మీ స్నేహితుల వాట్సాప్ స్టేటస్ ను రహస్యంగా తనిఖీ చేయడం ఎలా??
ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో ఒక ప్రభంజనం సృష్టించిన వాట్సాప్‌లో అనేక హిడెన్ ఫీచర్స్ ఉన్నాయి. వీటి అన్నిటి గురించి ఖచ్చితంగా మీకు తెలియదని అనుకుంటున్నాము. మీ యొక్క కాంటాక్ట్ లో ఉన్న వారి యొక్క స్టేటస్ ను వారికి తెలియకుండా చూడడానికి కూడా వాట్సాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది అని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉందా? ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం కొన్ని సంవత్సరాల క్రితం రీడ్ రెసెప్ప్ట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది ఒకరి వాట్సాప్ స్టేటస్ ను రహస్యంగా తనిఖీ చేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. వాస్తవానికి ఎవరికీ తెలియజేయకుండా మీరు వారి వాట్సాప్ స్టేటస్ ను తనిఖీ చేయాలనుకుంటే కనుక కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఒకరి వాట్సాప్ స్టేటస్ ను రహస్యంగా తనిఖీ చేసే చిట్కా గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ స్టేటస్ ను రహస్యంగా తనిఖీ చేసే విధానం
ఒకరి వాట్సాప్ స్టేటస్ ని వారికి తెలియజేయకుండా తనిఖీ చేసే విధానం iOS మరియు Android వినియోగదారులకు ఒకే విధంగా ఉంటుందని గమనించాలి.
*** మీ యొక్క Android లేదా iOS మొబైల్ డివైస్ లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయండి.
*** తరువాత సెట్టింగ్స్ మెను మీద క్లిక్ చేయండి.
*** తరువాత అందులో కనిపించే ప్రైవసీ ఎంపికపై క్లిక్ చేయండి.
*** తరువాత అందులో గల రీడ్ రిసిప్ట్ ఫీచర్ ను నిలిపివేయండి.

ఈ ఫీచర్ ను నిలిపివేయబడిన తర్వాత మీరు వారి వాట్సాప్ స్టేటస్ ని చూసినప్పుడు మీ కాంటాక్ట్ లో ఉన్న వారు చూడలేరు. వాస్తవానికి ఇది ఇతర మార్గాల్లో కూడా పనిచేస్తుంది. రీడ్ రిసిప్ట్ ఫీచర్ ప్రారంభించబడిన తర్వాత మీ వాట్సాప్ స్టేటస్ ను ఎవరు చూశారో కూడా మీరు చూడలేరు.

వాట్సాప్ యొక్క మెసేజ్ లకు కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది. రీడ్ రిసిప్ట్ ఫీచర్ నిలిపివేయబడిన తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నీలిరంగు మార్కును చూడలేవు లేదా మీరు వారి మెసేజ్ ను చదివారో లేదో తెలుసుకోలేరు. ఇది ఇతర మార్గాల్లో కూడా పనిచేస్తుంది. సరళమైన మాటలలో చెప్పాలంటే రీడ్ రిసిప్ట్ నిలిపివేయబడితే ఒక కాంటాక్ట్ మీ మెసేజ్ ను చదివిందో లేదో మీరు చూడలేరు.


Click it and Unblock the Notifications








