మీ యొక్క ఫోటోను వాట్సాప్ స్టిక్కర్‌లుగా మార్చి పంపడం ఎలా?

|

ప్రపంచం మొత్తం మీద ఇన్స్టెంట్ మెసేజింగ్ కోసం ఉపోయాయోగించే యాప్ లలో వాట్సాప్ ముందు వరుసలో ఉంది. వాట్సాప్ తన యొక్క వినియోగదారులకు అనేక రకాల ఫీచర్లను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంది. వాట్సాప్ లో ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే ప్రధాన ఫీచర్లలో ఒకటి వాట్సాప్ స్టిక్కర్లు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలలో మీ స్నేహితులు మరియు బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి స్టిక్కర్లు ఉపయోగించబడతాయి. కానీ ఇప్పుడు ఎటువంటి థర్డ్-పార్టీ యాప్ సహాయం లేకుండా కూడా మీ ఫోటో స్టిక్కర్‌లను పంపే సౌకర్యం మీకు ఉంది అని మీకు తెలుసా?

 

వాట్సాప్

వాట్సాప్ తన వినియోగదారుల కోసం 2018లో స్టిక్కర్‌లను పరిచయం చేసింది. అప్పటి నుండి చాట్ చేస్తున్నప్పుడు వాటిని ఉపయోగించడం అనేది ఒక ప్రసిద్ధ మార్గంగా మారింది. ఇంతకు ముందు మీరు థర్డ్-పార్టీ యాప్‌ల సహాయంతో మీ ఫోటో యొక్క స్టిక్కర్‌లను పంపవచ్చు. అయితే ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా మరియు అలసటతో కూడి ఉంటుంది. దీని కోసం ముందుగా మీరు మీ ఫోటోను స్టిక్కర్‌గా మార్చగల థర్డ్-పార్టీ యాప్‌ని ఎంచుకోవాలి. ఆపై చిత్రాన్ని ఎంచుకుని దాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేసి, క్రాప్ చేసి, టెక్స్ట్ ని జోడించి ఆపై దాన్ని మీ స్నేహితుడు మరియు బంధువులకు పంపవలసి ఉంటుంది. స్టిక్కర్‌లను అధికంగా ఉపయోగించడంపై పిచ్చి ఉన్నవారు ఈ సుదీర్ఘ ప్రక్రియ ద్వారా వెళ్లడానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు ఇలా చేయాల్సిన అవసరం ఉండదు.

వాట్సాప్ వెబ్‌

ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ వెబ్‌లోని కొత్త స్టిక్కర్ల ఫీచర్ అనుకూల స్టిక్కర్ సృష్టిని సులభతరం చేస్తుంది. మీరు ఏదైనా సందర్భంలో మీ కోసం వ్యక్తిగతీకరించిన WhatsApp స్టిక్కర్‌ని తయారు చేసుకునే మార్గం కోసం వెతుకుతున్నట్లయితే లేదా రాబోయే పండుగ, పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ దశలను అనుసరించవచ్చు.

మీ ఫోటోను వాట్సాప్ స్టిక్కర్‌లుగా మార్చి పంపే విధానం
 

మీ ఫోటోను వాట్సాప్ స్టిక్కర్‌లుగా మార్చి పంపే విధానం

STEP1: WhatsApp వెబ్‌ని ఓపెన్ చేసి ఏదైనా చాట్ విండోకు వెళ్లండి.

STEP2: అటాచ్‌మెంట్ చిహ్నాన్ని నొక్కి స్టిక్కర్‌ ఎంపికను ఎంచుకోండి.

STEP3: ఇప్పుడు ఫైల్ ఎక్స్‌ప్లోరర్ విండో అందులో ఓపెన్ అవుతుంది.

STEP4: మీరు WhatsApp స్టిక్కర్‌గా మార్చాలనుకుంటున్న ఫోటోను ఎంచుకోండి.

STEP5: ఇది పూర్తయిన తర్వాత దానిని సర్దుబాటు చేసి 'సెండ్' ఎంపిక బాణాన్ని నొక్కండి.

STEP6: కస్టమ్ వాట్సాప్ స్టిక్కర్‌లను క్రియేట్ చేయడం కోసం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఫీచర్ ప్రస్తుతానికి WhatsApp వెబ్‌లో మాత్రమే పని చేస్తుంది. ఇది కాకుండా వినియోగదారులు స్టిక్కర్‌పై రైట్-క్లిక్ లేదా ఎక్కువసేపు నొక్కి తదుపరి ఉపయోగం కోసం సేవ్ చేయవచ్చు.

