క్రికెట్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్తను అందించిన జియో

|

దేశీయ టెలికాం రంగంలోకి సునామి ఎంట్రీ ఇచ్చిన జియో దిగ్గజాలకు చెమటలు పట్టిస్తూ పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. Airtel, Idea, vodafone, Bsnlలకు సవాల్ విసురుతూ భారీ ఆఫర్లతో టారిప్ లను హోరెత్తిస్తూ పోతున్న జియో ఇప్పుడు మళ్లీ అదే ఊపుతో క్రికెట్ అభిమానులను అలరించడానికి రెడీ అయింది. జియో లైవ్‌ టీవీ యాప్‌లో మార్పులు చేస్తూ.. ప్రస్తుత మ్యాచ్‌ చూసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. ఇంటరాక్టివ్‌ టీవీ సదుపాయంలో భాగంగా జియో టీవీ యాప్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లను ఏవైనా అయిదు కెమెరా కోణాల్లో వినియోగదారులు చూసే అవకాశం ఉందని రిలయన్స్‌ జియో ప్రకటించింది.

 

షియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్, మార్చి 14న విడుదలషియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్, మార్చి 14న విడుదల

ఐదు కెమెరా యాంగిల్స్‌లో..

ఐదు కెమెరా యాంగిల్స్‌లో..

జియో ప్రవేశపెట్టిన ఈ పరిజ్ఞానం ద్వారా క్రికెట్‌ మ్యాచ్‌ను ఐదు కెమెరా యాంగిల్స్‌లో వీక్షించవచ్చు. అంతే కాకుండా ఆడియోను గ్రౌండ్‌ మధ్య వికెట్ల వద్ద ఉన్న మైక్‌ నుంచి వినొచ్చు. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న నిదాహాస్‌ ట్రోఫీ మ్యాచ్‌లను ఈ రకంగా చూడొచ్చు.

మనకు కావాల్సిన భాషలో..

మనకు కావాల్సిన భాషలో..

మనకు కావాల్సిన భాషలో (ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ) కామెంట్రీని వినొచ్చు. అదే విధంగా వేర్వేరు మైక్‌లను సైతం వినే సదుపాయం ఉంది. స్టంప్‌, స్టేడియం మైక్‌ల్లో ఏదో ఒకదాన్ని వినియోగదార్లు ఎంపిక చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్‌, తమిళ్‌, తెలుగు, కన్నడ భాషల్లో వ్యాఖ్యానాన్ని సైతం వినియోగదార్లు పొందే సౌలభ్యం ఉంది.

క్యాచ్‌ అప్‌ ద్వారా మళ్లీ వెనక్కి..
 

క్యాచ్‌ అప్‌ ద్వారా మళ్లీ వెనక్కి..

మ్యాచ్‌ స్కోర్‌, బంతులు, రన్‌రేట్‌, వంటి గణంకాలను మనకు నచ్చినప్పుడు, కావాల్సినప్పుడు ఒక్క క్లిక్‌తో చూసుకోవచ్చు. మ్యాచ్‌లో ఎదైన బంతిగాని, వికెట్‌ గాని, సిక్స్‌గాని మిస్‌ అయితే క్యాచ్‌ అప్‌ ద్వారా మళ్లీ వెనక్కి వెళ్లి వీక్షించవచ్చు. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో కొత్త జియో లైవ్‌ టీవీ యాప్‌ అందుబాటులోకి రానుంది.

రాబోయే రోజుల్లో ..

రాబోయే రోజుల్లో ..

కాగా ఈ సిరీస్‌కు వ్యాఖ్యాతలుగా జహీర్‌ ఖాన్‌, ఆశిష్‌ నెహ్రా, గౌరవ్‌ కపూర్‌లు వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్చువల్‌ రియాల్టీ వంటి కొత్త టెక్నాలజీలను సైతం యాప్‌లోకి తీసుకొస్తామని జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ పేర్కొన్నారు.

ప్రత్యేకమైన డిజిటల్ హక్కులను ..

ప్రత్యేకమైన డిజిటల్ హక్కులను ..

ఇటివల జియో ఉత్తమ మొబైల్ వీడియో కంటెంట్ ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ మొబైల్ (గ్లిమో) అవార్డును గెల్చుకుంది. మార్చి నుంచి కొలంబోలో జరిగే టీ20 క్రికెట్ సిరీస్ నిదహస్ ట్రోఫీకి ప్రత్యేకమైన డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌..

ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌..

మ్యాచ్‌ వీక్షణలో కొత్త అనుభూతిని పొందటానికి జియో టీవీ యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది. లేని వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Best Mobiles in India

English summary
Here's good news for cricket buffs using Reliance JioTV network More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X