గూగుల్ క్రోమ్ లో మీరు అనుకున్నభాషలో సెర్చ్ చేయడం ఎలా ?
టెక్ దిగ్గజం గూగుల్ భారతీయులకు మరింతగా చేరువయ్యేందుకు మరో అడుగు ముందుకేసింది. తన గూగుల్ సెర్చ్ రిజల్ట్ ఆప్సన్ లో అన్ని భాషలను సపోర్ట్ చేసే విధంగా క్రోమ్ ను తీర్చి దిద్దింది. యూజర్లు క్రోమ్ బ్రౌజర్ ఢీప
టెక్ దిగ్గజం గూగుల్ భారతీయులకు మరింతగా చేరువయ్యేందుకు మరో అడుగు ముందుకేసింది. తన గూగుల్ సెర్చ్ రిజల్ట్ ఆప్సన్ లో అన్ని భాషలను సపోర్ట్ చేసే విధంగా క్రోమ్ ను తీర్చి దిద్దింది. యూజర్లు క్రోమ్ బ్రౌజర్ ఢీపాల్ట్ చేసుకునే విధంగా దానిని అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా ఇప్పటికే గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ అన్ని భాషను సపోర్ట్ చేస్తోంది. ఇప్పుడు ఈ వరసలో క్రోమ్ కూడా చేరింది. ఈ శీర్షికలో భాగంగా క్రోమ్ ఎలా పనిచేయాలి ఎలా అప్ డేట్ చేసుకోవాలో ఓ సారి చూద్దాం.


స్టెప్ 1
మీ పీసీలో కాని మాక్ లో కాని గూగుల్ క్రోమ్ ని స్టార్ట్ చేయండి

స్టెప్ 2
అందులో మెనూ బటన్ లోకి వెళ్లండి. టాప్ రైట్ కార్నర్ లో అది ఉంటుంది. మూడు డాట్లు మీకు కనిపిస్తాయి. దానిని మళ్లీ రీ ఫ్రెష్ చేయండి.

స్టెప్ 3
దానిని క్లిక్ చేస్తే కింద సెట్టింగ్ మెనూ కనిపిస్తుంది.దానిని స్క్రోల్ చేస్తే అడ్వాన్స్ ఆప్సన్ కనిపిస్తుంది. passwords, auto fill, language వంటివి అందులో కనిపిస్తాయి.

స్టెప్ 4
అందులో మీకు నచ్చిన లాంగ్వేజ్ ని సెలక్ట్ చేసుకోవచ్చు. అందులో యాడ్ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు ఏ లాంగ్వేజ్ లో అయితే సెర్చ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది.

స్టెప్ 5
మీరు అనేక భాషలను సెలక్ట్ చేసుకున్నట్లయితే ఏ భాషను ఢీఫాల్ట్ గా పెట్టాలనుకుంటున్నారో దాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రీ స్టార్ బటన్ ప్రెస్ చేయండి. మీరు అనుకున్న భాషలో మీరు సెర్చ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