 

వేవ్‌ఫారమ్‌

WhatsApp త్వరిత మెసేజ్ యాప్ తన యొక్క ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు పంపే లేదా స్వీకరించే వాయిస్ మెసేజ్ల కోసం కంపెనీ ఇప్పుడు వేవ్‌ఫారమ్‌లను విడుదల చేయడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ ఎంపిక చేసిన బీటా టెస్టర్ల కోసం ఈ తాజా అప్ డేట్ అందుబాటులో ఉంది. WhatsApp చాట్ బబుల్‌లలో వాయిస్ వేవ్‌ఫారమ్‌లను చూపడం ద్వారా ఆడియో మెసేజ్ల కోసం ఒరిజినల్ ఇంటర్‌ఫేస్‌ను భర్తీ చేస్తుంది. బీటా టెస్టర్‌ల కోసం వేవ్‌ఫారమ్‌లతో పాటు వాట్సాప్ పాటుగా మరొక ఎంపికను కూడా పరీక్షిస్తున్నట్లు గుర్తించబడింది. ఇది మెసేజ్ ప్రతిచర్యల కోసం మీరు పొందే అన్ని నోటిఫికేషన్‌లను ఆపివేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అయితే బీటా పరీక్ష కోసం మెసేజ్ రియాక్షన్ ఇంకా విడుదల చేయబడలేదు.

నక్షత్రం గుర్తు ఉన్న సందేశాలను ఎలా యాక్సెస్ చేయాలి

నక్షత్రం గుర్తు ఉన్న సందేశాలను ఎలా యాక్సెస్ చేయాలి

స్టెప్ 1: మీ వాట్సాప్ హోమ్ పేజీ యొక్క కుడి ఎగువ మూలలో చూపిన మూడు చుక్కలపై క్లిక్ చేయండి

స్టెప్ 2: 'నక్షత్రం గుర్తు ఉన్న మెసేజ్లు' ఎంపికకు వెళ్లండి.

స్టెప్ 3: మీరు తేదీతో పాటు మెసేజ్ పైన పంపినవారు మరియు స్వీకరించేవారి పేరును చూస్తారు.

స్టెప్ 4: మెసేజ్ ను చాట్‌లో వీక్షించడానికి దానిపై నొక్కండి.

స్టెప్ 5: ఇది మిమ్మల్ని మెసేజ్ నక్షత్రం ఉంచిన అసలు స్థానానికి నావిగేట్ చేస్తుంది.

స్టెప్ 6: మీరు వ్యక్తి లేదా గ్రూప్ పేరుపై క్లిక్ చేయడం ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు.

స్టెప్ 7: 'నక్షత్రం గుర్తు ఉన్న మెసేజ్లు' ఎంపికకు క్రిందికి స్లైడ్ చేయండి.

స్టెప్ 8: మీరు నక్షత్రం గుర్తు ఉన్న అన్ని మెసేజ్ల జాబితాను చూస్తారు.

మీరు మెసేజ్ నుండి నక్షత్ర గుర్తును తీసివేయాలనుకుంటే కనుక నక్షత్రం గుర్తు ఉన్న మెసేజ్ ఎంపికకు వెళ్లి ఆ మెసేజ్ మీద ఎక్కువసేపు నొక్కండి. స్క్రీన్ పై భాగంలో మీరు మెసేజ్‌ని అన్‌స్టార్ చేయగల ఎంపిక మీద నొక్కడం ద్వారా నక్షత్రాన్ని తొలగించవచ్చు.

 

WhatsAppలో ఒకరిని శాశ్వతంగా మ్యూట్ చేయడం ఎలా?

WhatsAppలో ఒకరిని శాశ్వతంగా మ్యూట్ చేయడం ఎలా?

స్టెప్ 1: ముందుగా మీ ఫోన్ లోని వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయండి.

స్టెప్ 2: వాట్సాప్ మెసేజ్ యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 3: మీమ్మలని బాధించే కాంటాక్ట్ ను ఎంచుకోండి. మీకు కావలసినన్ని ఎంపిక చేసుకోవచ్చు.

స్టెప్ 4: ఆండ్రాయిడ్‌లో కాంటాక్ట్‌పై ఎక్కువసేపు నొక్కి, స్క్రీన్ పైభాగంలో ఉన్న [డౌన్ బాణం]పై క్లిక్ చేయండి. iOSలో ఎడమవైపుకు స్వైప్ చేయండి లేదా కాంటాక్ట్‌పై ఎక్కువసేపు నొక్కి ఆర్కైవ్ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 5: iOS మరియు Android రెండింటిలోనూ ఆర్కైవ్ పరిచయాలను కేవలం ఒక క్లిక్‌తో యాక్సెస్ చేయవచ్చు లేదా అన్‌ఆర్కైవ్ చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to Convert Your Photo into WhatsApp Stickers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X