వాట్సాప్‌కు షాకిచ్చిన Hike, అందుబాటులోకి వీడియో కాల్స్ ఆఫ్షన్

భారదదేశపు మొట్టమొదటి స్వదేశీ మెసేజింగ్ యాప్ అయిన హైక్ మెసెంజర్ వాట్సాప్‌కు పోటీగావీడియో కాలింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

|

వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే హైక్ మెసెంజర్ కూడా వీడియో కాల్స్ సపోర్ట్‌ను లాంచ్ చేసింది.

వాట్సాప్‌కు షాకిచ్చిన హైక్, అందుబాటులోకి వీడియో కాల్స్ ఆఫ్షన్

Read More : రూ.1000కే VoLTE సపోర్ట్‌ ఫోన్..?

భారదదేశపు మొట్టమొదటి స్వదేశీ మెసేజింగ్ యాప్ అయిన హైక్ మెసెంజర్ తొలి నుంచి వాట్సాప్ గట్టిపోటినిస్తోన్న విషయం తెలిసిందే. వాట్సాప్ అందిస్తోన్న వీడియో కాలింగ్ ఫీచర్ ప్రస్తుతానాకి బేటా టెస్టర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. టెస్టింగ్ స్టేజ్‌ను గత నెలలోనే దాటేసిన హైక్ వీడియో కాలింగ్ ఫీచర్ ఇప్పడు అందరికి అందుబాటులోకి ఉంది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే

ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే

హైక్ మెసెంజర్ యాప్ 2జీ నెట్ వర్క్ కండీషన్‌లలోనూ పనిచేస్తుంది. ప్రస్తుతం హైక్ మెసెంజర్ ఆఫర్ చేస్తోన్న వీడియో కాల్స్ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. iOS యూజర్లకు త్వరలోనే ఈ అప్‌డేట్ అందనుంది. ఆండ్రాయిడ్ యూజర్లు హైక్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను పొందేందుకు ఈ క్రింది సూచనలను అనుసరించాల్సి ఉంటుంది..

హైక్ వీడియో కాలింగ్ ఫీచర్ పొందాలంటే..?

హైక్ వీడియో కాలింగ్ ఫీచర్ పొందాలంటే..?

స్టెప్ 1
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్‌డేటెడ్ వర్షన్ హైక్ మెసెంజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 2
యాప్‌లోని చాట్ త్రెడ్‌ను సెలక్ట్ చేసుకుని కనెక్ట్ అవ్వాలనుకుంటున్న కాంటాక్ట్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3
టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే కాల్ బటన్ పై టాప్ ఇవ్వండి.

స్టెప్ 4
కాల్ బటన్ పై ప్రెస్ చేయగానే వీడియో లేదా వాయిస్ కాల్ అని అడుగుతుంది. వీడియో కాల్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా కాల్ వెళుతుంది.

 

లెక్కకు మిక్కిలి ఫీచర్లు

లెక్కకు మిక్కిలి ఫీచర్లు

వాట్సప్ లో చేయలేని పనులు సైతం ఈ హైక్ యాప్ ద్వారా చేయవచ్చు. మీరు ఇతరులకు కనిపించకుండా చాట్ చేసుకోవచ్చు కూడా. హైక్‌లో దాగిన అద్భుతమైన ఫీచర్స్ ఏంటో మీరే చూడండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హిడెన్ చాట్ మోడ్‌

హిడెన్ చాట్ మోడ్‌

మీ ఫోన్‌లో హైక్ ద్వారా చేసే చాట్ పై ఇతరుల కళ్ల పడకుండా ఉండేందుకు హిడెన్ చాట్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. ఇందుకోసం కాంట్టాక్ పై ఫింగర్‌తో ప్రెస్ చేసి ఉంచితే మరొక స్మాల్ విండో ఓపెన్ అయ్యి అందులో హిడెన్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసి పాస్‌వర్డ్ ఇస్తే యాక్టివేట్ అవుతుంది. ఇక ఆ కాంటాక్ట్‌తో చేసే చాట్‌ను వేరెవరూ చూడలేరు. తిరిగి అన్‌హైడ్ చేసే వరకు మీ మధ్య సంభాషణ పూర్తిగా రహస్యమే.

పాస్‌వర్డ్ ప్రొటెక్షన్

పాస్‌వర్డ్ ప్రొటెక్షన్

చాట్స్ విండో పై భాగంలోని హైక్ ఐకాన్ వద్ద టాప్ చేస్తే పాస్‌వర్డ్ సెలక్ట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. పాస్ వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏ కాంటాక్ట్ ను అయినా హిడెన్ మోడ్ లో ఉంచాలన్నా, తొలగించాలన్నా పాస్‌వర్డ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్ మర్చిపోతే రీసెట్ హిడెన్ మోడ్‌ని ఎంచుకోవడం మినహా వేరే మార్గం లేదు.

చాట్ థీమ్స్

చాట్ థీమ్స్

ఈ మెసేంజర్ యాప్‌లో మీకు రకరకాల ధీమ్స్ కనిపిస్తాయి. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్, నైట్, లవ్ ఆర్ అవేసమ్ ఇలాంటి ఎన్నో రకాల ధీమ్స్ ఉంటాయి. గ్రూప్ ఛాట్ లో కూడా ఈ ధీమ్స్ ఉపయోగించుకోవచ్చు.

