గూగుల్ పే ద్వారా వేయి రూపాయలు గెలుచుకోవడం ఎలా ?

By Gizbot Bureau
|

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన గూగుల్ పే కస్టమర్లకు వేయి రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. టీవీ లేదా యూట్యూబ్‌లో ప్లే అయ్యే గూగుల్ పే యాడ్‌ను ఫోన్లలోని గూగుల్ పే యాప్‌లో ఉండే ప్రమోషన్స్ సెక్షన్‌లోని ఆన్-ఎయిర్ ఆప్షన్ ద్వారా వింటే యూజర్లకు ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది. అయితే ఇందులో సదరు యాడ్‌ను కనీసం 20 సెకన్ల పాటు యాప్ ద్వారా వినాల్సి ఉంటుంది. దీంతో గూగుల్ పే ఆ యాడ్‌ను గుర్తించి యూజర్‌కు స్క్రాచ్ కార్డును ఇస్తుంది. దాంతో యూజర్లు రూ.1వేయి వరకు గెలుచుకోవచ్చు. ఇక ఈ ఆఫర్ ఇప్పటికే గూగుల్ పే వినియోగదారులకు అందుబాటులో ఉండగా డిసెంబర్ 2 వరకు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని గూగుల్ పే తెలిపింది. అయితే యూజ‌ర్ల‌కు ఆఫ‌ర్ క‌నిపించ‌క‌పోతే గూగుల్ పేకు గాను లొకేష‌న్ హిస్ట‌రీని ఆన్ చేయాల్సి ఉంటుంది. అనంత‌రం ప్ర‌మోష‌న్స్ సెక్ష‌న్‌లో ఆడియో రివార్డ్స్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. అందులో ఆన్ ఎయిర్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌డం ద్వారా ఆ గూగుల్ పే ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు.

Google Pay ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?
 

గూగుల్ పే సర్వీసును వినియోగించుకోవాలనుకుంటోన్న వారు ముందుగా ప్లే స్టోర్‌లోకి వెళ్లి Google Pay యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత పేమెంట్ పద్ధతిని యాడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేసేందుకు యాప్‌ను ఓపెన్ చేసి మెయిన్ స్ర్కీన్ పై కనిపించే మెనూ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

My Cards

మెనూలోని "My Cards" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని.. మెనూలోకి ప్రవేశించిన తరువాత మీ ఫైనాన్షియల్ డిటెయిల్స్‌ను యాడ్ చేయాలనుకుంటోన్న గూగుల్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత మెనూలోని "My Cards" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని "+" సింబల్ పై టాప్ ఇవ్వాలి. సింబల్ సెలక్ట్ అయిన తరువాత మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌లను పేమెంట్ సర్వీసులో యాడ్ చేసుకోవల్సి ఉంటుంది.

వెరిఫికేషన్ సమయంలో...

కార్డ్ సమాచారం యాడ్ అయిన తరువాత payment methodను వెరిఫై చేసుకోవల్సి ఉంటుంది. వెరిఫికేషన్ సమయంలో మీ ఫోన్ లేదా కంప్యూటర్‌కు ఓ కోడ్ అనేది అందుతుంది. ఆన్ స్ర్కీన్ సూచనలను ఫాలో అవుతూ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయవల్సి ఉంటుంది. వెరిఫికేషన ప్రాసెస్‌ కంప్లీట్ చేయటానికి కొంత మేర ఛార్జ్‌ను గూగుల్ మీ నుంచి వసూలు చేస్తుంది.

గూగుల్ పే ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నట్లయితే..? 
 

మీ కార్ట్‌లో ప్రొడక్ట్స్‌ను యాడ్ చేసుకున్న తరువాత పేమెంట్ పేజీలోకి వెళ్లి "Buy with GPay" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఆన్‌స్ర్కీన్ సూచనలను ఫాలో అవుతూ చెల్లింపును పూర్తి చేయండి.రిటైల్ స్టోర్‌లో షాపింగ్ చేస్తునపుడు గూగుల్ పే ద్వారా బిల్లు చెల్లించాల్సి వచ్చినట్లయితే ముందుగా మీ సమీపంలో కనిపిస్తోన్న జీపే లోగో లేదా ఎన్ఎఫ్‌సీ సింబల్‌తో కనిపిస్తోన్న NFC టెర్మినల్ వద్దకు వెళ్లండి. ఆ తరువాత ఫోన్‌ను అన్‌లాక్ చేసి టెర్మినల్‌కు దగ్గరగా ఉంచండి. ఆటోమెటిక్‌గా గూగుల్ పే లాంచ్ అవుతుంది. ఆ తరువాత ఆన్ స్ర్కీన్ సూచనలను ఫాలో అవుతూ చెల్లింపు ప్రాసెస్‌ను పూర్తి చేయండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here’s how you can win up to Rs 1,000 using this Google app

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X