పెట్రోల్,డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా ?

ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండటం లేదు. రోజు అవి ఛేంజ్ అవుతున్నాయి.

|

ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండటం లేదు. రోజు అవి ఛేంజ్ అవుతున్నాయి. కారు, బైకు ఉన్నవాళ్లు పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయో తెలియక,పెరిగాయో తగ్గాయో తెలుసుకోవాలనుకోవడం సహజమే..అయితే ఎలా తెలుసుకోవాలి. దీనికోసం ప్రత్యేకమైన యాప్స్ ఏమైనా ఉన్నాయా అని అందరూ తెగ ఆలోచిస్తుంటారు. అయితే అలాంటి వారికోసం ఆన్ లోన్ లో కొన్ని యాప్స్ ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్ల సమాచారాన్ని మీకందిస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని యాప్స్ మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఇండస్ట్రీలో Airtel మరో సంచలనం,అత్యంత తక్కువ ధరకే డేటా ఆఫర్ఇండస్ట్రీలో Airtel మరో సంచలనం,అత్యంత తక్కువ ధరకే డేటా ఆఫర్

Fuel@IOC – IndianOil

దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఐఫోన్ యూజర్లయితే ఆపిల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ యాప్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు వీటి ధరల సమాచారం అందుబాటులో ఉంటుంది. ధరలు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటాయి.

BPCL’s SmartDrive

ఇది భారత్ పెట్రోలియం యాప్. మీకు దగ్గరలో బారత్ పెట్రోలియం ఉంటే ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను చెక్ చేసుకోవచ్చు.

My HPCL mobile app

ఇది హిందూస్థాన్ పెట్రోలియం యాప్. దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు ధరల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

డైలీ పెట్రోల్ డీజిల్ ప్రైస్ ( Daily petrol/diesel price)
 

డైలీ పెట్రోల్ డీజిల్ ప్రైస్ ( Daily petrol/diesel price)

ఈ యాప్ లో మీరు ఆరు నగరాలను సెట్ చేసుకోవచ్చు. ఆయా నగరాల్లో పెట్రోలు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే అక్షరక్రమంలో అన్ని నగరాల్లో ధరల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

మ్యాప్ మై ఫ్యూయెల్ (MapmyFuel)

మ్యాప్ మై ఫ్యూయెల్ (MapmyFuel)

ప్రధాన కంపెనీల పెట్రోల్ బంకుల్లో ధరలు ఎలా ఉన్నాయో ఈ యాప్ ఇట్టే చెప్పేస్తుంది. వాహనం మైలేజ్ కూడా ట్రాక్ చేస్తుంది.

Daily Fuel price

Daily Fuel price

మీకు దగ్గరలో ఏ పెట్రోల్ బంక్ ఉందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్కడికైనా మీరు తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ యాప్ మీకు చాలా సహయకారిగా ఉంటుంది.

Daily Petrol Diesel Price In India Rate Finder

Daily Petrol Diesel Price In India Rate Finder

ఈ యాప్ మొత్తం 500 నగరాల్లో ఉన్న ధరల సమాచారాన్ని మీకందిస్తుంది. అలాగే జీఎస్టీ రేట్స్ గురించిన సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఇందులో మీరు ఎక్కువ పెట్రోలు, డీజెల్ కొనాలనుకుంటే దాన్ని ధరను కాలిక్యులేట్ చేసి చూపిస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
How to check Petrol, Diesel prices daily: These Mobile Apps keep a track of the changing fuel rates More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X