ప్రకారం 22,484 పోర్న్ వెబ్‌సైట్లు... తమ సైట్లలోకి వచ్చే యూజర్ల డేటాను సేకరించి... థర్డ్ పార్టీ సంస్థలకూ, కంపెనీలకూ అమ్మేస్తున్నాయి. యూజర్ల డేటాను ట్రాక్ చేసేందుకు అవి వెబ్‌ఎక్స్‌రే (webxray) అనే టూల్ వాడుతున్నాయి. ఇలా సేకరిస్తున్న కోట్ల మంది డేటాను సెక్స్‌కి సంబంధించి ఉత్పత్తులు (వయాగ్రా, టాబ్లెట్లు, పిల్స్, టానిక్స్) తయారుచేస్తున్న కంపెనీలకు అమ్ముతున్నాయి. ఇక ఆ కంపెనీలు ఆ వ్యక్తులకు వేల కొద్దీ ఈమెయిళ్లు పంపి... తమ ఉత్పత్తులు కొనేలా బలవంతం చేస్తున్నాయని నివేదిక తెలిపింది.

Best Mobiles in India

English summary
Govt says porn sites blocked by Jio, Airtel, and others after 3 court orders, hints watching porn not illegal

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X