రోజుకు 100 కోట్ల గంటలు, యూట్యూబ్‌కే అంకితం

యూట్యూబ్‌లోని మొత్తం వీడియోలను సెర్చ్ చేయాలంటే ఏకంగా లక్ష సంవత్సరాలు పడుతుందట.

|

ఇంటర్నెట్‌ను వినియోగించుకుంటోన్న దాదాపు ప్రతిఒక్కరికి యూట్యూబ్ గురించి తెలిసే ఉంటుంది. ఈ వీడియో షేరింగ్ వెబ్‌సైట్‌లో నిత్యం సరికొత్త కంటెంట్ అప్‌లోడ్ అవుతూనే ఉంటుంది. ఈ సైట్‌ను సందర్శించే వారి సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతోంది. యూట్యూబ్ వాడకానికి సంబంధించి ఇటీవల ఓ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Read More : రూ.19కే రిలయన్స్ జియో

100 కోట్ల గంటల నిడివి గల వీడియోలు..

100 కోట్ల గంటల నిడివి గల వీడియోలు..

తాజా విశ్లేషణ ప్రకారం యూట్యూబ్‌లో ప్రతిరోజు 100 కోట్ల గంటల నిడివి గల వీడియోలను వీక్షించటం జరుగుతుందట. 2015లో ఈ సమయం 50 కోట్ల గంటలగా ఉంది. యూట్యూబ్‌లోని మొత్తం వీడియోలను సెర్చ్ చేయాలంటే ఏకంగా లక్ష సంవత్సరాలు పడుతుందట.

యూట్యూబ్ గో ..

యూట్యూబ్ గో ..

గూగుల్, ఇండియన్ యూజర్స్ కోసం యూట్యూబ్ గో పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను పొందవచ్చు. లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టువిటీలో సైతం యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరగుపరిచే లక్ష్యంతో అభివృద్థి చేయబడిన ఈ యాప్ ద్వారా 2జీ నెట్‌వర్క్‌లో కూడా వీడియోలను సేవ్ చేసుకొని Smart Offline ఫీచర్ ద్వారా వాటిని ఇంటర్నెట్ కనెక్షన్‌తో పనిలేకుండా వీక్షించవచ్చు.

నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని..

నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని..

భారత్‌లో యూట్యూబ్‌ను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని పాటలు, సినిమాలు అన్ని యూట్యూబ్‌లోనే వెతికేస్తుంటారు మన నెటిజనులు.

యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళ్లేందుకు

యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళ్లేందుకు

యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు ఇంతగా డిమాండ్ నెలకున్న నేపథ్యంలో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళ్లేందుకు యూట్యూబ్ గో పేరుతో విప్లవాత్మక యాప్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

2జీ నెట్‌వర్క్‌లో కూడా

2జీ నెట్‌వర్క్‌లో కూడా

యూట్యూబ్ గో యాప్ ద్వారా యూజర్లు 2జీ నెట్‌వర్క్‌లలో కూడా వీడియోలను సేవ్ చేసుకొని వాటిని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీక్షించవచ్చు. ఈ సదుపాయం గతంలోనే అందుబాటులో ఉన్నప్పటికి మరిన్ని మాడిఫికేషన్స్ తో ఇప్పుడు లభ్యంకానుంది.

క్వాలిటీని అడ్జస్ట్ చేసుకునే అవకాశం..

క్వాలిటీని అడ్జస్ట్ చేసుకునే అవకాశం..

యూట్యూబ్ గో యాప్ ద్వారా ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను వీక్షించేటపుడు విడియోకు సంబంధించిన క్వాలిటీని కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

తక్కువ డేటా వనరులతోనే..

తక్కువ డేటా వనరులతోనే..

ఇండియన్ యూజర్ల డేటా బడ్జెట్‌కు అనుగుణంగా డిజైన్ చేయబడిన యూట్యూబ్ గో యాప్ ద్వారా అందుబాటులో ఉన్న డేటా వనరులతోనే క్వాలిటీ వీడియో బ్రౌజింగ్‌ను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే ఆప్షన్

ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే ఆప్షన్

యూట్యూబ్ గో యాప్ ద్వారా మీరు ఏదైనా వీడియోను ఓపెన్ చేసినట్లయితే ఓ పాపప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ పాపప్ పై క్లిక్ చేయటం ద్వారా మీ నెట్ బ్యాలన్స్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఆ వీడియోను ఫోన్ ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది.

డేటా లిమిట్‌ను బట్టి...

డేటా లిమిట్‌ను బట్టి...

మీ డేటా లిమిట్‌ను బట్టి ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.యూట్యూబ్ గో యాప్ ద్వారా వీడియోలను సేవ్ చేసుకుని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీక్షించటమే కాదు వాటిని లోకల్ షేర్ ఆప్షన్ ద్వారా మీకు సమీపంలోని యూజర్లకు షేర్ చేసుకోవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
How Many Hours Of Videos People Watch On YouTube Every Day?. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X