ఈ సాఫ్ట్‌వేర్‌లతో మీరే సొంతంగా Apps క్రియేట్ చేసుకోవచ్చు..

|

గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ ప్రొడక్ట్స్ లో ఆండ్రాయిడ్ ఒకటి. ఈ యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ ప్లాట్ ఫామ్ ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టం ఓపెన్ సోర్స్ కావటంతో కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సమీప బంధువుల్లా పుట్టుకొచ్చిన యాప్స్ మనందరి జీవితాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కమ్యూనికేషన్ అసవరాల దగ్గర నుంచి వ్యక్తిగత అవసరాల వరకు అన్ని లావాదేవీలను ఈ యాప్స్ తీర్చగలుగుతున్నాయి.ఈ రోజుల్లో ఏ వ్యాపారం చేయాలన్నా ఓ వెబ్‌సైట్‌తో పాటు యాప్ కూడా అత్యవసరమైపోయింది.

 
ఈ సాఫ్ట్‌వేర్‌లతో మీరే సొంతంగా Apps క్రియేట్ చేసుకోవచ్చు..

యాప్ ఆధారంగా ఆయా వ్యాపారాలకు క్రేజ్ లభించే పరిస్థితి నెలకుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు సొంతంగా యాప్ తయారు చేయించుకోవాలంటే బోలెడంత డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. ఇటువంటి వారు కొన్ని కొన్ని యాప్స్‌ను ఆశ్రయించటం ద్వారా కోడింగ్ అవసరంలేకుండా యాప్‌లను తయారు చేసుకునే వీలుంటుంది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

3జిబి ర్యామ్ 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.74,99 మాత్రమే,ఫుల్‌ వ్యూ డిస్‌ప్లేతో..3జిబి ర్యామ్ 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.74,99 మాత్రమే,ఫుల్‌ వ్యూ డిస్‌ప్లేతో..

AppsGeyser (యాప్ గీసిర్)

AppsGeyser (యాప్ గీసిర్)

ఈ ఉచిత సర్వీస్ మీ కంటెంట్‌ను యాప్ రూపంలో కన్వర్ట్ చేసి డబ్బు సంపాదించుకునేలే చేస్తుంది. మెసేజింగ్, సోషల్ షేరింగ్, హెచ్‌టిఎమ్ఎల్ 5 ఎన్‌హాన్స్‌మెంట్స్ వంటి అన్ని సౌకర్యాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ఆన్‌లైన్ సొల్యూషన్ ద్వారా ఏ విధమైన కోడింగ్ అవసరం లేకుండా, మీకు కావల్సిన యాప్‌ను అభివృద్థి చేసుకోవచ్చు.

Appypie (యప్పీపై)

Appypie (యప్పీపై)

ఈ క్లౌడ్ బేసిడ్ మొబైల్ యాప్స్ బిల్డర్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎటువంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం లేకుండానే యాప్‌లను అభివృద్ధి చేసి వాటిని ప్లే స్టోర్ ఇంకా ఐట్యూన్ స్టోర్‌లలో పబ్లిష్ చేసుకునే వీలుంటుంది. ఏ విధమైన పరిజ్ఞానం అవసరం లేకుండానే Appy Pie వెబ్‌సైట్ ద్వారా మీకు కావల్సిన అప్లకేషన్‌ను తయారు చేసుకోవచ్చు.

Buzztouch (బజ్‌టచ్)
 

Buzztouch (బజ్‌టచ్)

ఈ ఓపెన్ సోర్స్ యాప్ ఇంజిన్ ద్వారా వేలాది ఐఫోన్, ఐప్యాడ్ ఇంకా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. కంజక్షన్ పద్ధతిలో ఈ యాప్ ఇంజిన్ ను ఉపయోగించుకోవటం జరుగుతోంది. బీటీసెంట్రల్ ప్యానల్ అనే ఓపెన్ సోర్స్ వెబ్ బేసిడ్ సాఫ్ట్ వేర్ ద్వారా బజ్‌టచ్ మొబైల్ యాప్స్‌ను క్రియేట్ చేసుకునే వీలుంటుంది.

AppYet (యాప్‌ఎట్)

AppYet (యాప్‌ఎట్)

ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని ప్రతిఒక్కరు ప్రొఫెషనల్ ఆండ్రాయిడ్ యాప్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఏ విధమైన పరిజ్ఞానం అవసరం లేకుండానే మీకు కావల్సిన అప్లకేషన్‌ను ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా తయారు చేసుకునే వీలును కల్పించారు. అభివృద్ధి చేసిన యాప్‌లను ప్లే స్టోర్‌తో పాటు ఇతర ఆండ్రాయిడ్ మార్కెట్లలో విక్రయించుకునే వీలుంటుంది.

Appclay (యాప్‌క్లే)

Appclay (యాప్‌క్లే)

ఈ సాఫ్ట్‌వేర్‌ను ShepHertz టెక్నాలజీస్‌కు చెందిన కోర్ డెవలప్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్ అభివృద్ధి చేసారు. ఈ సాఫ్ట్‌వేర్ ఆఫర్ చేసే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ ద్వారా ఎటువంటి కోడింగ్, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ఇంకా మెయింటేనెన్స్‌తో పనిలేకుండా HTML5, ఆండ్రాయిడ్ నేటివ్ యాప్‌లను డెవలప్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
If you have much experience or thought about android app’s but don’t have any coding experience then this post is going to benefit you! You can easily create android apps without any coding.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X