డౌన్‌లోడ్‌లలో రికార్డు సృష్టించిన హాట్‌స్టార్

|

హాట్‌స్టార్ ఇప్పుడు తన 'ఇండియా వాచ్ రిపోర్ట్ 2019' ను వెల్లడించారు. సంస్థ ప్రకటించిన ముఖ్యాంశాలలో ఇప్పటివరకు హాట్‌స్టార్ 400 మిలియన్ డౌన్‌లోడ్‌ల మైలురాయిను దాటినట్లు ప్రకటించింది. ఇది గత సంవత్సరం 2018 తో పోలిస్తే హాట్‌స్టార్ యొక్క ఇన్‌స్టాల్‌ల సంఖ్య రెండు రెట్ల పెరుగుదలను పొందింది.

IPL
 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2019 సందర్భంగా హాట్‌స్టార్ యొక్క డౌన్‌లోడ్‌ల సంఖ్య 300 మిలియన్లను దాటినట్లు ఒక నివేదికను ముందే వెల్లడించింది. ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసిసి ప్రపంచ కప్ సెమీఫైనల్ల సందర్భంగా ఈ డౌన్‌లోడ్‌ల సంఖ్య పెరిగి 25.3 మిలియన్ల లైవ్ ప్రేక్షకులను నమోదు చేసింది. మొత్తం వినియోగం పరంగా చూస్తే ఇండియాలో 2018 తో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి ఉంది.

అన్‌లిమిటెడ్ కాల్‌లను మళ్ళి మొదలు పెట్టిన ఎయిర్‌టెల్

ఎంటర్టైన్మెంట్

"భారతీయ వీడియో ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్ యొక్క వేగవంతమైన వృద్ధి వినియోగదారులపై అపూర్వమైన ప్రభావాన్ని చూపింది" అని హాట్‌స్టార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ వరుణ్ నారంగ్ మీడియాకు తెలిపారు.

2019 ఇండియాలో హాట్‌స్టార్ వాచ్ రిపోర్ట్

2019 ఇండియాలో హాట్‌స్టార్ వాచ్ రిపోర్ట్

వీడియో వినియోగం విషయంలో మెట్రోయేతరు నగరాలు మరియు మెట్రో నగరాలలోని ప్రజలు ఎలా వినియోగిస్తున్నారో నివేదిక ప్రత్యేకంగా వెల్లడించింది. మొత్తం కంటెంట్ వినియోగంలో ప్రాంతీయ కంటెంట్ కూడా 40 శాతం పెరిగింది. మొత్తం ఆన్‌లైన్ ఎంటర్టైన్మెంట్ వినియోగంలో 63 శాతం నాన్-మెట్రోల నుండి వచ్చాయి. వీడియో వినియోగంలో లక్నో, పూణే, పాట్నా ప్రాంతాలు హైదరాబాద్, బెంగళూరు, కోల్ కత్తా నగరాలను అధిగమించాయి. వాస్తవానికి హాట్‌స్టార్ లో అదికంగా చూసిన ఎంటర్టైన్మెంట్ షో బిగ్ బాస్ తమిళం. ఇది హిందీ యొక్క అన్ని టీవీ షోలను ఓడించింది అని హాట్‌స్టార్ నివేదిక వెల్లడించింది.

 ఫ్యామిలీ షో
 

2019 లో పురుషులు 40 శాతం కంటే ఎక్కువ మంది ప్రేక్షకులతో ఫ్యామిలీ షోలపై అధిక మక్కువ చూపుతున్నారు. ఇటువంటి శైలులు పురుషులను ఆకర్షించవని చాలాకాలంగా ఉన్న నమ్మకాన్ని ఇది విచ్ఛిన్నం చేస్తుంది. ప్రేక్షకులలో 41 శాతం మంది కసౌతి జిందగీ కే మరియు గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి షోలను అధికంగా చూస్తున్నట్లు తమ నివేదికలో వెల్లడించారు. మహిళలు కూడా తమ వినోదాన్ని డిజిటల్‌గా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆన్‌లైన్ మొత్తం వినోద వినియోగంలో ఇవి 45 శాతం ఉన్నాయని నివేదిక తెలిపింది.

హాట్‌స్టార్

ప్రస్తుత రోజులలో ఇండియాలో వినియోగదారుడు హాట్‌స్టార్ లో ఎంచుకోవడానికి చాలా ఎక్కువ కంటెంట్‌ను పొందుతున్నాడు. ఇందులో లింగం లేదా భాష ద్వారా ఎటువంటి పరిమితం ఉండదు. మరీ ముఖ్యంగా రోజు రోజుకి పెరుగుతున్న యాక్సిస్ వినియోగదారుని కొత్త ఆలోచనలకు తలుపులు తెరుస్తున్నది "అని నారంగ్ తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Hotstar App Downloads 2019 Cross the 400 Million in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X