వాట్సాప్‌లో Diwali స్టిక్కర్స్ యాడ్ చేసారు, చూస్కోండి..

|

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, ఇటీవల తన ప్లాట్‌ఫామ్‌ను ఉద్దేశించి స్టిక్కర్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలసిందే. ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్, వాట్సాప్ ఐఓఎస్ అలానే వాట్సాప్ వెబ్ యూజర్లు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చు.

వాట్సాప్‌లో Diwali  స్టిక్కర్స్ యాడ్ చేసారు, చూస్కోండి..

 

ఈ యాప్‌లో నిక్షిప్తం చేసిన స్టిక్కర్ స్టోర్ ద్వారా యూజర్లు వివిధ వెరైటీలతో కూడిన స్టిక్కర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ దీపావళి గ్రీటింగ్స్‌ను ఈ స్టిక్కర్స్ ద్వారా సెండ్ చేసుకోవచ్చు. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా వాట్సాప్ స్టిక్కర్స్‌ను ఉపయోగించుకుని దీపావళి గ్రీటింగ్స్‌ను ఏ విధంగా తెలపొచ్చు అనే దాని పై స్టెప్ బై స్టెప్ ప్రాసీజర్‌ను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది...

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన మార్పులు ఇవే...!

స్టెప్ 1...

స్టెప్ 1...

వాట్సాప్ స్టిక్కర్స్ మీ ఫోన్‌లో ఓపెన్ అవ్వాలంటే, తప్పనిసరిగా మీ వాట్సాప్ వెర్షన్‌ను 2.18 లేదా అంతకంటే హయ్యర్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయి ఉండాలి. యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ముందుగా యాప్‌ను ఓపెన్ చేసి చాట్ విండోలోకి వెళ్లాలి.

స్టెప్ 2..

స్టెప్ 2..

అక్కడ స్టిక్కర్స్‌ను యాక్సిస్ చేసుకునేందుకు స్మైలీ(smiley) ఐకాన్ పై క్లిక్ చేయాలి. స్మైలీ ఐకాన్ పై క్లిక్ చేసిన వెంటనే GIF ఐకాన్‌తో stickers ఐకాన్ మీకు కనిపిస్తుంది. వీటిలో stickers ఐకాన్ పై టాప్ చేసినట్లయితే స్టిక్కర్ స్టోర్ లోకి వెళతారు. ఇక్కడ మీకు అన్ని రకాల స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.

స్టెప్ 3..
 

స్టెప్ 3..

పేజ్ బోటమ్‌లో కనిపించే ‘Get more stickers' ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే గూగుల్ ప్లే స్టోర్‌లోకి రీడైరెక్ట్ కాబడతారు. ఇక్కడ మీకు నచ్చిన దివాళీ స్టిక్కర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ డౌన్‌లోడ్ అయిన తరువాత వాటిని ఓపెన్ చేసి ‘Add to WhatsApp' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

స్టెప్ 4..

స్టెప్ 4..

ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే మీరు ఎంచుకున్న దీపావళి స్టిక్కర్స్ మీ యాప్ లోకి వచ్చేస్తాయి. వీటిని గ్రీటింగ్స్ రూపంలో మీరు ఎవరికైనా షేర్ చేసుకునే వీలుంటుంది. ఐఫోన్ యూజర్లకు ప్రస్తుతం వాట్సాప్ స్టిక్కర్స్ ను డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. రిసీవ్ చేసుకున్న స్టిక్కర్స్‌ను ఫేవరెట్‌గా మార్క్ చేసుకున్న తరువాత మాత్రమే వారు ఇతరులకు ఈ సెండ్ చేయగలుగుతారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to send Diwali stickers on WhatsApp.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X