Gmail కొత్త ఫీచర్, పంపించిన మెయిల్ ను అవతలి వ్యక్తి Inbox లో కూడా డిలీట్ చేయొచ్చు
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం జిమెయిల్ యాప్ లో సరికొత్త ఫీచర్ ను విడుదల చేసింది.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం జిమెయిల్ యాప్ లో సరికొత్త ఫీచర్ ను విడుదల చేసింది. ఈ ఫీచర్ గొప్పతనం ఏంటంటే ఇందులో మీరు పంపిన మెయిల్ ను undo చేసుకోవచ్చు అది ఆటోమేటిక్ గా recepient ఇన్ బాక్స్ నుంచి తీసేసాయబడుతుంది .అయితే ఈ ఆప్షన్ ఇప్పటి వరకు వెబ్ వెర్షన్ కు మాత్రమే ఉండేది. తాజా రిపోర్ట్ ప్రకారం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది.ఈ శీర్షిక లో భాగంగా gmail లో అప్ డేట్ అయినా సరికొత్త ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో మీకు తెలుపుతున్నాము.

ఆండ్రాయిడ్ మొబైల్స్ లో gmail యాప్ ను ఓపెన్ చేయండి....
మొదటగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉన్న gmail యాప్ ను ఓపెన్ చేయండి. మెయిన్ స్క్రీన్ లో దిగువున send బటన్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఒక్కసారి send బటన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఒక బ్లాక్ బార్ కనిపిస్తుంది.ఎడమవైపున తెల్లరంగు రంగులో 'sending ' అనే ఆప్షన్ కలిగి ఉంటుంది మరియు కుడివైపు పసుపు రంగులో 'cancel ' అనే ఆప్షన్ కలిగి ఉంటుంది.మీరు పంపించిన ఇమెయిల్ లో ఏదైనా తప్పులు ఉంటె చింతించాల్సిన అవసరం లేదు .మీరు cancel అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఆ మెయిల్ Undo అయిపోతుంది. ఈ undo ఆప్షన్ ద్వారా మీ మెయిల్ పంపిన రిసీవర్ ఇన్ బాక్స్ నుంచి మెయిల్ డిలీట్ అయిపోతుంది.

యూజర్లకు 7 నుంచి 8 సెకండ్ల వరకు సమయం ఉంటుంది.....
యూజర్ల తొలగించిన మెయిల్ ను పొందడానికి Undo బటన్ ను క్లిక్ చేయడానికి 7 నుంచి 8 సెకండ్ల వరకు సమయం ఉంటుంది.ఒక్కసారి undo బటన్ క్లిక్ చేయగానే పంపిన మెయిల్ compose స్క్రీన్ పై వస్తుంది మీరు వెంటనే కావాల్సిన చేంజెస్ చేసుకొని తిరిగి మెయిల్ పంపవచ్చు.

7 రోజుల క్రితం Gmail లో Confidential mode అనే ఫీచర్ లాంచ్ చేసిన గూగుల్....
iOS మరియు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ Gmail లో Confidential mode అనే ఫీచర్ ను 7 రోజుల క్రితం లాంచ్ చేసింది.

Confidential Mode....
దీని ప్రకారం మీరు ఎవరికైనా మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ ను వారు మరొకరికి ఫార్వార్డ్ చేయకుండా చేసుకోవచ్చు.అంతేకాదు, మీరు పంపిన మెయిల్ ను కాపీ చేయడం కానీ, ప్రింట్ తీసుకునే అవకాశం కానీ ఉండదు.

మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవాలంటే....
అలాగే, వచ్చిన మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవాలంటే పాస్ కోడ్ అవసరం. ఈ పాస్ కోడ్ ను టెక్ట్స్ సందేశం ద్వారా గూగుల్ పంపిస్తుంది. అంతేకాదు, పంపిన మెయిల్స్ కు ఎక్స్ పయిరీ తేదీ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే నిర్ణీత సమయం తర్వాత అవి డిలీట్ అయిపోతాయి.


Click it and Unblock the Notifications








