Home
Apps

అటువంటి వాట్సాప్ మెసేజెస్‌తో జాగ్రత్త

ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని ఆన్‌లైన్ టీజింగ్ వణికిస్తోంది. ఈ విష సంస్కృతి భారిన పడుతోన్న చాలా మంది యువత దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

By Bommu Sivanjaneyulu

ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని ఆన్‌లైన్ టీజింగ్ వణికిస్తోంది. ఈ విష సంస్కృతి భారిన పడుతోన్న చాలా మంది యువత దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ అకౌంట్ల ప్రైవసీ విషయంలో నిర్లక్ష్యం వహించటం కారణంగానే ఈ విషపోకడ పెరిగిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ వేధింపులను కఠినమైన నేరంగా ప్రభుత్వాలు పరిగణిస్తున్నప్పటికి నెటిజనుల్లో ఈ అంశం పట్ల సరైన అవగాహన లేక స్టాకర్స్ చేతిలో కీలుబొమ్మల్లా బాధితులు మారిపోతున్నారు.

వేధింపులతో పాటు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్..

వేధింపులతో పాటు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్..

స్టాకర్స్ నుంచి వస్తోన్న వేధింపులతో పాటు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్ బాధితులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ స్టాకర్స్ అనేవాళ్లు ముందుగానే తాము ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం టార్గెటెడ్ వ్యక్తులతో మాట్లాడుతుంటారు. వీళ్లు మనకు తెలియకుండా సోషల్ మీడియా వెబ్‌సైట్స్ నుంచి మన సమచారాన్ని సేకరించి వెంటాడుతుంటారు.

 

 

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినప్పటికి...

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినప్పటికి...

ఒకవేళ మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినప్పటికి మీ లొకేషన్‌ను వీరు తెలుసుకోగలుగుతారు. వాట్సాప్‌లో మీ నెంబర్‌కు ఇమేజ్ లేదా జిఫ్ ఫైల్‌ను సెండ్ చేయటం ద్వారా వారికి మీ లొకేషన్ తెలిసిపోతుంది. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం..

మల్టీ మీడియా ఫైల్స్ ముసుగులో..

మల్టీ మీడియా ఫైల్స్ ముసుగులో..

గుర్తుతెలియని వాట్సాప్ నెంబర్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినపుడు ఆ మెసేజ్‌లో ఏముందా అని చూస్తుంటాం. ఇటువంటి మెసేజెస్‌లో పొందుపరిచే లింక్స్ పై క్లిక్ చేయటం ద్వారా మనం ఉన్న లొకేషన్ అవతలి వ్యక్తికి తెలిసిపోతుంది. ఈ మాస్కుడ్ లింక్‌లను మల్టీ మీడియా ఫైల్స్ ముసుగులో స్టాకర్స్ క్రియేట్ చేస్తుంటారు. చాలా నమ్మకంగా కనిపించే ఈ లింక్‌ను ఐపీ లాగర్ క్లయింట్ ఆధారంగా స్టాకర్స్ అభివృద్ధి చేస్తారు.

ఐపీ ట్రాకర్ సర్వీస్ ద్వారా..

ఐపీ ట్రాకర్ సర్వీస్ ద్వారా..

ఈ విధంగా క్రియేట్ చేయబడిన లింక్స్ పై క్లిక్ చేసిన వెంటనే మీ లొకేషన్ వివరాలు ఐపీ ట్రాకర్ సర్వీస్ ద్వారా అవతలి వ్యక్తికి తెలిసిపోతాయి. ఈ ఐపీ ట్రాకర్స్ అనేవి మీరు ఉంటోన్న రాష్ట్రం, జిల్లా ఇంకా సమీపంలోని టెలికం టవర్ వివరాలను అవతలి వ్యక్తికి తెలియజేస్తాయి. కాబట్టి గుర్తు తెలియని వాట్సాప్ నెంబర్స్ నుంచి వచ్చే లింక్స్ పై క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు వాటి గురించి ఆలోచించటం మంచిది. Getlinkinfo.com వంటి సర్వీసులను ఉపయోగించుకోవటం ద్వారా మీ క్లిక్ చేసే లింక్ సరైందో కాదో తెలిసిపోతుంది.

 

 

Best Mobiles in India

English summary
Here's how a stalker can track you through an image sent over WhatsApp.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X