Just In
Don't Miss
- News
వంశీ పైన అనర్హత వేటు లేనట్లే: జగన్ కొత్త ప్లాన్ ఇదే..: బీజేపీకి దారి చూపించారు..నష్టం ఎవరికంటే..!
- Sports
'నాడా' బ్రాండ్ అంబాసిడర్‌గా సునీల్ శెట్టి!!
- Finance
రియల్ ఎస్టేట్‌లో అత్యధిక ధనికుడు బీజేపీ నేత, టాప్ 100లో తెలుగువాళ్లు
- Movies
RRR రేంజ్ ఇదా? రాజమౌళి స్కెచ్ చూస్తే మతిపోవాల్సిందే మరి!
- Lifestyle
చలికాలంలో పురుషులకు అంగం కుంచించుకుపోతుందని తెలుసా..
- Automobiles
2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
వాట్సప్‌లో డిఫరెంట్ ఫాంట్స్‌తో అవతలి వారితో ఛాట్ చేయడం ఎలా ?
ప్రపంచమంతా తెలిసిన మెసేజింగ్ సర్వీసింగ్ యాప్ ఏదైనా ఇప్పుడు ఉందంటే అది వాట్సప్ మాత్రమే.ఇందులో మెసేజ్ టైప్ చేస్తే చాలు క్షణాల్లో అవతలివారికి చేరిపోతుంది. అంతేకాదు... ఫోటోలు, ఎమోజీలు, గిఫ్, స్టిక్కర్లు, వీడియోలు... ఇలా అనేక ఫీచర్లు వాట్సప్‌లో ఉన్నాయి. అవే కాదు... థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా వాట్సప్‌ని ఇంకా బాగా వాడుకోవచ్చు. వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ కూడా అలాంటిదే. అయితే టైపింగ్ చేసే సమయంలో వివిధ రకాల ఫాంటులను పంపి మీరు అవతలి వారిని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. మొత్తం మూడు రకాల ఫాంట్స్ ని అవతలి వారికి డిఫరెంట్ గా పంపించవచ్చు. అదెలాగో చూద్దాం.
స్టెప్ 1
ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో వాట్సప్ ఓపెన్ చేయండి. అందులో ఛాట్ ఆప్సన్ ఓపెన్ చేయండి
స్టెప్ 2
అక్కడ మీరు ఎవరికి డిఫరెంట్ గా మెసేజ్ పంపించాలనుకుంటున్నారో వారి ఛాట్ బాక్స్ ఓపెన్ చేయండి.
స్టెప్ 3
ఆ ఛాట్ బాక్స్ లో asterisks (* ) ని ముందుగా ఎంటర్ చేయండి. ఉదాహరణకు *Hello* అని టైప్ చేయండి. అక్కడ బోల్ట్ కలర్ లో ఫాంట్ కనిపిస్తుంది.
స్టెప్ 4
మీరు ఇటాలిక్ లో టైప్ చేయాలనుకుంటే underscores (_)ని టైప్ చేయండి. ఉదాహరణకు _Hello_ అని టైప్ చేయండి. వెంటనే మీ ఫాంట్ ఛేంజ్ అవుతుంది. అయితే మీరు టైప్ చేసే ప్రతీ పదంలో ఇలా టైప్ చేస్తూ పోవాలి. అప్పుడు అది డిఫరెంట్ గా కనిపిస్తుంది.
చాట్స్, గ్రూపుల మ్యూట్
కొన్ని చాట్ కాంటాక్టుల నుంచి అదే పనిగా మెస్సేజ్ లు వస్తున్నాయా...? గ్రూపులో వందల మంది సభ్యులు చేసే పోస్ట్ లు, ఆ నోటిఫికేషన్లతో చిరాకు అనిపిస్తోందా..? అయితే వాటిని మ్యూట్ చేసేయండి. ఆడియో రూపంలో అలర్ట్ ను, నోటిఫికేషన్ ను కూడా మ్యూట్ చేయవచ్చు. దాంతో మెస్సేజ్ వచ్చినా గానీ మీకు తెలియదు. ప్రత్యేకంగా వాట్సప్ ఓపెన్ చేసినప్పుడే ఆయా మెస్సేజ్ లు వచ్చినట్టు తెలుస్తుంది. మ్యూట్ చేసేందుకు కాంటాక్టును లేదా గ్రూపును సెలక్ట్ చేసుకుంటే మెనూ మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కనిపించకూడదంటే..
వాట్సప్ లో మెస్సేజ్ వస్తే పైకి నోటిఫికేషన్ ఐకాన్ కనిపించకూడదనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి వాట్సాప్ నోటఫికేషన్ ను డిసేబుల్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఏ మెస్సేజ్ వచ్చినా వాట్సాప్ నుంచి మీకు నోటిఫికేషన్ రాదు. తిరిగి ఆన్ చేసుకుంటే తప్ప అవి రావు.
లాస్ట్ సీన్ ఆప్షన్
మీరు చూసింది ఎదుటి వారికి తెలియకూడదంటే లాస్ట్ సీన్ ఆప్షన్ ను ఆఫ్ చేసుకోవాలి. బ్లూకలర్ టిక్ మార్క్ ను కనిపించేదాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో అకౌంట్ విభాగంలోకి వెళితే ప్రైవసీ అనే ఆప్షన్ ఒకటుంది. ఈ ప్రైవసీలో గోప్యతకు సంబంధించిన ఆప్షన్లు కనిపిస్తాయి. అయితే, మీరు మీ ఉనికిని కనిపించకుండా ప్రైవసీ సెట్టింగ్స్ పెడితే మాత్రం ఎదుటి వారు మీ మెస్సేజ్ లు, ఫొటోలు చూసినదీ మీకు తెలియదు. అలాగే, మీ కాంటాక్టుల్లోని వారు చివరిసారిగా వాట్సప్ కు ఎప్పుడు వచ్చినదీ కూడా తెలియదు. మీరు ఏవైతే ప్రైవసీ కావాలనుకున్నారో, అదే ప్రైవసీ మీ కాంటాక్టులకు కూడా వాట్సప్ అమలు చేస్తుంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090