వాట్సాప్ మెసేజ్‌తో బ్యాంక్ అకౌంట్ వివరాలను దోచేస్తున్నారు

వాట్సాప్ సైబర్ నేరాలకు అడ్డాగా మారిపోతంది. ఈ యాప్ ద్వారా హ్యాకర్లు చెలరేగి పోతున్నారు. సమయానుకూలంగా అనుమానాస్పద లింక్‌లతో నకిలీ మెసేజ్‌లను సృష్టిస్తూ వాటిని విస్తృతంగా జనాల్లోకి వ్యాప్తి చేస్తున్నారు.

వాట్సాప్ మెసేజ్‌తో బ్యాంక్ అకౌంట్ వివరాలను దోచేస్తున్నారు

నకిలీ BHIM యాప్‌లతో జాగ్రత్త, ఒరిజనల్ యాప్‌ పొందాలంటే..?

ఈ మెసేజ్‌లకు కనెక్ట్ అవుతోన్న ఎవరో ఒకరి ద్వారా ఆ మెసేజ్‌లు మన అకౌంట్‌లలోకి వచ్చి చేరుతున్నాయి. ఈ మెసేజ్‌ల ఉచ్చులో ఇరుక్కుంటున్న చాలా మంది అమాయకులు భారీ మూల్యాన్నే చెల్లించుకుంటున్నారు. నోట్ల రద్దు ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో ఓ సరికొత్త స్కామ్ వాట్సాప్‌లో వెలుగు చూసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రభుత్వ సంస్థల పేర్లతో..

దేశంలో ప్రముఖ ప్రభుత్వ సంస్థలైన నేషనల్ డెఫెన్స్ అకాడమీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజేన్సీ పేర్లతో హానికరమైన మెసేజ్ లింక్‌ను తయారు చేసిన హ్యాకర్లు Excel, Word, PDF ఫార్మాట్‌లలో ఆ లింక్‌ను వాట్సాప్‌లో సర్క్యులేట్ చేస్తున్నారు.

ప్రముఖంగా వారిని టార్గెట్ చేసారు..

సడెన్‌గా డెడ్ అయిన కంప్యూటర్‌ను క్షణాల్లో రిపేర్ చేయటం ఎలా?

ప్రముఖంగా డిఫెన్స్, పారామిలటరీ ఇంకా పోలీస్ ఫోర్స్ గ్రూపులను టార్గెట్ చేస్తూ ఈ నకిలీ మెసేజ్‌ను హ్యాకర్లు రూపొదించి ఉండొచ్చని ఓ ప్రముఖ మీడియా చెప్పుకొచ్చింది. సాధారణంగా దేశభద్రతకు సంబంధించిన అంశాల పలు చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని యూజర్ల ఓపెన్ చేసే విధంగా హ్యాకర్లు malicious మెసేజ్‌లను సృష్టించినట్లు తెలుస్తోంది.

ఫైల్స్ పై క్లిక్ చేయటం ద్వారా..

హ్యాకర్లు పంపిన  ఫైల్స్ పై క్లిక్ చేయటం ద్వారా బ్యాంక్ అకౌంట్స్ సహా ఫోన్‌లోని ముఖ్యమైన సమాచారం మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోక తప్పదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి నకిలీ మెసేజ్‌లను నమ్మరాదని వారు కోరుతున్నారు.

నకిలీ వాట్సాప్ అకౌంట్స్

మీ ఆధార్ బయోమెట్రిక్ వివరాలు ఇతరులు పొందకుండా ఉండాలంటే..?

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో నకిలీ అకౌంట్‌లను క్రియేట్ చేయటం చాలా సులువు. మోసపూరిత ఉద్దేశ్యంతో రూపొందించబడే ఈ అకౌంట్‌లకు దూరంగా ఉండటం చాలా మంచిది. నకిలీ వాట్సాప్ అకౌంట్‌లను గుర్తించే 5 సులువైన మార్గాలను ఇప్పుడు చూద్దాం..

Spoof నెంబర్లు ఆధారంగా

ఇటీవల కాలంలో Spoof నెంబర్లు ఆధారంగా నకిలీ వాట్సాప్ అకౌంట్లు పుట్టుకొస్తున్నాయి. సాధారణ మొబైల్ నెంబర్లతో పోలిస్తే స్పూఫ్ నెంబర్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇటువంటి గుర్తు తెలియని నెంబర్ల నుంచి మీకు సడెన్గా మెసేజ్ వచ్చినట్లయితే, అది నకిలీ వాట్సాప్ అకౌంట్ నుంచి వచ్చిన మెసేజ్‌గా భావించండి.

+1 నెంబర్‌తో వచ్చే ..

+1 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను కూడా నకిలీ వాట్సాప్ మెసెజ్ లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇటువంటి ఫేక్ నెంబర్స్ ఎక్కువుగా voxox app ద్వారా క్రియేట్ చేయబడతాయి. కాబట్టి, +1 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను ఏ మాత్రం విశ్వసించకండి.

+44 నెంబర్‌తో వచ్చే..

+44 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను కూడా నకిలీవిగానే పరిగణించాల్సి ఉంటుంది. Fw calls అనే U.K బేసిడ్ వెబ్‌సైట్ ద్వారా ఈ +44 వాట్సాప్ నెంబర్స్ జనరేట్ అవుతుంటాయి.

ప్రొఫైల్ ఫోటో స్థానంలో...

ఏదైనా వాట్సాప్ అకౌంట్ ప్రొఫైల్ ఫోటో స్థానంలో కార్టూన్ బొమ్మగాని, మరేదైనా విభన్నమైన ఆకారం గాని లేకంటే ఏ విధమైన ఫోటో లేకుండా, స్టేటస్ స్థానంలో 'Hey there! I'm using WhatsApp' అని ఉన్నట్లయితే అది దాదాపుగా నకిలీ అకౌంటే అవుతుంది. కాబట్టి ఇటువంటి వాట్సాప్ అకౌంట్స్‌ను నకిలీవిగానే పరిగణించాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఫేక్ వాట్సాప్ అకౌంట్ లను గుర్తించటం చాలా కష్టతరమవుతుంది. కాబట్టి గుర్తు తెలియని వాట్సాప్ అకౌంట్ నెంబర్ తో చాట్ చేసే ముందు ఒకటికి 10 సార్లు గర్తుంచుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hackers Can Now Steal Your Banking Login Using WhatsApp. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot