మొబైల్ యాప్ సహాయంతో 67 మొబైల్స్ రికవర్ చేసిన HYD పోలీసులు
ఇండియాలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కొత్త కొత్త టెక్నాలజీల ఉపయోగాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వ రంగాలలో కూడా మొబైల్ యాప్ యొక్క టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంది. ఇటువంటి సంఘటన హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ నగరంలో మొబైల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున వాటిని కనిపెట్టడానికి Hawk Eye అనే యాప్ ను పోలీసులు వినియోగించారు.

Hawk Eye (హాక్ ఐ) అనే మొబైల్ అప్లికేషన్ ను 2015 లో ప్రారంభించారు. ఈ అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసులకు మరియు ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధం మరింత మెరుగుపరచడమే. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఈ మొబైల్ అప్లికేషన్ ను ఉపయోగించి 67 స్మార్ట్ ఫోన్లను రికవర్ చేసుకున్నారు. వీటి యొక్క మొత్తం విలువ సుమారు 6 లక్షల రూపాయలు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ మాట్లాడుతూ హాక్ ఐ అప్లికేషన్ ను సుమారు 8,96,000 మంది ప్రజలు దరఖాస్తు చేసుకొని ఉపయోగిస్తున్నారు అని తెలిపారు. హాక్ ఐ అప్లికేషన్ ను రిజిస్టర్ చేసుకున్న యూజర్లు తమ మొబైల్ ఫోన్ను పోగుట్టుకున్న వెంటనే పోలీసులకు నివేదించడానికి వీలు కల్పిస్తుంది. ఫిర్యాదుల ఆధారంగా పోలీసు కమిషనర్ కార్యాలయంలోని ఐటి కోర్ బృందం వారి IMEI నంబర్లను ఉపయోగించి కోల్పోయిన మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేస్తుంది అని పోలీస్ కమిషనర్ చెప్పారు.

ఈ ప్రయత్నంలో భాగంగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సహాయంతో సుమారు 6,00,000 విలువైన 67 మొబైల్ ఫోన్‌లను తిరిగి రికవర్ చేయడంలో పోలీస్ ఐటీ బృందం విజయవంతమైందని పోలీసు కమిషనర్ తెలిపారు.

ఇప్పుడున్న సమయంలో ఎవరైనా పాత (సెకండ్ హ్యాండ్) మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూవుంటే కనుక మొదటగా ఆ ఫోన్ యొక్క IMEI నంబర్లను హాక్ ఐ యాప్ లో క్రాస్ చెక్ చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. ఒక వేల ఆ యాప్ లో IMEI నెంబర్ ఉంటే కనుక అది దొంగలించబడింది అని నిర్దారణ చేసుకోండి. అలాగే కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తున్న వారు ముందు జాగ్రత్త కోసం IMEI నెంబర్ ను గుర్తుంచుకోవడం చాలా అవసరం అని తెలిపారు.


Click it and Unblock the Notifications