డేటా అవసరం లేకుండానే ఛాటింగ్, పేమెంట్స్ చేసుకోవచ్చు

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్లు ఉంటేనే సరిపోతుందా..దాన్ని ఉపయోగించాలంటే డేటా కావాలి కదా..

By Hazarath
|

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్లు ఉంటేనే సరిపోతుందా..దాన్ని ఉపయోగించాలంటే డేటా కావాలి కదా..డేటా లేకుండా ఛాటింగ్, పేమెంట్ లాంటి పనులు అసలు చేయలేము..అయితే ఇప్పుడు మీకు ఆ బెంగ తీరుస్తామంటూ మెసేజింగ్ సంస్థ హైక్ చెబుతోంది. డేటా అవసరం లేకుండానే మీరు ఛాటింగ్, పేమెంట్స్ లాంటి వాటితో పాటు బుకింగ్ చెల్లింపులు లాంటి వాటిని ఈజిగా చేసుకోవచ్చని చెబుతోంది. మరి అదెలా సాధ్యమో తెలుసుకుందాం.

ఊహించని వ్యాపారలోకి అనిల్ అంబాని, ఆర్‌కామ్ పరుగులే ఇక..ఊహించని వ్యాపారలోకి అనిల్ అంబాని, ఆర్‌కామ్ పరుగులే ఇక..

టోటల్‌' పేరిట కొత్త సర్వీసును

టోటల్‌' పేరిట కొత్త సర్వీసును

మొబైల్‌ డేటా లేకపోయినా చాటింగ్, వార్తలు, రైలు టికెట్ల బుకింగ్, చెల్లింపులు వంటి సదుపాయాలు పొందే విధంగా మెసేజింగ్‌ సేవల సంస్థ హైక్‌ తాజాగా 'టోటల్‌' పేరిట కొత్త సర్వీసును ఆవిష్కరించింది. యూఎస్‌ఎస్‌డీ టెక్నాలజీపై ఇది పనిచేస్తుందని హైక్‌ మెసెంజర్‌ సీఈవో కవిన్‌ మిట్టల్‌ తెలిపారు.

ఇంటెక్స్, కార్బన్‌ సంస్థలతో ఒప్పందం..

ఇంటెక్స్, కార్బన్‌ సంస్థలతో ఒప్పందం..

చౌక ఫోన్ల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో దీన్ని పొందుపర్చేలా ఇంటెక్స్, కార్బన్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. మెసేజింగ్, న్యూస్, స్పోర్ట్స్‌ స్కోర్లు మొదలైనవన్నీ ఈ సర్వీసుతో పొందవచ్చని..

ఫోటోలకు డేటా అవసరం

ఫోటోలకు డేటా అవసరం

అయితే, మీరు అన్ని పనులు చేసేందుకు ఇందులో అవకాశం లేదు. మీరు మీకు నచ్చిన ఫోటోలను మీ మిత్రులకు పంపాలనుకుంటే డేటా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందేనని హైక్ మెసేంజర్ సీఈఓ చెబుతున్నారు.

దిగ్గజాలతో ఒప్పందం

దిగ్గజాలతో ఒప్పందం

ఇందుకోసం 4జీ స్పీడ్‌తో 20 ఎంబీ డేటా ప్యాకేజీలను రూ. 1 నుంచి అందించేలా అటు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఎయిర్‌సెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నామని, రిలయన్స్‌ జియో తదితర సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలియజేశారు.

టోటల్‌ సర్వీసుల కోసం సైన్‌ అప్‌ చేయగానే

టోటల్‌ సర్వీసుల కోసం సైన్‌ అప్‌ చేయగానే

ఎంపిక చేసిన ఇంటెక్స్, కార్బన్‌ ఫోన్లు కొనుగోలు చేసిన వారు టోటల్‌ సర్వీసుల కోసం సైన్‌ అప్‌ చేయగానే.. వారి హైక్‌ వాలెట్‌లో రూ.200 జమవుతాయని మిట్టల్‌ తెలిపారు. కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక డేటా ప్లాన్ల కొనుగోలుకు, ఇతరత్రా ఎవరికైనా పంపేందుకు కూడా ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.

 

వీడియో కాలింగ్‌ ఫీచర్‌

వీడియో కాలింగ్‌ ఫీచర్‌

కాగా హైక్‌ మెసేంజర్‌ యాప్‌ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన విషయం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా కాల్‌ని ఆన్సర్‌ చేసే ముందు ముందు అవతలి వ్యక్తి లైవ్‌ వీడియో ప్రీవ్యూను కూడా చూసే వెసులుబాటు ఉంది.

డిజిటల్‌ వాలెట్‌ సర్వీసులు..

డిజిటల్‌ వాలెట్‌ సర్వీసులు..

దీంతో పాటు దేశీ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ ‘హైక్‌' తాజాగా తన యూజర్లకు మెరుగైన డిజిటల్‌ వాలెట్‌ సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైక్‌ యూజర్లు ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌కు సంబంధించిన మర్చంట్, యుటిలిటీ పేమెంట్‌ సర్వీసులు పొందొచ్చు.

ఎక్కువ మంది భారతీయులను..

ఎక్కువ మంది భారతీయులను..

ఎక్కువ మంది భారతీయులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి, వారికి సులభ లావాదేవీల సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్‌ తమకు మద్దతునిస్తోందని హైక్‌ మెసేంజర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పతీక్‌ షా తెలిపారు. అత్యుత్తమ డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలు అందించేందుకు హైక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సీవోవో ఎ.గణేశ్‌ పేర్కొన్నారు.

 2012లో ప్రారంభమైన హైక్‌కు..

2012లో ప్రారంభమైన హైక్‌కు..

కాగా 2012లో ప్రారంభమైన హైక్‌కు ప్రస్తుతం 10 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. తన వాలెట్‌ సర్వీసుల్లో 30 శాతానికిపైగా నెలవారీ వృద్ధి నమోదవుతోంది. భారతీ ఎంటర్‌ప్రైజెస్, సాఫ్ట్‌బ్యాంక్‌ జాయింట్‌ వెంచర్‌ ఇది.

 

 

Best Mobiles in India

English summary
Hike brings payments, news, and messaging to basic Android phones without mobile data More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X