హైక్ మెసెంజర్‌లోకి ‘సోషల్ ఫీచర్స్’

By: BOMMU SIVANJANEYULU

సోషల్ మెసేజింగ్ విభాగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోన్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ హైక్ మెసెంజర్ సరికొత్త సోషల్ ఫీచర్లను అనౌన్స్ చేసింది. చాట్ లోపల నుంచే ఈ ఫీచర్లను సింగిల్ క్లిక్‌తో యాక్సెస్ చేసుకోవచ్చు. తాజా అప్‌డేట్ నేపథ్యంలో ఓట్, బిల్ స్ప్లిట్, చెక్ లిస్ట్స్, ఈవెంట్స్ విత్ రిమైండర్స్, తీన్ పత్తీ వంటి ఫీచర్లను గ్రూప్స్ నుంచే పొందే అవకాశాన్ని హైక్ కల్పించింది.

హైక్ మెసెంజర్‌లోకి  ‘సోషల్ ఫీచర్స్’

ఇదే సమయంలో గ్రూప్ సభ్యుల సంఖ్యను కూడా 1000 వరకు పెంచుకునే వెసలబాటును హైక్ కల్పిస్తోంది. 'ఓట్’ ఫీచర్ ద్వారా స్కూల్ లేదా కాలేజ్ ఎలక్షన్‌లను సులువుగా నిర్వహించుకోవచ్చు. ఇదే సమయంలో బిల్ స్ప్లిట్ ఫీచర్ ద్వారా బిల్లులను మిత్రులతో షేర్ చేసుకుని హైక్ వాలెట్ ద్వారా చెల్లించే వీలుంటుంది. చెక్ లిస్ట్స్ ఆప్షన్ ద్వారా ఏ ఒక్కటి మిస్ కాకుండా ఖచ్చితమైన ఆర్డర్‌లో లిస్టును ప్రిపేర్ చేసుకునే వీలుంటుంది.

మరో ఫీచర్ ఈవెంట్స్ అండ్ రిమైండర్స్ ద్వారా హైక్ యూజర్లు తమ టైమ్ టేబుల్‌ను ఖచ్చితంగా ఫాలో కావొచ్చు. కొత్త ఫీచర్ల ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ సీటీఓ విశ్వనాథ్ రామారావు స్పందిస్తూ తమ కొత్త ఫీచర్లు గ్రూప్స్ మధ్య షేరింగ్‌ను మరింత సులభతరం చేయటంతో పాటు ఆన్‌లైన్ ప్రపంచంలో మరింతగా మమేకమయ్యేందుకు తోడ్పడతాయని అన్నారు.

భారీ ఫీచర్లతో దూసుకువచ్చిన విజన్ 3 స్మార్ట్‌ఫోన్, రూ.6,999కే

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో దాదాపు 10 కోట్ల మంది హైక్ యూజర్లు తమ యాప్‌లోని హైక్ వాలెట్ ప్రొడక్ట్ ద్వారా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను ఆస్వాదించ గలుగుతున్నారు. 2012లో ప్రారంభమైన హైక్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు 2016, జనవరి నాటికి దాదాపుగా 100 మిలియన్ యూజర్లు ఉన్నారు.

Read more about:
English summary
These features will work in the group with up to 1,000 members.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot