Youtube లో ఛానెల్ క్రియేట్‌ చేయ‌డ‌మెలాగో తెలుసా.. ఈ ప‌ద్ద‌తి పాటించండి!

|

ఇటీవ‌లి కాలంలో ప్ర‌జ‌లు త‌మ‌ నిత్య కృత్యాలను వివిధ సామాజిక మాధ్య‌మాల ద్వారా ఇత‌రుల‌కు చూపించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యూట్యూబ్ వినియోగం భారీగా పెరిగింది. ప్ర‌తి ఒక్క‌రూ తాము ఎప్పుడు, ఎక్క‌డ‌, ఏం చేస్తున్నాం అనే విష‌యాల్ని వీడియోలుగా చిత్రీక‌రించి Youtubeలో అప్‌లోడ్ చేయ‌డం ప‌రిపాటిగా మారింది. ఒక వ్య‌క్తిగ‌త విష‌యాలే కాకుండా త‌మ‌కు న‌చ్చిన ఇత‌ర‌త్రా ఆస‌క్తిక‌ర అంశాల‌ను కూడా వీడియోలుగా చిత్రీక‌ర‌ణ చేయ‌డం మొద‌లైంది. ఇలా Youtubeలో కంటెంట్ క్రియేష‌న్‌ (Content Creation)తో ఖాతాదారుల‌కు త‌మ వీడియో వ్యూస్‌ (Views)కు అనుగుణంగా ఆదాయం కూడా వ‌స్తుండ‌టం విశేషం. దీంతో Youtubeలో కంటెంట్ క్రియేట‌ర్ల‌కు విప‌రీత‌మైన క్రేజ్ పెరిగింది. అయితే ఈ క్ర‌మంలో కొంద‌రు వీడియోలు తీసే ఆస‌క్తి ఉన్న‌ప్ప‌టికీ యూట్యూబ్‌లో అకౌంట్ తీయ‌డం ఎలాగో తెలీక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కాబ‌ట్టి అలాంటి వారి కోసం ఇప్పుడు మ‌నం యూట్యూబ్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్ర‌క్రియ ద్వారా తెలుసుకుందాం.

 
Youtube లో ఛానెల్ క్రియేట్‌ చేయ‌డ‌మెలాగో తెలుసా.. ఈ ప‌ద్ద‌తి పాటించండి

* యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసుకోవ‌డం చాలా సులువైన ప్ర‌క్రియ‌. మీరు కూడా యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా Gmail లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ Gmail స‌హాయంతో తో యూట్యూబ్ లో Sign in అవ్వాలి.

* యూట్యూబ్‌లోకి లాగిన్ అయిన త‌ర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ప‌లు ర‌కాల ఆప్ష‌న్స్ క‌న‌బ‌డ‌తాయి. వాటిలోనే రెండో ఆప్ష‌న్ "Create a New Channel" అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.

* "Create a New Channel" ఆప్ష‌న్ క్లిక్ చేసిన త‌ర్వాత మీకు ఒక విండో(బాక్స్‌) ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ ఛానల్ కి ఏ పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరుని ఎంటర్ చెయ్యండి. దాంతో పాటు ఛానెల్ ప్రొఫైల్ పిక్చ‌ర్ ను అక్క‌డే అప్‌లోడ్ చేయండి. అంతే ఇక్కడితో మీ YouTube Channel క్రియేష‌న్ అయిపోతుంది.

* ఆ త‌ర్వాత మీ ఛానెల్‌లో పూర్తి వివ‌రాలు, ఛానెల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అనే వివ‌రాల్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం Customize Channel ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీ ఛానల్ కి ఒక Logo ఇవ్వండి. అక్క‌డే మీరు Channel Description ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ గురించి వివరిస్తూ అంటే మీ ఛానల్ లో ఎటువంటి వీడియోలు అప్లోడ్ చెయ్యబోతున్నారు వంటి వివరాలు అన్నితెలియచేయండి.
అలాగే మీ Gmail, Facebook , Twitter వంటి సోషల్ మీడియా పేజీలకు సంబందించిన లింక్స్ ని కూడా Add చేసుకోవచ్చు.

* ఇక మీరు మీ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. ఇందుకోసం ఛానెల్‌లో కుడి వైపు పై భాగంలో + సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ వీడియో ని యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యవచ్చు.

వీడియోల‌పై ఆదాయం ఎలా!

వీడియోల‌పై ఆదాయం ఎలా!

Youtubeలో మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలపై వ్యూస్ ఆధారంగా మీరు ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. ముందుగా మీకు ఇన్‌కం జ‌నరేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కావాలంటే మీ ఛానెల్‌లోని వీడియోల‌న్నిటికీ క‌లిపి 4వేల గంట‌లకు పైగా వీక్ష‌ణ స‌మ‌యం ఉండాలి. దాంతో పాటుగా 1000 మంది స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ (Subscribers)ను మీ ఛానెల్ పొంది ఉండాలి. ఈ రెండు అర్హ‌త‌లు ఉంటే మీరు యూట్యూబ్ నుంచి మానిటైజేష‌న్ (Monitisation) ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌డానికి ముందు మ‌నం యూట్యూబ్ కు మానిటైజేష‌న్ రిక్వెస్ట్ (Monitisation request) పెట్టుకోవాలి. మ‌నం రిక్వెస్ట్ పెట్టుకున్న కొద్ది రోజుల‌కు Youtube సంస్థ మ‌న కంటెంట్‌పై త‌నిఖీలు నిర్వ‌హిస్తుంది. మ‌నం పెడుతున్న కంటెంట్ కాపీ కంటెంటా లేదా స్వ‌త‌హాగా త‌యారు చేసిందా అనే విష‌యాన్ని చూస్తుంది. ఇలా అన్ని అంశాల్లో మ‌న ఛానెల్ ప‌ర్ఫెక్ట్‌గా ఉంది అనుకుంటే మ‌న మానిటైజేష‌న్ రిక్వెస్ట్‌ను Youtube యాక్సెప్ట్ చేస్తుంది.

పిల్ల‌ల నుంచి పెద్ద వాళ్ల దాకా..
 

పిల్ల‌ల నుంచి పెద్ద వాళ్ల దాకా..

నేటి జ‌న‌రేష‌న్‌లో చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద వాళ్ల దాకా ప్ర‌తి ఒక్క‌రు ఆసక్తుల‌కు అనుగుణంగా Youtube ఛానెళ్లు క్రియేట్ చేసి త‌మ స‌త్తా చాటుకుంటున్నారు. ఆదాయాన్ని సైతం ఆర్జిస్తున్నారు. ఇందులో భాగంగా మ‌నం ముఖ్యంగా ఉదాహర‌ణ‌కు కొన్ని ఛానెళ్ల గురించి తెలుసుకోవాలి. మ‌న‌దేశానికి చెందిన వ‌ర్చ‌స్వీ శ‌ర్మ (Varchasvi sharma) అనే చిన్నారి త‌న పేరుతోనే నిర్వ‌హిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 58వేల‌కు పైగా స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారు. త‌న ఛానెల్‌లో ఆ చిన్నారి త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇక తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వ్య‌క్తుల్లో హర్ష‌సాయి (Harsha sai youtube channel) అనే యువ‌కుడు యూట్యూబ్‌లో బాగా ప్రాచుర్యం పొందాడు. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తు అందులో వ‌చ్చిన డ‌బ్బును పేద‌వారి శ్రేయ‌స్సుకు ఖ‌ర్చుపెడుతూ అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతున్నాడు. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప‌క్క రాష్ట్రాల్లోనూ ఇత‌ని పేరు తెలియ‌ని వారుండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ఇత‌ని ఛానెల్‌కు 5 మిలియ‌న్ల‌కు పైగా స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు.

షార్ట్స్ (Shorts) కూడా ప్రారంభం..

షార్ట్స్ (Shorts) కూడా ప్రారంభం..

కేవ‌లం పెద్ద పెద్ద వీడియోలే కాకుండా.. యూట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోల‌ను కూడా అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. వీటినే యూట్యూబ్‌లో షార్ట్స్ (Short Form Of Videos) అంటారు. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్‌, టిక్‌టాక్ వీడియోల మాదిరి ఈ వీడియోలు త‌క్కువ నిడివితో ఉంటాయి. ఈ షార్ట్ వీడియోల‌లో నిడివి ఒక నిమిషం అంత‌క‌న్నా త‌క్కువ ఉంటుంది. ఇటీవ‌ల ఈ షార్ట్ రీల్స్‌కు బాగా ప్రాచుర్యం ద‌క్క‌డంతో యూట్యూబ్ వీటినీ మ‌రింత అభివృద్ధి ప‌ర‌చాల‌ని భావిస్తోంది.

Best Mobiles in India

English summary
How to create a youtube channel

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X