మీరు కాబ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, మీ ఫోన్లోని OLA లేదా UBER అప్లికేషన్ను ప్రారంభించి, మీబుకింగ్ ప్రారంభించవచ్చు. మీరు ఆఫీసులో మీPC ముందు కూర్చుని ఉంటే, ఫోన్ తో పనిలేకుండా తక్షణమే మీPC నుండి కాబ్ బుక్ చేసుకోవచ్చు. కేవలం వెబ్ బ్రౌజర్ ఉపయోగించి మీ కంప్యూటర్ నుండి ఒక క్యాబ్ బుక్ చేసుకోవడం చాలాసులభంగా ఉంటుంది, మరియు ఓలా అధికారికంగా డెస్క్టాప్ బుకింగ్ కు మద్దతిస్తుంది, అయితే UBER అందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కాబ్ బుక్ చేయడానికి ఒక సాధారణ ట్రిక్ ని ఉపయోగించాల్సి వస్తుంది. మీpc నుండే UBER బుక్ చేసుకోవడానికి అనుసరించాల్సిన పద్దతులను ఇక్కడ పొందుపరచడం జరిగినది.
కనుమరుగుకానున్న వైఫై, దూసుకొస్తున్న లైఫై !
ఫోన్ అప్లికేషన్ లేకుండా UBER బుక్ చేయడమిలా:
ఫోన్ లేకుండా UBER బుకింగ్ చాలాసులభం, కానీ మీరు తెలుసుకోవలసిన ఒక అదనపు దశ ఉంది, ఎందుకంటే డెస్క్టాప్లో UBERవెబ్సైట్ మిమ్ములను క్యాబ్ బుక్ చేయనివ్వదు. బదులుగా, మీరు మొబైల్ వెబ్సైట్ను ఉపయోగించాలి. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాo.
1.మీ PC లో, బ్రౌజర్ను తెరిచి, m.uber.comకి వెళ్లండి
2.తదుపరి స్క్రీన్లో, మీరు మీ ఫోన్ నంబర్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
3.మీ ఫోన్ లో వచ్చిన OTPని పొందుపరచి లాగిన్ అయ్యాక, మీరు బుకింగ్ పేజ్ కి పంపబడుతారు. ఒకసారి లాగిన్ అయ్యాక, కాబ్ బుకింగ్ సందర్భంలో మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు.
సైన్ ఇన్ చేసిన తర్వాత..
4.మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత, లొకేషన్ సేవలను వినియోగించుకొనుటకు మిమ్ములను UBER రిక్వెస్ట్ చేస్తుంది.
5.ఇక్కడ మీరు పికప్ మరియు డ్రాపింగ్ స్టాప్స్ ను ఎంచుకోవలసి ఉంటుంది.
6.ఈ సందర్భంలో మీరు ఎంచుకోగల కాబ్ రకాలు, పేమెంట్ మరియు కాబ్ స్థాన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీటిని ఎన్నుకున్నాక, పేమెంట్ పూర్తి చేయవలసి ఉంటుంది. తద్వారా రిక్వెస్ట్ బట్టన్ నొక్కడం ద్వారా మీకు కాబ్ ఎంపిక చేయబడుతుంది.
Windows యూజర్ల కోసం Uberఅప్లికేషన్:
మీరు విండోస్10 లేదా విండోస్8 OS కలిగి ఉన్న ఎడల, మీకోసం UBER అప్లికేషన్ కూడా విండోస్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది. మీ లొకేషన్ పర్మిషన్స్ ఇవ్వడం ద్వారా, మీ కాబ్ బుక్ చేసుకునే పద్దతి సరళతరం అవుతుంది. అప్లికేషన్ వినియోగం మాత్రం, పైన చెప్పిన మొబైల్ వెబ్సైట్ మాదిరిగానే ఉంటుంది. కానీ కాస్త వేగంగా కాబ్ బుక్ చేసుకొనుటకు మాత్రం అప్లికేషన్ వినియోగం మంచిదని చెప్పవచ్చు.
ఇదేవిధంగా OLA కు కూడా విండోస్10 అప్లికేషన్ ఉంది, కానీ ఇది కేవలం మొబైల్ వినియోగదారులకు మాత్రమే పని చేస్తుంది. PC, మరియు లాప్ టాప్ యూసర్స్ కి అందుబాటులో ఉండదు.
Mac యూజర్లకోసం Uber అప్లికేషన్:
Mac యూజర్లకై Uber నుండి ప్రత్యేకంగా అప్లికేషన్ లేదు, కానీ మీరు మీ ఆపిల్PC నుండి ఒక UBERకాబ్ బుక్ చేసుకోవడానికి Fastlane అప్లికేషన్ ఉంది. అధికారిక అప్లికేషన్ వలె, ఫాస్ట్ లాన్ కూడా ఉచితం.
ఇది మీ కంప్యూటర్ మెనుబార్లో ఉంటుంది. మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత, మీ పికప్,డ్రాపింగ్ స్థానాలను ఎంటర్ చేయండి. ఆపై request క్లిక్ చేయడం ద్వారా మీ కాబ్ అభ్యర్ధన ప్రక్రియ పూర్తవుతుంది. ఈ అప్లికేషన్ మొబైల్ వెబ్సైట్ కన్నా గొప్పదని చెప్పలేము, కానీ అదనపు సౌలభ్యం విలువైనదని మీరు నమ్మితే, ఫాస్ట్ లాన్ ఉపయోగించవచ్చు. ఆఫీస్365తో సమన్వయాన్ని ప్రారంభించిన UBER, మీ outlookAPIలను వినియోగించుకుంటుంది. తద్వారా మీరు మీ కాలెండర్లో రిమైండర్ సెట్ చేసిన ఎడల,కాబ్ టైమ్ రాగానే పాపప్ ద్వారా మీకు గుర్తు చేస్తుంది. మీరు పాపప్ స్వైప్ చేయడం ద్వారా రైడ్ ఆమోదించవచ్చు. తద్వారా మీకు కాబ్ పంపబడుతుంది.
ఫోన్ అప్లికేషన్ లేకుండా ఓలాను బుక్ ఎలా చేయాలి:
1.మీ PCలో, బ్రౌజర్లో www.olacabs.comకు వెళ్ళండి
2.ఎడమవైపు boxలో, మీ పికప్,డ్రాపింగ్ స్థానాలను వదలండి.
మీకు కావలసిన కాబ్ రకాన్ని ఎంచుకోండి. ఇక్కడ కాబ్లోని రకాలు, పేమెంట్ ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత మీ ఫోన్ నంబర్ ఇవ్వవలసి ఉంటుంది. OTP ద్వారా ధృవీకరించిన తర్వాత కాబ్ బుక్ చేయబడుతుంది.
ముఖ్యగమనిక: pcలో కాబ్స్ కాన్సిల్ చేస్కునే విధానం ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది, కావున కాన్సిల్ చేయాల్సి వస్తే ఫోన్ అప్లికేషన్ వాడడమే మంచిది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.