Home
Apps

వాట్సాప్‌ వినియోగిస్తున్నప్పుడు ఇలా అనిపిస్తే అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

వాట్సాప్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు కలిగిన యాప్స్‌లో ఒకటిగా ఉంది. భారత్‌లోనూ కోట్లాది మంది యూజర్లు వాట్సాప్‌ వ్యక్తిగత, ఆఫీస్‌ సహా ఇతర పనుల కోసం ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ తన యూజర్ల సౌకర్యం, భద్రత కోసం అనేక అద్భుతమైన ఫీచర్‌లను విడుదల చేస్తోంది. అయితే ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు సోషల్‌ మీడియా ఆధారంగా అనేక మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సా్ప్‌, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటనలిచ్చి అమాయకులకు వల వేస్తున్నారు.

దీంతోపాటు వివిధ నంబర్‌లతో లింక్‌లు షేర్ చేసి వాట్సాప్‌ను హ్యాకింగ్‌ (Whatsapp Hacked) చేస్తున్నారు. కొన్నిసార్లు వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్నారు. మరియు నగదు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని అంశాల ద్వారా మీ వాట్సాప్‌ హ్యాక్‌ అయిందా లేదా అనేది తెలుసుకొనేందుకు అవకాశం ఉంది.

check is your whatsapp hacked

వాట్సాప్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది అని నిర్ధారణకు వచ్చేందుకు (How to Check Whatsapp Hasbeen Hacked) ఈ విషయం మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ వాట్సాప్‌లో మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా ఏదైనా చాట్‌ లేదా కాంటాక్ట్‌ కనిపిస్తే.. మీ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు నిర్ధారణకు రావచ్చు.

దీంతోపాటు మీ అకౌంట్‌లో లాగిన్‌ అయ్యేందుకు లేదా ఇతర డివైజ్‌లతో లింక్ చేసేందుకు ప్రయత్నించి విఫలం చెందినట్లు అయితే మీ వాట్సాప్‌ను హ్యాక్‌ చేసినట్లు భావించవచ్చు. మరియు మీ ఖాతాను ఇతరులు అపరేట్‌ చేస్తున్నట్లు భావించవచ్చు. దీంతోపాటు మీ ప్రమేయం లేకుండా వెరిఫికేషన్‌ కోడ్‌లు అత్యధికంగా వస్తున్నా.. అకౌంట్‌ హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతున్నట్లు భావించవచ్చు.

వాట్సాప్ అకౌంట్‌ హ్యాంకింగ్‌కు గురికాకుండా చూడటం లేదా మెరుగైన భద్రత ఫీచర్‌లను పొందేందుకు ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. దీంతోపాటు ఇప్పటికే వాట్సాప్‌ అందిస్తున్న సెక్యూరిటీ ఫీచర్‌లను ఉపయోగించుకోవాలి. మరియు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తెలియని వ్యక్తుల నుంచే వచ్చే లింక్స్‌ పైన క్లిక్ చేయవచ్చు.

వీటితోపాటు టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ను (Whatsapp Two Step Verification) యాక్టివేట్‌ చేసుకోవాలి. మరియు స్ట్రాంగ్‌ పిన్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మీ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలి. ముఖ్యంగా లింక్‌ చేసిన డివైజ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ మొబైల్‌లో మినహా ఆఫీస్‌ సహా ఇతర ప్రాంతాల్లోని డివైజ్‌లలో వాట్సాప్‌ను లింక్‌ చేసినట్లయితే.. మీ పని పూర్తవగానే Logout చేయడం ఉత్తమం.

ఏదైనా సమయంలో మీ వాట్సాప్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైనట్లు భావిస్తే.. వెంటనే వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలి. మరియు హ్యాకింగ్‌ జరిగినట్లు అనిపిస్తే వెంటనే అప్రమత్తంగా కావాలి. లేని పరిస్థితుల్లో వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సైబర్‌ నేరగాళ్లు భారీగా నగదును డిమాండ్‌ చేసే అవకాశం ఉంది.

వాట్సాప్‌ కూడా ప్లాట్‌ఫాంను దుర్వినియోగం చేయడం లేదా భారత ఐటీ చట్టాలను ఉల్లఘించడం వంటి కారణాలతో ప్రతినెల లక్షల అకౌంట్‌లను బ్యాన్‌ చేస్తోంది. యూజర్ల భద్రత కోసం తీసుకున్న చర్యలపై ప్రతినెల నివేదికలను విడుదల చేస్తుంది. సెప్టెంబర్‌ నెలలో ఏకంగా 85 లక్షల భారతీయ అకౌంట్‌లను బ్యాన్‌ చేసింది. తప్పుడు సమాచారం షేర్ చేయడం సహా స్పామ్‌ మెసేజ్‌లు పంపే అకౌంట్‌లపైనా వాట్సాప్‌ చర్యలు తీసుకుంటోంది.

Best Mobiles in India

English summary
How to Check if Your WhatsApp Account Has Been Hacked here are the signs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X