వైఫై హాట్‌స్పాట్‌లకు సంబంధించి పాస్‌వర్డ్‌లను ఛేంజ్ చేయటం ఎలా..?
మన స్మార్ట్‌ఫోన్‌లలోని హాట్‌స్పాట్ సిస్టంకు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఎంతో అవసరం.
మన స్మార్ట్‌ఫోన్‌లలోని హాట్‌స్పాట్ సిస్టంకు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఎంతో అవసరం. హాట్‌స్పాట్ ప్రొటెక్షన్ అనేది సరిగ్గా లేనపుడు మన డేటా కనెక్షన్‌ను మన అనుమతి లేకుండా వేరొకరు యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. మన స్మార్ట్‌ఫోన్‌లలోని హాట్‌స్పాట్ సిస్టంకు పాస్‌వర్డ్‌తో ప్రొటెక్షన్‌ను కల్పించటం ద్వారా సెక్యూర్డ్ పద్ధతిలో మన మొబైల్ ఇంటర్నెట్‌ను మ్యాక్, పీసీ, టాబ్లెట్ అలానే స్మార్ట్ టీవీలకు షేర్ చేసుకునే వీలుంటుంది.

స్టెప్ బై స్టెప్ గైడ్..
స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ హాట్‌స్పాట్ పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా సెక్యూరిటీ పరమైన దాడుల నుంచి వారివారి డివైస్‌లను పూర్తిగా కాపాడుకునే వీలుంటుంది. నేటి స్పెషల్ ఫోకస్ భాగంగా వై-ఫై హాట్‌స్పాట్ పాస్‌వర్డ్‌లను ఏ విధంగా అప్‌డేట్ చేసుకోవాలని అనే దాని పై స్టెప్ బై స్టెప్ గైడ్‌ను మీకందించటం జరుగుతోంది.

ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే..
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే ముందుగా ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి Wireless & networks సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ More అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై టాప్ చేసినట్లయితే Tethering & portable hotspot అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌కు సంబంధించిన టాగిల్ పై టాప్ చేసి, Wi-Fi hotspot సెటప్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ సెటప్‌లో భాగంగా హాట్‌స్పాట్ పేరుతో పాటు పాస్‌వర్డ్‌ను ఛేంజ్ చేసుకునే వీలుంటుంది.

ఐఫోన్ యూజర్స్ అయితే..
మీరు యాపిల్ ఐఫోన్‌లను వినియోగిస్తున్నట్లయితే ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పర్సనల్ హాట్ స్పాట్ ఆప్షన్ పై టాప్ చేయాలి. ఈ సమయంలో మీ డివైస్ వై-ఫై లేదా బ్లుటూత్ తప్పనిసరిగా ఆన్ అయి ఉండాలి. ఇప్పుడు వై-ఫై పాస్‌వర్డ్ ఆప్షన్ పై టాప్ చేసి మీకు నచ్చిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.

పాస్‌వర్డ్స్ ఎంపిక విషయంలో జాగ్రత్త..
కొత్త పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసే సమయంలో అవి చాలా క్లిష్టతరంగా ఉండేలా చూసుకోవాలి. పాస్‌వర్డ్‌లో రియల్ వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు. ఇదే సమయంలో మీ లాస్ట్ నేమ్, అలాగే పెట్‌నేమ్‌లు ఉండకుండా చూసుకోండి. మీ పాస్‌వర్డ్ మరింత క్లిష్టంగా ఉండేందుకు క్యారక్టర్స్‌తో కూడిన వర్డ్స్ ఇవ్వడం చాలామంచిది.

ఇటువంటి సులువైన పాస్‌వర్డ్స్ ఇవ్వకండి..
123456, 123456789, qwerty, 12345678, 111111, 1234567890, 1234567, password, 123123, 987654321, qwertyuiop, mynoob, 123321, 666666, 18atcskd2w, 7777777, 1q2w3e4r, 654321, 555555, 3rjs1la7qe, google, 1q2w3e4r5t, 123qwe, zxcvbnm, 1q2w3e వంటి సులువైన పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లో వినియోగికంచకండి. వీటిని హ్యాకర్లు సునాయాశంగా చేధించగలుగుతున్నారు.


Click it and Unblock the Notifications