హైక్ ఆఫ్‌లైన్

హైక్ ఆఫ్‌లైన్

డేటా లేకపోయినా హైక్ యాప్ ద్వారా మెస్సేజ్ పంపుకోవచ్చు. హైక్‌లో ఉన్న అత్యుత్తమ ఫీచర్లలో ఇది కూడా ఒకటి. ఇలాంటి ఫీచర్‌ను అందిస్తున్న తొలి ఇన్ స్టంట్ మెస్సేజింగ్ యాప్ కూడా ఇదే.

ఎస్ఎంఎస్ సదుపాయం..

ఎస్ఎంఎస్ సదుపాయం..

మెసేజ్ సెండ్ చేసిన నిమిషం వరకు ఆ మెస్సేజ్ డెలివరీ తీసుకోవాల్సిన యూజర్ ఆఫ్‌లైన్‌లో ఉంటే వారి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు హైక్ టెక్ట్స్ మెస్సేజ్ పంపించాలా? అని అడుగుతుంది. సెండ్ అని ఓకే చెప్తే ఎస్ఎంఎస్ వెళ్లిపోతుంది. అప్పుడు సదరు వ్యక్తి బదులు ఇవ్వాలంటే డేటా ఆన్ చేసుకుని హైక్ మెస్సెంజర్ ద్వారా చాట్ చేయాల్సి ఉంటుంది. లేదా మెస్సేజ్ ద్వారా రిప్లయ్ ఇవ్వవచ్చు.

ఉచిత మెసేజ్‌లు

ఉచిత మెసేజ్‌లు

ప్రతీ హైక్ యూజర్‌కు నెలలో 107 ఎస్ఎంఎస్‌ల వరకే ఉచితం. ఆ పరిమితి దాటిన తర్వాత సాధారణ ఎస్ఎంఎస్ చార్జీలు వర్తిస్తాయి.

హైక్ డైరెక్ట్

హైక్ డైరెక్ట్

ఈ మెసెంజర్ అప్లికేషన్‌లో  హైక్ డైరెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. దాని ద్వారా దగ్గర్లో ఉన్న వారితో ఆఫ్ లైన్ లోనూ మెస్సేజ్ చేసుకోవచ్చు. ఇది షేర్ ఇట్ ను ఉపయోగించి దగ్గర్లోని ఫోన్ కు కనెక్ట్ అవుతుంది. కేవలం 100 మీటర్ల పరిధిలోనే ఉన్న వారి ఫోన్లతోనే అనుసంధానం సాధ్యం.

హైక్ అటాచ్‌మెంట్స్

హైక్ అటాచ్‌మెంట్స్

హైక్‌లో అన్ని రకాల ఫార్మాట్ ఫైల్స్‌ను షేర్ చేసుకునే అటాచ్‌మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఒకేసారి పీడీఎఫ్, జిప్ ఫైల్స్ ను 100 ఎంబీ వరకు మీ స్నేహితులకు పంపించుకోవచ్చు.

వాయిస్ కాల్స్

వాయిస్ కాల్స్

వాయిస్ కాల్స్ ఇది కూడా ఓ ప్రముఖమైన ఫీచర్ దీంతో పాటు గ్రూప్ ఫీచర్లో 500 మంది వరకు ఒకే గ్రూప్ కింద ఉండవచ్చు. వాట్సప్ లో అయితే ఇది 250గానే ఉంది. ఈ విషయంలో వాట్సప్ ను మించిన ప్రపంచ స్థాయి ఫీచర్లు హైక్ లోనే ఎక్కువని నిపుణుల అభిప్రాయం.

స్టిక్కర్స్

స్టిక్కర్స్

హైక్ లో మంచి మంచి స్టిక్కర్ల కలెక్షన్ ఉంది. హావ భావాలను చక్కని గుర్తుల రూపంలో తెలియచేయడానికి ఇవి ఉపకరిస్తాయి. అంటే వాట్సాప్ లో ఎమోటికన్స్ లేవని కాదు. కానీ స్టిక్కర్లు హైక్ లో మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన మెస్సేజింగ్ యాప్స్ తో పోలిస్తే హైక్ లో చాలా ప్రత్యేకమైనవి ఉన్నాయని యూజర్లు చెబుతున్నారు.

హైక్ పిన్స్

హైక్ పిన్స్

ఇది మీకు ముఖ్యమైన స్నేహితుల సమాచారాన్ని ఎల్లప్పుడూ మీకు చూపిస్తూ ఉంటుంది. గ్రూప్ చాట్ లో మీకు ముఖ్యమైన వారి మెసేజ్ లు మాత్రమే చదివే వీలు కూడా ఉంటుంది.

అప్‌డేటెడ్ వర్షన్

అప్‌డేటెడ్ వర్షన్

హైక్ ప్రతీ నెలా అప్ డేటెడ్ వర్షన్‌తో ముందుకు వస్తోంది. చాట్ హిస్టరీని సింపుల్‌గా బ్యాకప్ తీసుకోవచ్చు. ఒకవేళ మర్చిపోయినా ఇబ్బందేమీ లేదు. ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో చాట్స్ బ్యాకప్‌లో స్టోర్ అవుతాయి. వాటిని రిస్టోర్ చేసుకోవచ్చు.హైక్ అప్‌డేషన్ సమయంలోనూ చాట్ బ్యాకప్ చేయాలా అని అడుగుతుంది. ఒకే చేస్తే సేవ్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Hike Messenger Now Supports Video Calling: Gives Competition to WhatsApp. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X