హాట్‌స్టార్‌లో హాల్ చల్ చేయనున్న Avengers: Endgame

|

హాట్‌స్టార్‌ యాప్ అనేది మన ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు,సీరియల్స్,ఒరిజినల్ షోలను చూడడానికి అనుమతి ఉంటుంది. హాట్‌స్టార్‌ ద్వారా అందరికి ఇష్టమైన క్రికెట్ ను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైవ్ మ్యాచ్ చూడవచ్చు. హాట్‌స్టార్‌లో వివిధ రకాల భాషలకు చెందిన సినిమాలు మరియు టీవీ షోలను చూడవచ్చు.

హాట్‌స్టార్‌
 

సాధారణంగా ఇంగ్లీష్ సినిమాలు హాట్‌స్టార్‌లోకి రిలీజ్ అయిన ఒక సంవత్సరానికి కూడా రావు. మరి ముఖ్యముగా మార్వెల్ సినిమాలు భారతదేశంలోని హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్‌లోకి రావడానికి ఒక సంవత్సరం సమయం పడుతుంది. కానీ మార్వెల్ సిరీస్ మూవీస్ లో అందరి దృష్టిని ఎక్కువగా ఆకట్టుకున్న ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ మాత్రం నవంబర్ 13 బుధవారం నుండి హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది.

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865Soc రిలీజ్ ఎప్పుడో తెలుసా?

మార్వెల్ సినిమా

మార్వెల్ సినిమాలకు ఇండియాలో ఎక్కువగా ఆదరణ లభిస్తున్నది. ఇంగీష్ సినిమాలలో ఏ సినిమాకు లేని విధంగా ఈ సిరీస్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఇవి ఇండియాలో అన్ని బాషలలో రిలీజ్ అయినాయి. ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా మాత్రం త్వరగా హాట్‌స్టార్‌లోకి రాబోతున్నది. మార్వెల్ యొక్క మునుపటి సినిమాలు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఎంట్రీ, కెప్టెన్ మార్వెల్ ఇంకా అందుబాటులో లేదు.

Airtel Xstream Fibre: RS.699లకే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

హాట్‌స్టార్‌ ప్రీమియం

మార్వెల్ సినిమాలను హాట్‌స్టార్‌లో చూడడానికి మీకు హాట్‌స్టార్ యొక్క ప్రీమియం సభ్యత్వం అవసరం అవుతుంది. ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధర నెలకు రూ.299,మరియు ఒక సంవత్సరానికి 999రూపాయలు. ప్రీమియం సభ్యత్వంను ఈ దరల వద్ద పొంది హాట్‌స్టార్‌ యొక్క ప్లాట్‌ఫారమ్‌లోని దాదాపు అన్ని హాలీవుడ్ సినిమాలను ఎన్ని సార్లు అయిన చూడవచ్చు.

BSNL నుంచి మరొక లాంగ్ టర్మ్ ప్లాన్!! రోజుకు 3GB డేటా ఆఫర్ అదుర్స్

హాట్‌స్టార్‌లో
 

హాట్‌స్టార్‌లో ఈ వారం ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా మొదట వస్తున్నది. దీని తరువాత హాట్‌స్టార్‌ యొక్క అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ లో అవెంజర్స్ మరియు ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ అనే మరో రెండు ఎవెంజర్స్ సినిమాలు కూడా ప్రారంభం కానున్నాయి. మొత్తంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ విషయానికొస్తే హాట్‌స్టార్‌ ప్రత్యేకంగా థోర్, ఐరన్ మ్యాన్ 3, బ్లాక్ పాంథర్ మరియు యాంట్-మ్యాన్ తో కలిపి మరో నాలుగు ఎంట్రీలను కలిగి ఉంది.

జియో సినిమా

జియో సినిమా విషయానికి వస్తే ఇందులో థోర్: ది డార్క్ వరల్డ్, కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్, యాంట్ మ్యాన్, కెప్టెన్ అమెరికా: సివిల్ వార్, మరియు డాక్టర్ స్ట్రేంజ్ సినిమాలతో కలిపి ఐదు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ లో గార్డియన్స్‌ అఫ్ గెలాక్సీ వాల్యూమ్ 2 ఒకటి మాత్రమే ఉంది.

వీడియో

ఐరన్ మ్యాన్, మరియు ఐరన్ మ్యాన్ 2 హాట్స్టార్ మరియు జియో సినిమా రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. ది ఇన్క్రెడిబుల్ హల్క్, కెప్టెన్ అమెరికా: ఫస్ట్ అవెంజర్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ మరియు జియో సినిమా యొక్క మూడు ప్లాట్‌ఫామ్‌లలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అందుబాటులో ఉంది. స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్, మరియు థోర్: రాగ్నరోక్ అనే రెండు సినిమాలు మాత్రమే భారతదేశంలో స్ట్రీమింగ్ లలో అందుబాటులో లేవు. అలాగే కెప్టెన్ మార్వెల్ మరియు స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ వంటివి కూడా అందుబాటులో లేవు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Hotstar India to Stream Avengers: Endgame Movie, From November 13th

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X